ప్రధాని రేసులో నితిన్ గడ్కరీ?

Publish Date:Jun 23, 2025

Advertisement

బీజేపీ సీనియర్ నాయకుడు, పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు, నాగపూర్ ఎంపీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ  ప్రధాన మంత్రి పదవిని ఆశిస్తున్నారా? ఆ దిశగా ఆయన అడుగులు పడుతున్నాయా? ప్రయత్నాలు ప్రారంభించారా? అంటే అటు నుంచి అటువంటి సంకేతాలే వస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా రెండు రోజుల  కిందట నితిన్ గడ్కరీ తమ రాజకీయ భవిష్యత్ గురించి చేసిన వ్యాఖ్యలు   నాగపూర్ నుంచి ఢిల్లీ వరకు పరివార్ వర్గాల్లో సంచలనంగా మారినట్లు తెలుస్తోంది.

 , రెండు రోజుల కిందట ఒక టీవీ చానల్  కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో నితిన్ గడ్కరీ..  2029 ఎన్నికల్లో తమ పాత్ర గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా  ఇంత వరకు చూసింది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది  అంటూ మర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దీంతో గడ్కరీ  తాను ప్రధాని రేసులో ఉన్నాననే సంకేతాలు పంపుతున్నారని  రాజకీయ, పరివార్ వర్గాల్లో చర్చ మొదలైందని అంటున్నారు. అయితే..  ఆ వెంటనే గడ్కరీ,  బీజేపీలో ఎవరు ఏ బాధ్యతలు నిర్వహించాలో పార్టీ నిర్ణయిస్తుందనీ..  పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగిస్తే, ఆ బాధ్యత నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నానని కొంత క్లారిటీ ఇచ్చారు. అయితే..  అందులోనూ పార్టీ ఆదేశిస్తే ప్రధాని పదవి చేపట్టేందుకు సిద్దంగా ఉన్నాననే సంకేతం ఉందని  పార్టీ వర్గాలు గుసగుసలు పోతున్నాయి. 

అదలా ఉంచితే..  ప్రధాని నరేంద్ర మోదీ, స్వయం ప్రకటిత సార్వజనీన రిటైర్మెంట్  ఏజ్  75 కి చేరువలో ఉన్న సమయంలో.. గడ్కరీ ప్రధాని కుర్చీలో కర్చీఫ్  వేయడం మరింత ఆసక్తిని రేకేత్తిస్తోందని  అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మరో మూడు నెలలలో.. అంటే  సెప్టెంబర్ 17 న 75 ఏళ్లు దాటి దాటి 76వ పడిలో అడుగు పెడతారు. అంటే..  రిటైర్మెంట్’ ఏజ్ లోకి అడుగు పెడుతున్నారు. అదలా ఉంటే.. మరో వంక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రిటైర్మెంట్ గురించి,మోదీ వారసుని గురించి..  ఇటు పార్టీ, పరివార్ వర్గాల్లో ఏదో ఒక స్థాయిలో ఎంతో కొంత చర్చ అయితే.. మొదలైనట్లు మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. 

అయితే..  నిజంగా  మోదీ ఇప్పటికిప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటారా లేదా అనే విషయంలో పెద్దగా అనుమనాలు లేవు. ఇటు పార్టీ  నుంచి గానీ అటు పరివార్ నుంచి గానీ  అటువంటి సంకేతాలు, సూచనలు ఏవీ కనిపించడం లేదు.  నిజానికి, 2029 ఎన్నికల తర్వాత కూడా  మోదీ నే ప్రధాని  అని అమిత్ షా సహా  ముఖ్య నాయకులు మరి కొందరు అనేక సందర్భాలాలో స్పష్టం చేశారు. అలాగే..  ఇప్పటికైతే మోదీ మనసు కూడా రిటైర్మెంట్ ఆలోచనలు ఏ మాత్రం  కనిపించడం లేదు.  సో.. మోదీ రిటైర్మెంట్ తీసుకుంటారా, లేదా అనే విషయం పక్కన పెడితే.. బీజేపీ, సంఘ్ పరివార్ వర్గాల్లో గత కొంత కాలంగా  ప్రధాని మోదీ వారసుడు ఎవరన్న.. చర్చ జరుగుతోందన్నది మాత్రం కాదన లేని వాస్తవం. నిజానికి  ఉత్తర ప్రదేశ్ ముఖ్యమత్రి యోగి ఆదిత్య నాథ్, అమిత్ షా తో పాటుగా మరికొన్ని పేర్లు కూడా  ప్రధాని రేసులో ఉన్నట్లు మీడియా చర్చల్లో  వినిపిస్తున్నాయి. సో .. 2029 ఎన్నికల్లో కొత్త చిత్రం’ చూస్తారు అంటూ చేసిన గడ్కరీ ప్రకటన.. సమయం సందర్భం దృష్ట్యా కూడా ప్రాధాన్యత సంతరించుకుందని అంటున్నారు.  

