తదుపరి సినిమా ఎపీలో…!

Publish Date:Jun 14, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబుని సినీ ఇండస్ట్రీ పెద్దలు కలవనున్నారు. సరిగ్గా అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షూటింగుల కోసం విదేశాలకు వెళ్ళనున్నారు. మరో వైపు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గద్దర్ సినిమా అవార్డుల ప్రదానోత్సవానికి కౌంట్ డౌన్ మొదలైపోయింది. ఇంకొన్ని గంటల్లో.. హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదికగా అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా నిర్వహించబోతోంది ప్రభుత్వం. అవార్డులకు సంబంధించి.. తెలంగాణ ఫిల్మ్ డెవల ప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, నిర్మాత దిల్‌రాజు ఆసక్తికరమైన అంశాన్ని తెలిపారు. ఉత్తమ చిత్రంగా ఎంపికైన ప్రతి సినిమాకు.. 4 అవార్డులు ఇవ్వనున్నారు. బెస్ట్ ఫిల్మ్‌గా ఎంపికైన చిత్రానికి సంబం ధించిన.. హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాతకు  గద్దర్ ఫిల్మ్ పురస్కారాలు అందజేయనున్నారు. ఇలా  ఒక సినిమాకి నాలుగు చొప్పున అవార్డులు ప్రదానం చేయడం ఇదే తొలిసారి.

14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, తెలంగాణ ప్రభుత్వం సినిమా అవార్డులను అందిస్తోంది.  అందుకే గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంపై అంతటా ఆసక్తి నెలకొంది. 2014 నుంచి 2024 మధ్య కాలంలో విడుదలైన సినిమాలకు  ఈ పురస్కారాలు అందించనున్నారు. ప్రతి ఏడాది.. 3 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి..  ఆ సినిమాల హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్లకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. 

మొత్తానికి.. తెలంగాణలో 14 ఏళ్ల తర్వాత గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఇవ్వబోతున్నారు. దీంతో.. ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటి నుంచి నంది అవార్డులు ఇస్తారనే చర్చ మొదలైంది. ఈ ఆదివారం (జూన్ 15న) ఏపీ సీఎం చంద్రబాబుతో.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో నంది అవార్డులపై ఓ క్లారిటీ వస్తుందనే చర్చ సాగుతోంది. సీఎం చంద్రబాబుతో సమావేశానికి.. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి దాదాపు 60 మంది హాజరవుతారని తెలుస్తోంది.  వీరిలో.. పెద్ద నిర్మాతలు, స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోలు ఉండనున్నారు. తొలిసారి..  24 క్రాఫ్ట్స్‌కు సంబంధించిన వాళ్లందరినీ పిలిచారు. అయితే.. ఎవరెవరు హాజరవుతారనేది సస్పెన్స్‌గా మారింది. ఈ ఆహ్వానాలన్నీ.. ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఆధ్వర్యంలోనే అందినట్లు తెలుస్తోంది.  ఇక.. సీఎంతో మీటింగ్‌కు ఆహ్వానం అందకపోవడంపై.. చిన్న నిర్మాతలు, చిన్న సినిమాల నటీనటులు, డైరెక్టర్లు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు.. మీటింగ్ విషయంలో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరికి వారు సెపరేట్ గ్రూపులుగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. థియేటర్ ఎగ్జిబిటర్ల వివాదంలో.. ఏ నలుగురి పేర్లయితే ప్రముఖంగా వినిపించాయో.. ఆ నలుగురు.. అంటే.. దిల్ రాజు, అల్లు అరవింద్, సురేశ్ బాబు, ఏషియన్ సునీల్ కూడా మీటింగ్‌కు వెళ్లనున్నారు. ఏపీలో థియేటర్లు తమ కంట్రోల్‌లో లేవని, తాము కంట్రోల్ చేయడం లేదని ఇప్పటికే స్పష్టతనిచ్చారు.  ఇప్పుడు.. సీఎం చంద్రబాబు ముందు కూడా అదే చెప్పి చేతులు దులుపుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు సినీ పరిశ్రమ పెద్దలు. ప్రధానంగా సింగిల్ స్క్రీన్లని కాపాడుకోవడం, ఆడియెన్స్‌ని మళ్లీ థియేటర్లకు రప్పించేలా చేసేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించనున్నారు. ఎగ్జిబిటర్ల పర్సంటేజీల విధానం, క్యాంటీన్ రేట్లపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. థియేటర్ ఓనర్లు కరెంట్ బిల్లుల్లో సబ్సిడీ అడగాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. షూటింగ్‌ల కోసం సింగిల్ విండో విధానం తీసుకురావాలని కోరనున్నారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న చిత్ర నిర్మాతల సమస్యలకు పరిష్కారం చూపాలని అడగనున్నట్లు తెలుస్తోంది.  గతంలో వైసీపీ ప్రభుత్వం.. 175 స్క్రీన్ల లోపు విడుదలయ్యే చిన్న సినిమాలకు.. ఐదో షో ఇస్తాననే హామీ ఇచ్చింది. కానీ..  అమలు చేయలేదు. దాంతో మరోసారి చిన్న సినిమాలకు ఐదు షోలు ఇవ్వాలనే డిమాండ్‌ని.. సీఎం ముందు ఉంచనున్నారు. 

