గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. రాత్రిపూట ఈ అలవాట్లు మానేయాల్సిందే..!

Publish Date:Mar 30, 2026

Advertisement

గుండె శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. దానిని సరిగ్గా జాగ్రత్తగా చూసుకోకపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది తమకు తెలియకుండానే కొన్ని అలవాట్లు అలా కంటిన్యూ చేస్తుంటారు. పైగా అవన్నీ చాలా ఆరోగ్యమైనవే అని అనుకుంటూ ఉంటారు. అయితే  గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రాత్రిపూట నివారించాల్సిన కొన్ని అలవాట్లు ఇక్కడ ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..


రాత్రి భోజనం..

రాత్రిపూట భోజనం గురించి చాలామందికి ఒక నిర్లక్ష్యం ఉంటుంది.  చాలామంది బాగా పుష్టిగా తింటుంటారు.  కానీ రాత్రి బోజనం అతిగా తినడం గుండె ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే రాత్రి బోజనం  అతిగా తినకూడదు. రాత్రి అతిగా తింటే  జీర్ణ సమస్యలు తలెత్తి, రక్త ప్రసరణ,  గుండె పనితీరు ప్రభావితం కావచ్చు.

కాఫీ..

కొందరికి గంట గంటకు కాఫీ తాగే అలవాటు ఉంటుంది.  రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా కాస్త కాపీ సిప్ చేస్తుంటారు. కానీ కాఫీలో కెఫీన్ ఉంటుంది. ఇది  నిద్రను ప్రభావితం చేస్తుంది. తగినంత నిద్ర లేకపోతే గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది.

ఫోన్..

రాత్రి పూర్తీగా కళ్లు మూత పడేవరకు పోన్ ను వాడేవారు చాలా మంది ఉంటున్నారు.  అయితే రాత్రి పడుకునే ముందు  ఫోన్‌ను ఉపయోగించడం మానుకోవాలి. రాత్రి పూట పోన్ ఎక్కువ చూస్తే ప్రశాంతమైన నిద్ర పట్టదు.  పైగా మెదడు, కళ్లు చాలా అలసిపోతాయి.  గుండె ఆరోగ్యాన్ని కూడా  ప్రభావితం చేస్తుంది.

చిరుతిళ్లు..

కొంతమందికి రాత్రి భోజనం తర్వాత కూడా కాఫీ తాగే అలవాటు ఉంటే.. మరికొందరికి నిద్రపోయే ముందు చిరుతిండి తినే అలవాటు ఉంటుంది. దీనివల్ల  ఆకలి తగ్గడమే కాకుండా,  నిద్ర కూడా ప్రభావితం అయ్యే ప్రభావం ఉంటుంది. తగినంత నిద్ర లేకపోవడం  గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

ఒత్తిడి..

నేటి కాలంలో చాలా మంది చేస్తున్న ఫిర్యాదు ఒత్తిడి.  అధిక ఒత్తిడి చాలా ప్రమాదం. అధిక ఒత్తిడి ఉన్నప్పుడు, కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది అధిక రక్తపోటుకు,  గుండె ఆరోగ్యం దెబ్బతినడానికి దారితీయవచ్చు.

మద్యం..

రాత్రి పడుకునే ముందు మద్యం సేవించడం చాలామంది మగవారికి అలవాటు.  ఈ అలవాటు వల్ల  రక్తపోటు పెరిగి గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి మద్యం సేవించడాన్ని మానుకోవడం మంచిది.

                                 *రూపశ్రీ.

