సంక్షిప్తం morning

Publish Date:Jun 21, 2023

Advertisement

1.బీఆర్ఎస్ నేత, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ మీడియా ముందుకొచ్చిన ధర్మసాగర్‌ మండలం జానకీపురం సర్పంచ్‌ నవ్య తాజాగా రాజయ్యపై ఆరోపణలు చేశారు. తన వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నారన్నారు.

2.హోండురస్ లోని ఓ మహిళా జైలులో చెలరేగిన అల్లర్లలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. 26 మంది మహిళలు అగ్నికి ఆహుతికాగా, మిగతా వారిలో కొందరిని కాల్చి, కత్తితో పొడిచి చంపేశారు. 

3. దేశంలో జూన్ మూడో వారంలోనూ ఎండలు మండిపోతున్న వేళ వడగాల్పుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ  రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో ఈ రోజు వర్చువల్ భేటీ నిర్వహించారు. ఎండలలో ప్రజారోగ్యం కాపాడే విషయంపై చర్చించారు. 

4. జగన్ పాలనలో అన్ని రంగాల వారు బాధితులేనని లోకేష్ అన్నారు. జగన్ ఏ వర్గానికి న్యాయం చెయ్యలేదని, జగన్ పాలనలో సమాజంలో భయం ఏర్పడిందని తెలిపారు. పాదయాత్రలో భాగంగా ఆయన వెంకటగిరి లో నిన్న మాట్లాడుతూ ఏపీ బ్రాండ్ ను జగన్ దెబ్బతీశారని విమర్శించారు. (

5. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సర్కార్ కు సుప్రీం షాక్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర బలగాలను మోహరించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. జూలై 8న బెంగాల్ లో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి.  

6.ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న ఇల్లు జప్తుకు సంబంధించి లింగమనేని రమేశ్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను  ఈ నెల 28కి వాయిదా వేసింది. 

7. మెగా ప్రిన్సెస్ కు జనసేనాని పవన్ కల్యాణ్ ఆశీస్సులు అందించారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు నిన్న ఆడపిల్ల జన్మించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా వారికి   శుభాకాంక్షలు  పాపకు ఆశీస్సులు అంటూ పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 
8. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ము కాసేలా ఉండటం సరికాదని సోము వీర్రాజు అన్నారు. ప్రజలను రక్షించాల్సిన అధికార పార్టీ నేతలు పోలీసులు అడ్డుపెట్టుకొని రెచ్చిపోతున్నారన్నారు. బాపట్ల జిల్లా ఉప్పాలవారిపాలెంలో అమర్నాథ్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. 

9.బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  నేటి మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

10. ఆదిపురుష్ సినిమాపై రామాయణాన్ని వక్రీకరించారంటూ విమర్శలు  కొనసాగుతున్నాయి.  తాజాగా గతంలో దేశాన్ని ఉర్రూతలూగించిన  మహాభారత్ సీరియల్ లో భీష్ముడి పాత్రను పోషించిన ముఖేశ్ ఖన్నా ఆదిపురుష్ మేకర్స్ ను  తగలబెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

11.   ప్రధాని  మోడీపై  ట్విట్టర్, టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ ప్రశంసలు కురిపించారు. బుధవారం (జూన్ 21)న మోడీతో భేటీ అయిన  మస్క్  వచ్చే ఏడాది తాను భారత్ లో పర్యటించనున్నట్లు చెప్పారు. స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీస్ లను భారత్ లోకి తెస్తామన్నారు. 

12. తెరాస బహిష్కృత నేతలు పొంగులేటి, జూపల్లిలు  వచ్చే నెల రెండో తేదీన ఖమ్మంలో జరగనున్న బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో  వీరు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. అంతకు ముందు ఈ నెల 25న వారు ఢిల్లీలో రాహుల్ తో భేటీ అవుతారు. 
13. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ లో కొంత భాగం కూలి పది మంది గాయపడ్డారు. రెడీ మిక్సర్ తయారు చేసే లారీ రివర్స్ తీసుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.  రెండు పిల్లర్లకు మధ్య నిర్మిస్తున్న ఓ స్లాబ్ కూలిపోయింది. 

14.  వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడనివ్వకూడదనేదే తన ఉద్దేశమనీ, అది నెరవేరాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలవాలని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత వస్తుందని చెప్పారు. 
15. అంతర్జాతీయ యోగా దినోత్సవం  సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన యోగా వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.యోగా అనేది మన నాగరికత సాధించిన గొప్ప విజయాల్లో ఒకటని చెప్పారు. 

16. పేదల ఇళ్లు కూల్చేస్తారా అంటూ మహారాష్ట్ర  మీరా భయందర్  నియోజకవర్గం ఎమ్మెల్యే గీతా భరత్ జైన్  ప్రజల ముందే జూనియర్ సివిల్ ఇంజినీర్‌ కాలర్ పట్టుకుని చెంప ఛెళ్లుమనిపించారు.  నిర్మాణాలను ఎలా ధ్వంసం చేస్తారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
17.  కరీంనగర్ లో మానేరు నదిపై రూ.224 కోట్లతో  పూర్తి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ఈ రోజు ప్రారంభించారు. హైదరాబాద్ లోని  దుర్గం చెరువు తర్వాత రాష్ట్రంలో నిర్మించిన రెండో కేబుల్ బ్రిడ్జి ఇదే కావడం గమనార్హం.
18. దేశ రాజధానిలో తెలంగాణ బోనాల సంబరాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి ఇండియా గేట్ వరకు తెలంగాణ బోనాలతో మహిళలతో ఊరేగింపు జరిగింది. 19.   ఏపీలో  అధికార పార్టీ అండతో భారీగా దొంగ ఓట్లు నమోదౌతున్నాయంటూ ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.  

20. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన డ్రగ్స్‌ కేసులో  రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన కబాలీ తెలుగు నిర్మాత కేపీ చౌదరిని  పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు ఆయనను విచారించనున్నారు.  
 

 

By
en-us Political News

  
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
జాతీయ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడెక్కుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కాంగ్రెస్ న్యాయపోరాటానికి దిగింది.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ బైపాస్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
ప్రస్తుతం మార్కెట్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి
అర్థశాస్త్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి విజేతల ప్రకటన వెలువడింది.
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ
సికింద్రాబాద్‌లోని బొల్లారం చిన్నారి మోజెస్ అరెలియా కిడ్నాప్, హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.