ఎవరైతే మోసం చేస్తారో వారే గొప్ప నాయకులు : గడ్కరీ
Publish Date:Sep 1, 2025
Advertisement
నేటి తరం రాజకీయలపై కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను మోసం చేసే వారినే గొప్ప నాయకులుగా పరిణిస్తారని తెలిపారు. మహారాష్ట్ర నాగ్‌పుర్‌లో అఖిల భారత మహానుభావ పరిషత్తు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ పలు అంశాలపై నిర్మొహమాటంగా మాట్లాడారు. అయితే ఏదైనా సాధించడానికి ఒక షార్ట్ కట్ ఉంటుందని, కానీ షార్ట్ కట్ వాడితే అది మనల్ని షార్ట్‌గా కట్ చేస్తుందన్నారు. అందుకే నిజాయతీ, విశ్వసనీయత వంటి విలువలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. దీర్ఘకాలిక విజయం ఎప్పుడూ నిజంపై ఆధారపడి ఉంటుంది. అంతిమంగా ధర్మమే గెలుస్తుందని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు’ అని గడ్కరీ పేర్కొన్నారు. తన దైనందిన జీవితంలో(రాజకీయాల్లో) నిజం మాట్లాడటం నిషేధమని వ్యాఖ్యానించారు. ‘నేను పనిచేసే రంగంలో మనస్ఫూర్తిగా మాట్లాడటం నిషధమని తెలిపారు. ఇటీవల గడ్కరీ మాట్లాడుతూ కోర్టు కేసుల వల్ల ప్రభుత్వం క్రమశిక్షణతో పనిచేస్తుందని, పరిపాలన అద్భుతంగా జరుగుతుందని వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయించే వారి కారణంగా రాజకీయ నాయకుల్లో క్రమశిక్షణ పెరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. మంత్రులు చేయలేని పనులను న్యాయస్థానాలు చేయిస్తాయని గడ్కరీ తెలిపారు
http://www.teluguone.com/news/content/nitin-gadkari-36-205402.html





