స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్

Publish Date:Jun 13, 2026

Advertisement

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్  స్వచ్ఛ పాఠశాల  కార్యకర్తగా మారారు. ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనను పురస్కరించుకుని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను  స్వచ్ఛ పాఠశాల  పేరుతో శుభ్రం చేసే పనికి శ్రీకారం చుట్టారు. తన పార్లమెంట్ పరిధిలోని ప్రతి పాఠశాలను పరిశుభ్రంగా ఉంచాలంటూ బండి సంజయ్ ఇచ్చిన పిలుపు మేరకు   నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలంతా శనివారం (జూన్ 13)తమ తమ పరిధుల్లోని ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రం చేశారు. సొంతంగా చీపురు తెచ్చుకుని, క్లాత్, మగ్గు, బకెట్ తెచ్చుకుని తరగతి గదులను క్లీన్ చేశారు. 

అందులో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం    సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం (జూన్ 13) స్వయంగా చీపురు పట్టి ఊడ్చారు.  పైపు నీళ్లతో తరగతి గదిని క్లీన్ చేశారు. ఆ తరువాత శుభ్రంగా తుడిచారు. విద్యార్థులు కూర్చునే టేబుల్ కింద దుమ్ము ధూలి లేకుండా క్లీన్ చేశారు. తరగతి గదిలోని మూలమూలకు వెళ్లి చీపురు పట్టి ఊడ్చారు. నీళ్లతో క్లీన్ చేశారు. తరగతి ఆవరణలోనూ నీళ్లు చల్లారు.  

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..  మోదీ 12 ఏళ్ల పాలనను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వివిధ వర్గాలను కలుస్తున్నాం. అనేక సభలు, సమ్మేళనాలు నిర్వహిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా  స్వచ్ఛ పాఠశాల పేరుతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని పాఠశాలలను పరిశుభ్రం చేయాలని నిర్ణయించాం. రాజకీయాలకు అతీతీంగా మన పాఠశాలను మనం శుభ్రం చేసుకుందామని కోరాం.  స్పూర్తిదాయకమైన సేవా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. టీచర్లు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు కూడా పాల్గొని తమ వంతు బాధ్యతను నెరవేరుస్తున్నారు. నిన్ననే ఏ స్కూల్ ను ఎవరెవరు శుభ్రం చేయాలనే విషయంపై    టిఫిన్ బైఠక్’ నిర్వహించాం. అందులో భాగంగా ఈరోజు పాఠశాలలను శుభ్రం చేస్తున్నాం. దీంతోపాటు పాఠశాలల్లో పిల్లలను చేర్చించాలని కోరుతూ ఎల్లుండి గ్రామాలు, మండలాల వారీగా ర్యాలీలు కూడా నిర్వహించబోతున్నామని చెప్పారు. 

ప్రభుత్వ పాఠశాలలను అభివ్రుద్ధి చేయాలన్నది నా సంకల్పం. అందులో భాగంగానే ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ చదివే విద్యార్థులందరికీ ఈసారి కూడా సైకిళ్లు అందించబోతున్నామని బండి సంజయ్ తెలిపారు. టెన్త్ విద్యార్థులందరికీ తన వేతనం నుండి పరీక్ష ఫీజు చెల్లిస్తానన్నారు.  

By
en-us Political News

  
తెలంగాణ పోలీస్ శాఖలో భారీ స్థాయిలో బదిలీల పర్వం చోటుచేసుకుంది.
ఘాట్కేసర్‌లో అర్థరాత్రి వేళ చోటుచేసుకున్న ఘటన స్థానికులను కలవరానికి గురిచేసింది.
తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
వేడివేడి బజ్జీల వాసనతో ఆకర్షితులైన స్థానికులు వాటిని ఆస్వాదించేందుకు ఆగిపోయారు.
తెలంగాణ ప్రభుత్వం వీఐపీల భద్రత కుదింపు నిర్ణయాని కారణం, రాష్ట్రంలో పూర్తిగా తొలగిపోయిన నక్సల్స్ సమస్యగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గతంలో తెలంగాణ సరిహద్దుల్లోనూ, కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ తీవ్రంగా ఉన్న మావోయిస్టుల ప్రభావం ఇప్పుడు కలికానిక్కూడా కనిపించనంతా తగ్గిపోయిందని ఆ నివేదిక స్పష్టం చేస్తున్నదని పేర్కొంది.
ఇరాన్‌పై అమెరికా దాడి చేసింది. దీంతో ఇరాన్‌ అమెరికా అనుకూల దేశాలపై ప్రతీకార దాడులు చేపట్టింది. ఈ క్రమంలో పనామా జెండా ఎగురవేస్తున్న కికు అనే చమురు నౌకపై డ్రోన్‌ దాడి జరిగింది. ఆ నౌకలో సుమారు రెండు మిలియన్‌ బ్యారెళ్ల ముడి చమురు ఉండగా, సిబ్బంది ఎవరికీ హాని కలగలేదు. ఈ ఘటన తర్వాత అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ఇరాన్‌లోని పది ముఖ్యమైన సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులు చేసింది.
సాంకేతికత ఎంత పెరిగినా వైద్యానికి ప్రత్యామ్నాయం కాలేదనే చేదు నిజాన్ని మరోసారి నిరూపించింది.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా మధిరలో బహిరంగ సభ నిర్వహించడం సాధ్యం కాదని అధికారులు తేల్చేశారు. హెలికాప్టర్ ప్రయాణానికి వాతావరణం ఏమాత్రం అనుకూలించకపోవడం, మైదానాలు వాన నీటితో నిండిపోవడంతో ముఖ్యమంత్రి పర్యటనను రద్దు చేసుకోక తప్పలేదు.
గత కొంతకాలంగా ప్రేమించుకున్న యువతి, యువకుడు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు
ప్రభుత్వం చేపట్టిన ఎస్‌ఐఆర్ సర్వే, నివేదికల ప్రక్రియ ముజీబుర్ రహ్మాన్ జీవితంలో తీవ్ర ఆందోళనను నింపింది. ఈ ఎస్‌ఐఆర్ జాబితాలో తన పేరు లేదనే విషయం అతనికి తెలిసింది. తన పేరు నమోదు కాకపోవడంతో భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా వచ్చే ఎటువంటి సహాయం లేదా పెన్షన్లు, రేషన్ వంటి ప్రయోజనాలు తన ఇద్దరు దివ్యాంగులైన పిల్లలకు అందవేమోనని అతనుఆందోళనకుగురయ్యాడు.
ఆయన ఐదు రోజుల్లో నాలుగు రోజుల జిల్లాల పర్యటనలో భాగంగా తొలుత నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో పేదల సేవలో కార్యక్రమం ద్వారా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని సీఎం చంద్రబాబు లబ్థిదారులకు అంద జేస్తారు. అదే రోజు తిరుపతి చేరుకుని అక్కడి శ్రీసిటీలో.. హీరో మోటో కార్ప్ సుమా . 750 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న గ్లోబల్ పార్ట్స్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. రాత్రికి శ్రీసిటీలోనే బస చేస్తారు.
పుణేకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ అత్యంత దారుణ హత్యకు గురైన ఉదంతం
ఎల్ నినో కారణంగా తలెత్తే సవాళ్లను రైతులు ధైర్యంగా అధిగమించాలనీ, ప్రకృతి సాగుతో పంటలు పండించి, భూమిని, ఆరోగ్యాన్ని విషతుల్యం కాకుండా కాపాడుకుందామని ఆయన పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.