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి 68 శాతం ఆదాయం ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది. అందువల్ల.. ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి, స్టూడియోల నిర్మాణానికి.. ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలని.. సినీ పరిశ్రమ ప్రముఖులు కోరనున్నారు. పెద్ద సినిమాల రిలీజ్‌ల సమయంలో టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి ఏం చర్చిస్తారనేది  ఆసక్తిగా మారింది. తెలంగాణలో అయితే.. తన సినిమాలకు టికెట్ రేట్లు పెంచేది లేదని దిల్ రాజు చెప్పేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సినిమా టికెట్ రేట్లు పెంచే ఆలోచనతో లేదు. మరి.. ఏపీలో టికెట్ రేట్ల పెంపు ఉంటుందా? పెద్ద సినిమాల రిలీజ్‌ల సమయంలోనే.. టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇస్తారా? అన్నది ఆసక్తిగా మారింది. సీఎంతో మీటింగ్ తర్వాత.. కుబేర, కన్నప్ప, తమ్ముడు లాంటి సినిమాలు.. రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. వీటికి.. రేట్లు పెంచుతారా? లేదా? అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది.

By
en-us Political News

  
కూటమిలో వైరుధ్యాలు లేవని, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి విలువైన సమయం గడపడమే ఇందుకు నిదర్శనమని అప్పసాని రాజేష్ అన్నారు. ఒకరి కాళ్ళ దగ్గర మాటలను తాకట్టు పెట్టి, వారు విసిరే ఎంగిలి మెతుకుల కోసం కొందరు కిరాయి రాజకీయ విశ్లేషకులుగా మారారని నాగేశ్వర్ ఉద్దేశించి అప్పసాని రాజేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు.. పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేనకు దక్కే రాజ్యసభ సీటు ద్వారా నాగబాబును ఢిల్లీకి పంపించి, జాతీయ స్థాయిలో పార్టీ వాయిస్‌ను వినిపించేలా చేయాలన్న‌ ఆలోచనలో జ‌న‌సేన‌ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా  తన వ్యక్తిగత ప్రతిష్టను, సమాజంలో ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని మంత్రి భరత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  
మళ్ళీ తేర మీదకి కర్ణాటక సీఎం కుర్చీ పంచాయతీ.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ కార్యకలాపాలకు, ప్రజా క్షేత్రానికి దూరంగా ఉండటంతో పార్టీ క్యాడర్ నిస్తేజంలోకి వెళ్లిపోయింది. జగన్ తీరు పట్ల పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అంతర్గత సంభాషణల్లో జగన్ తీరు పట్ల పెదవి విరుస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలై, అధికారం కోల్పోయిన తరువాత, జగన్ బహిరంగంగా పెద్దగా కనిపించడంలేదు. ఏవో నాలుగైదు సందర్భాలలో పరామర్శలంటూ వచ్చి ర్యాలీలు నిర్వహించినా అవి వివాదాలకే దారి తీశాయి.
