Publish Date:Jul 28, 2023
వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారం దక్కించుకుంటుందా? ఐఎన్డీఐఏ కూటమి విజయకేతనం ఎగరేస్తుందా? మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని పీఠాన్ని దక్కించుకొని హ్యాట్రిక్ కొడతారా? కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? రాహుల్ గాంధీ పీఎం అవుతారా? తనపై ఉన్న వ్యతిరేకతను పోల్ మేనేజ్మెంట్ తో అధిగమించి బీజేపీ మరోసారి చక్రం తిప్పుతుందా? కర్ణాటకలో ఫలితాలను దేశమంతా విస్తరించేలా కాంగ్రెస్ చేపడుతున్న ప్రణాళికలు సక్సెస్ అవుతాయా? అసలు ఈసారి భారత దేశానికి కాబోయే ప్రధాన మంత్రి ఎవరు? ఇదే ఇప్పుడు సగటు రాజకీయాలలో ఆసక్తిగా సాగుతున్న చర్చ. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమికి అధికారం దక్కితే నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కావడం గ్యారంటీ. అదే సమయంలో ఐఎన్డీఐఏ కూటమికి అధికారం దక్కితే ప్రధాని ఎవరన్నది ఇంకా తేలాల్సిన ప్రశ్న. అయితే.. ఈ కూటమిలో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్సే కనుక రాహుల్ గాంధీకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది.
ఈ క్రమంలో నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీలలో ఈసారి ప్రధాని కాబోయే వ్యక్తి ఎవరు అని తెలుగు వన్ ఆన్ లైన్ పోల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మెజారిటీ నెటిజన్లు రాహుల్ గాంధీయే ప్రధాని కావచ్చని ఓట్లేయడం విశేషం. తెలుగు వన్ సర్వేలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని 66 శాతం మంది ఓట్లేస్తే.. ప్రధాని మోడీ మరోసారి పీఎం అవుతారని కేవలం 34 శాతం మాత్రమే మంది మాత్రమే ఓట్లేశారు. స్వల్ప వ్యవధిలోనే 34 వేల మంది పాల్గొన్న ఈ సర్వేలో 66 శాతం మంది రాహుల్ గాంధీ జై కొట్టడం విశేషం.
కాగా, ఈ ఆన్ లైన్ సర్వేలో నరేంద్ర మోడీ వెనకబడడం వెనక అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలపై బీజేపీ సర్కార్ చూపిస్తున్న సవతి ప్రేమ ప్రధాన కారణంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్టాల అభివృద్ధిని పట్టించుకోకపోవడం, రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, ప్రభుత్వ సంస్థలు.. ఆస్తులను ప్రైవేట్ పరం చేయడం, సాగు నీటి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకపోవడం వంటి ఎన్నో కారణాలు ఉన్నట్లు భావించాల్సి ఉంటుంది. వీటితో పాటు సాధారణంగానే దక్షణాది రాష్ట్రాలలో బీజేపీ పట్ల ఆసక్తి తక్కువగా ఉంటుంది. అందునా మన తెలుగు రాష్టాలలో బీజేపీకి స్వల్ప ఓటు బ్యాంక్ మాత్రమే ఉంది. ఇక ఏపీలో అయితే కేవలం ఒకటి శాతం కంటే తక్కువ ఓటింగ్ ఉంది. ఇక మణిపూర్ హింసాకాండ, మహారాష్ట్ర లో దొడ్డిదారిన అధికారంలోకి రావడం వంటి కారణాలు కూడా జనంలో మోడీ వ్యతిరేకతకు దోహదం చేశాయి.
ఇక రాహుల్ గాంధీ విషయానికి వస్తే.. భారత్ జోడో యాత్ర తరువాత నుంచీ రాహుల్ పట్ల జనబాహుల్యంలో సానుకూలత వ్యక్తమౌతోంది. ఆ యాత్ర రాహుల్ ను దేశ ప్రజలకు సరికొత్తగా పరిచయం చేసింది. రాహుల్ గాంధీకి జనం నీరాజనాలు పలికారు. ఈ విషయాన్ని అప్పట్లో రాహుల్ గాంధీ ఓపెన్ గానే చెప్పేశారు. పరిణితి చెందిన రాజకీయవేత్తగా జనం ఆయనను గుర్తిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nexp-pm-rahul-39-159157.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.