అన్నదాతలకు రూ 86,600 కోట్ల రుణాలు!
Publish Date:May 14, 2020
Advertisement
వ్యవసాయం, వలస కార్మికులు, వీది వ్యాపారాలు చేసే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి నిర్మలా సీతారామన్ రెండో ప్యాకేజ్ విడుదల చేశారు. పేదలు, వలస కార్మికులు, రైతు కూలీలుకు చేయూతనివ్వనున్నాట్టు తెలియచేసారు. మొత్తం 9 రంగాలకు ఉద్దీపన చర్యలు ప్రకటించారు నిర్మలా సీతా రామన్. ఇప్పటికే చిన్న కారు, సన్నకారు రైతులకు 4 లక్షలు కోట్లు ఇవ్వగా కొత్తగా 25 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వబోతున్నట్టు తెలియచేసారు. రైతులను ఆదుకునేందుకు ప్యాకేజ్‌లో రెండు పథకాలు పెట్టాం. మార్చి, ఏప్రిల్‌లో రైతులకు రూ 86,600 కోట్ల రుణాల ఆమోదం. చిన్నసన్నకారు రైతులకు రూ 4 లక్షల కోట్ల రుణాల మంజూరు. 25 లక్షల మంది నూతన కిసాన్‌కార్డుదారులకు రూ 25,000 కోట్ల రుణం. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు రాష్ట్రాలకు రూ .6700 కోట్లు నాబార్డు ద్వారా 29,500 గ్రామీణ బ్యాంకులకు నిధులు. రబీలో సన్నకారు, మధ్యతరహా రైతులకు రూ 30 వేల కోట్ల రుణాలు. సహకార బ్యాంకుల ద్వారా 3 వేల కోట్ల మంది రైతులకు అదనంగా రుణాలు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.
సన్నకారు రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు. గ్రామీణ మౌలిక వసతులకు రూ 4200 కోట్లు కేటాయించాం. రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తామని, వారి కోసం పలు సంక్షేమ పథకాలు కొనసాగుతాయని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మాలా సీతారామన్ ప్రకటించారు. రూ 86,600 కోట్ల వ్యవసాయ రుణాలు ఆమోదించామని తెలిపారు. పాతిక లక్షల మంది నూతన కిసాన్‌కార్డు దారులకు రూ 25,000 కోట్ల రుణం అందచేస్తామని తెలిపారు. మధ్యతరగతి కోసం ప్రత్యేకంగా క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకం ప్రవేశపెడతామని మంత్రి వెల్లడించారు.
http://www.teluguone.com/news/content/nirmala-sitharaman-on-agriculture-loans-25-99162.html