By
en-us Political News

  
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఒక్కోరకం కూరగాయలలో ఒకో రకం పోషకాలు ఉంటాయి.  కొన్ని రకాల కూరగాయలు ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తాయి.  అలాంటి కూరగాయలలో బ్రోకలీ కూడా ఒకటి.  చూడటానికి ఆకుపచ్చ రంగులో..
మండే వేసవి ఎండ నుండి తప్పించుకోవడానికి గంటల తరబడి ఏసీ ముందు కూర్చోవడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ఇది సౌకర్యవంతంగా అనిపించినప్పటికీ, ఈ అలవాటు  శరీరంపై రహస్యంగా..
భారతీయులు చాలామంది రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన పాలు తాగుతూ ఉంటారు. ఆయుర్వేదపరంగా పసుపు పాలు ఎంతో ఆరోగ్యకరమైనవి.  పసుపు పాలలో ఉన్న ప్రయోజనాల కారణంగా వీటిని గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారు...
భారతీయ వంటగదిలో వెల్లుల్లి ఒక ముఖ్యమైన పదార్థం. వెల్లుల్లి లేకుండా చాలా కూరలకు ఆ రుచి ఉండదు. కానీ వెల్లుల్లి కేవలం రుచిని పెంచేది మాత్రమే కాదు, చాలా వ్యాధులకు ఔషధం కూడా. ఆయుర్వేదం వెల్లుల్లిని వైద్య చికిత్సలో ఉపయోగిస్తుంది.
మానవ శరీరంలో మూత్రపిండాలు అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. శరీరంలో కనిపించే చాలా లక్షణాలను చాలా సార్లు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఇలా శరీరంలో కనిపించే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం అనేది  కొన్నిసార్లు మూత్రపిండాల వైఫల్యానికి సంకేతాలు కావచ్చని వైద్యులు..
నేటికాలంలో చాలామంది ఆరోగ్య స్పృహతో ఉంటున్నారు.  ఎంత బిజీగా ఉన్నా సరే.. తీసుకునే పండ్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు...
వేసవి కాలం రాగానే చాలామంది లైఫ్ స్టైల్ మారుతుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో, పానీయాల విషయంలో చాలా మార్పులు వచ్చేస్తాయి. బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల పేమస్ పానీయం ఇది. అయితే దీని ప్రయోజనాల దృష్ట్యా దేశ వ్యాప్తంగా ఇష్టంగా ఉపయోగిస్తారు....
ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ నేటి కాలంలో మారిన జీవనశైలి కారణంగా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఏదో ఒక దీర్ఘకాలిక (Chronic) ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఎన్ని మందులు వాడినా సమస్య తాత్కాలికంగా తగ్గుతుందే తప్ప, పూర్తిగా నయం కావడం లేదని చాలా మంది ఆవేదన చెందుతుంటారు. అలాంటి వారికి హోమియోపతీ ఒక గొప్ప వరప్రసాదం. కేవలం లక్షణాలను అణచివేయడం...
ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఊరికే అనలేదు. కానీ నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి వల్ల మనలో చాలా మంది మలబద్ధకం (Constipation) మరియు మధుమేహం (Diabetes) వంటి సమస్యలతో సతమతమవుతున్నారు....
డ్రై ఫ్రూట్స్ శరీరానికి చాలా మంచివని చెబుతారు.  డ్రై ఫ్రూట్స్  రుచిగా ఉండటమే కాకుండా శరీరానికి మంచి పోషకాలను,  ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి.  అయితే డ్రై ఫ్రూట్స్ శరీరానికి ఎంత మంచివో.. వాటిలో ఎంత మంచి పోషకాలు ఉంటాయో....
వేసవి వచ్చేసింది. వేసవి కాలం దానితో పాటు మండే ఎండలు,  ఎండ వేడిని వెంట పెట్టుకుని వస్తుంది. ఈ సీజన్‌లో చెమట, శరీరం తేమ కోల్పోవడం,   నిరంతరం  అలసటగా అనిపించడం వంటి సమస్యలు పెరుగుతాయి...
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆరోగ్యం పట్ల మనం చూపే నిర్లక్ష్యం మనల్ని ఎక్కడికి తీసుకువెళుతుందో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8 బిలియన్ల మంది ఊబకాయం (Obesity) మరియు దాని సంబంధిత వ్యాధులతో పోరాడుతున్నారు...
ప్రతిరోజూ మూడు పూటలా ఆహారం తీసుకోవడం తప్పనిసరి. నేటికాలంలో ఆహారం విషయంలో చాలా సీరియస్ నెస్ వచ్చింది.  నిజానికి నేటికాలంలో పుడీస్ ఎక్కువ అయ్యారు.  నచ్చిన ఆహారం తినడంలో ఎలాంటి కాంప్రమైజ్ కావడం లేదు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.