తిన్న తర్వాత 10నిమిషాలు నడిస్తే ఇన్ని ప్రయోజనాలు ఉంటాయని తెలుసా?

Publish Date:Mar 13, 2026

Advertisement


ప్రతిరోజూ మూడు పూటలా ఆహారం తీసుకోవడం తప్పనిసరి. నేటికాలంలో ఆహారం విషయంలో చాలా సీరియస్ నెస్ వచ్చింది.  నిజానికి నేటికాలంలో పుడీస్ ఎక్కువ అయ్యారు.  నచ్చిన ఆహారం తినడంలో ఎలాంటి కాంప్రమైజ్ కావడం లేదు, నచ్చినంత తినడంలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ కారు. అయితే ప్రతి రోజూ మూడు పూటలా ఆహారం తీసుకోవడం ఎంత సహాజమో.. ఆహారం తీసుకోగానే 10 నిమిషాలు నడవడం అంత ముఖ్యమని అంటున్నారు వైద్యులు,  ఫిట్‌నెస్ నిపుణులు.  ఆహారం తీసుకున్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఊహించని విధంగా ప్రయోజనాలు చేకూరతాయని అంటున్నారు. ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే..

వాకింగ్..

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎలాంటి కష్టం లేకుండా, డబ్బు ఖర్చుపెట్టకుండా చేయగలిగే అతి తేలిక వ్యాయామం ఏదైనా ఉందంటే అది వాకింగ్ ఏ.  వాకింగ్ ను చాలామంది దినచర్యలో భాగం చేసుకుంటారు.  ఉదయం లేదా సాయంత్రం వాకింగ్ వెళ్లడం చేస్తుంటారు. కానీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆహారం తిన్న తర్వాత ఓ 10 నిమిషాలు నడవడం చాలా మంచి అలవాటు అని అంటున్నారు.

తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే కలిగే ప్రయోజాలు..

భోజనం తర్వాత ప్రతి రోజూ 10 నిమిషాలు నడిస్తే కాళ్ల కండరాలు బలపడతాయట.  ఇది ప్రతిరోజూ ప్రాక్టీస్ చేస్తుంటే కొన్ని రోజులలోనే చాలా మంచి ఫలితాలు గమనించవచ్చని అంటున్నారు.

నేటికాలంలో చాలామంది ఎదుర్కుంటున్న సమస్య షుగర్.  రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ ఉండటం వల్ల ఆహారం తీసుకోవడానికి కూడా భయపడుతుంటారు.  అయితే ప్రతిరోజూ ఆహారం తీసుకున్న తర్వాత 10 నిమిషాలు వాకింగ్ చేయాలి.  ఇలా చేయడం వల్ల చక్కెర స్థాయిలు అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది అని అంటున్నారు.  

ఆహారం తిన్న తర్వాత 10 నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల  బరువు తగ్గడానికి సహాయపడుతుంది.  వాకింగ్ చేయడం వల్ల శరీర కదలికలు జరిగి పేగులు కూడా కదలికలకు లోనవుతాయి.  జీవక్రియ  మెరుగవుతుంది.   ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ప్రతి చిన్న విషయానికి ఒత్తిడికి గురయ్యే వారు ఉంటారు.  ఇలాంటి వారు బోజనం చేసిన తర్వాత 10న నిమిషాలు నడవడం అలవాటు చేసుకోవాలి.  ఇది చాలా గొప్పగా సహాయపడుతుంది.  మనసును ప్రశాంత పరుస్తుంది.  ఒత్తిడి తగ్గిస్తుంది.

నేటికాలంలో చాలా మంది పొట్ట ఆరోగ్యంతోనే ఇబ్బంది పడుతున్నారు.  చాలామందికి పొట్ట ముందుకు చొచ్చుకుని వచ్చి చాలా ఇబ్బంది పెడుతుంటుంది. నిజానికి ఇలాంటి వారికే డయాబెటిస్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది.  అయితే బోజనం చేయగానే కూర్చోవడం లేదా పడుకోవడం చేయకుండా 10 నిమిషాలు వాకింగ్ చేస్తే పొట్ట వచ్చే అవకాశాలు తగ్గుతాయి. బరువు కూడా తగ్గుతారు.

                                  *రూపశ్రీ. 