జీహెచ్ఎంసీ గత ఎన్నికల్లో ఊహించని రీతిలో భారీగా స్థానాలను గెలుచుకున్న బీజేపీ, అదే ఊపును 2023 అసెంబ్లీ మరియు 2025 లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగించింది. ఈ నేపథ్యంలో, 2026 గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్‌లోని తమ మిత్రపక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి పోటీ చేసి నగరంలో మరింత పట్టు సాధిస్తుందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరిగింది.
గతంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇమామ్‌లు, ముయెజ్జిన్‌లు, ఆలయ పూజారులకు నెలవారీ గౌరవ వేతనాలను ప్రకటించారు. ఆయా వర్గాలను ఆకట్టుకోవడానికి ప్రవేశపెట్టిన ఈ విధానాలన్నింటికీ ప్రస్తుత సువేందు సర్కార్ ఫుల్ స్టాప్ పెట్టేసింది.
గతంలో చిలకలూరిపేట పోలీస్ స్టేషన్‌లో విడదల రజినితో పాటు మరికొందరు వైసీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక నాయకుడు పిల్లి కోటి ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వివాదానికి సంబంధించిన చట్టపరమైన ప్రక్రియలో భాగంగానే న్యాయస్థానం విడదల రజినిని పాస్ పోర్టు సరెండర్ చేయాల్సిందిగా ఆదేశించింది.
నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి హాజరు కావడం మాత్రమే కాకుండా ప్రమాణ స్వీకారం పూర్తయిన తరువాత వేదికపైకి వెళ్లి కొత్త ముఖ్యమంత్రిని అభినందించడం ప్రస్తుత కాలంలో అత్యంత అరుదనే చెప్పాలి. ఆ ఆరుదైన సంఘటన కేరళం ముఖ్యమంత్రి సతీశన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా సోమవారం జరిగింది.
విద్యాసంవత్సరం ఆరంభాన్ని ఓ భారీ విద్యాపండుగగా నిర్వహించేందుకు సమాయత్తమౌతోంది. ఆ రోజు అంటే రానున్న విద్యాసంవత్సరం మొదటి రోజునే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బడుల్లోనూ ఏకకాలంలో మూడు కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. అవేంటంటే అదే రోజున తల్లికి వందనం నిధులను తల్లుల ఖాతాలో జమచేయనుంది. అలాగే అదే రోజు అంటే పాఠశాలలె తెరిచిన తొలి రోజునే విద్యార్థులకు అవసరమైన విద్యాసామగ్రిని అందించనుంది. అలాగే అదే రోజు మెగా పేరెంట్, టీచర్ మీటింగ్ నూ నిర్వహించనుంది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అద్భుతమైన విజయంతో అధికారాన్ని దక్కించుకున్న సంగతి విదితమే. అయితే ఆ విజయం తరువాత తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యవహరించిన తీరు పలు విమర్శలకు దారి తీసింది. ఎన్నికలలో పరాజయం పాలైన డీఎంకే అధినేత స్టాలిన్ నివాసానికి వెళ్లి మరీ పలకరించి, పరామర్శించిన రజనీకాంత్, ఘన విజయం సాధించిన టీవీకే విజయ్ కు అభినందించలేదు.
అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో రంగంలోకి దిగాలని స్టాలిన్ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈస్ట్ తిరుచ్చి నుంచి టీవీకే అధినేత విజయ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంది. దీంతో విజయ్ తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు.
తాను సమాజంలో ఉన్న అసమానతలకు, కుల వివక్షకు మాత్రమే వ్యతిరేకమన్నారు.  దేవాలయాల పూజా విధానాలపై కానీ, ప్రజల మత స్వేచ్ఛపై కానీ ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.