నిజానికి..  ఇప్పుడే కాదు  గతంలోనూ ప్రధాని పదవికి గడ్కరీ పేరు   ప్రముఖంగా తెరపైకొచ్చింది. ముఖ్యంగా..  2019సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాని పక్షంలో సౌమ్యు డు, వివాద రహితుడుగా పేరున్న గడ్కరీ ప్రధాని రేసులో ఉంటారనే  చర్చ జరిగింది. అయితే..  2019లో ఆ అవసరం రాలేదు.  బీజేపీ సొంతంగానే మెజారిటీ (303)  సాధించింది. ఎన్డీఏ మెజారిటీ మరింత పెరిగింది. మోదీ  మళ్ళీ ప్రధాని అయ్యారు.  2024లో బీజేపీ సొంత బలం కొంత తగ్గినా.. చంద్రబాబు, నితీష్ కుమార్ చెరో చేయి వేయడంతో  మోదీ  మూడవసారి ప్రధాని అయ్యారు. సో.. ఇప్పటికిప్పుడు  మోడీ ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకునే పరిస్థితి  అయితే లేదు. అయితే..  2029 నాటికి, పరిసస్థితి ఎలా ఉంటుందో, ఎన్నెన్ని మార్పులు వస్తాయో చెప్పలేము.  అందుకే ఎందుకైనా మంచిదని, గడ్కరీ కర్చీఫ్ వేసి ఉండవచ్చని బీజేపీ, పరివార్ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

By
en-us Political News

  
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు. నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా, బూతుల నానిగా అనితర సాధ్యమైన గుర్తింపు ఉన్న కొడాలి నాని, 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం, గుడివాడ నియోజకవర్గంలో తాను స్వయంగా ఓడిపోవడంతో వెనక్కు తగ్గారు. కేసుల భయంతో మౌనాన్ని ఆశ్రయించారు. అసలు రాజకీయాలలో ఉన్నారా లేరా అన్నంతగా సైలెంట్ అయిపోయారు.
జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వచ్చి అత్యధికంగా బెంగళూరులోనే మకాం ఉంటుండం ఒక కారణమైతే.. రాష్ట్రానికి, సొంత జిల్లాకు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు, నాయకులకు అప్పాయింట్ మెంట్ దొరకని పరిస్థితి మరో కారణంగా చెబుతుంటారు. ముఖ్యంగా జగన్ అందుబాటులో లేకపోవడం ప్రభావం ఆయన సొంత జిల్లా కడపలో మరీ తీవ్రంగా ఉంది.
కవిత సైతం త‌న వ‌ల్ల పార్టీ ఎలా ఓడిపోయిందని ప్రకటించి చేతులు దులుపుకోవడం కాదు.. అందుకు సంబంధించి వివరణ ఇవ్వాలనీ, లెక్కలు తేల్చాలనీ డిమాండ్ చేయడం ద్వారా మొత్తం బీఆర్ఎస్ నే డిఫెన్స్ లో పడేశారు. దాని నుంచి బయటపడడానికి ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగి.. అప్పటి కేటీఆర్, కేసీఆర్ ల ప్రసంగాలు, ప్రకటనలను రీ పోస్టు చేస్తూ హడావుడి చేస్తున్నది.
తుమ్మల నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల కిందట దుబాయ్ వెళ్లారు. మంత్రి కుటుంబ సభ్యులలో ఒకరు అనారోగ్యంతో ఉండటంతో మెరుగైన చికిత్స అందించడం కోసం ఆయన దుబాయ్‌కు వెళ్లినట్లు సమాచారం. చికిత్స అనంతరం తిరిగి రావాలని భావిస్తున్న తరుణంలో పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చి, ఆ ప్రభావంతో దుబాయ్ విమానాశ్రయం మూతపడింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.