By
en-us Political News

  
ఆరోగ్యంగా ఉండటానికి నీరు త్రాగడం మంచిదని చెబుతారు.  నీకు ఎంత తాగితే ఆరోగ్యం అంత బాగుంటుందని కూడా చెబుతారు. ఆరోగ్య  నిపుణులు రోజుకు  8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగాలని సిఫార్సు చేస్తున్నారు...
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఒక్కోరకం కూరగాయలలో ఒకో రకం పోషకాలు ఉంటాయి.  కొన్ని రకాల కూరగాయలు ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తాయి.  అలాంటి కూరగాయలలో బ్రోకలీ కూడా ఒకటి.  చూడటానికి ఆకుపచ్చ రంగులో..
మండే వేసవి ఎండ నుండి తప్పించుకోవడానికి గంటల తరబడి ఏసీ ముందు కూర్చోవడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ఇది సౌకర్యవంతంగా అనిపించినప్పటికీ, ఈ అలవాటు  శరీరంపై రహస్యంగా..
భారతీయులు చాలామంది రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన పాలు తాగుతూ ఉంటారు. ఆయుర్వేదపరంగా పసుపు పాలు ఎంతో ఆరోగ్యకరమైనవి.  పసుపు పాలలో ఉన్న ప్రయోజనాల కారణంగా వీటిని గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారు...
గుండె శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. దానిని సరిగ్గా జాగ్రత్తగా చూసుకోకపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది తమకు తెలియకుండానే కొన్ని అలవాట్లు అలా కంటిన్యూ చేస్తుంటారు...
భారతీయ వంటగదిలో వెల్లుల్లి ఒక ముఖ్యమైన పదార్థం. వెల్లుల్లి లేకుండా చాలా కూరలకు ఆ రుచి ఉండదు. కానీ వెల్లుల్లి కేవలం రుచిని పెంచేది మాత్రమే కాదు, చాలా వ్యాధులకు ఔషధం కూడా. ఆయుర్వేదం వెల్లుల్లిని వైద్య చికిత్సలో ఉపయోగిస్తుంది.
మానవ శరీరంలో మూత్రపిండాలు అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. శరీరంలో కనిపించే చాలా లక్షణాలను చాలా సార్లు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఇలా శరీరంలో కనిపించే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం అనేది  కొన్నిసార్లు మూత్రపిండాల వైఫల్యానికి సంకేతాలు కావచ్చని వైద్యులు..
నేటికాలంలో చాలామంది ఆరోగ్య స్పృహతో ఉంటున్నారు.  ఎంత బిజీగా ఉన్నా సరే.. తీసుకునే పండ్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు...
వేసవి కాలం రాగానే చాలామంది లైఫ్ స్టైల్ మారుతుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో, పానీయాల విషయంలో చాలా మార్పులు వచ్చేస్తాయి. బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల పేమస్ పానీయం ఇది. అయితే దీని ప్రయోజనాల దృష్ట్యా దేశ వ్యాప్తంగా ఇష్టంగా ఉపయోగిస్తారు....
ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ నేటి కాలంలో మారిన జీవనశైలి కారణంగా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఏదో ఒక దీర్ఘకాలిక (Chronic) ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఎన్ని మందులు వాడినా సమస్య తాత్కాలికంగా తగ్గుతుందే తప్ప, పూర్తిగా నయం కావడం లేదని చాలా మంది ఆవేదన చెందుతుంటారు. అలాంటి వారికి హోమియోపతీ ఒక గొప్ప వరప్రసాదం. కేవలం లక్షణాలను అణచివేయడం...
ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఊరికే అనలేదు. కానీ నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి వల్ల మనలో చాలా మంది మలబద్ధకం (Constipation) మరియు మధుమేహం (Diabetes) వంటి సమస్యలతో సతమతమవుతున్నారు....
డ్రై ఫ్రూట్స్ శరీరానికి చాలా మంచివని చెబుతారు.  డ్రై ఫ్రూట్స్  రుచిగా ఉండటమే కాకుండా శరీరానికి మంచి పోషకాలను,  ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి.  అయితే డ్రై ఫ్రూట్స్ శరీరానికి ఎంత మంచివో.. వాటిలో ఎంత మంచి పోషకాలు ఉంటాయో....
వేసవి వచ్చేసింది. వేసవి కాలం దానితో పాటు మండే ఎండలు,  ఎండ వేడిని వెంట పెట్టుకుని వస్తుంది. ఈ సీజన్‌లో చెమట, శరీరం తేమ కోల్పోవడం,   నిరంతరం  అలసటగా అనిపించడం వంటి సమస్యలు పెరుగుతాయి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.