స్పీడ్ న్యూస్- 2

Publish Date:Jun 29, 2023

Advertisement

11.చత్తీస్ గఢ్ లో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరిని దారుణంగా హత్య చేశారు. 

12.దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత రద్దీగా ఉండే ప్రధాన నగరారం బెంగళూరులో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు 65 కిలో మీటర్ల మేర సొరంగ మార్గం ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

13.ఢిల్లీ మెట్రో ఇటీవల తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. రైలులో అసభ్యకర చేష్టలు.. ముద్దుసీన్లు, డ్యాన్సింగ్ రీల్స్‌తో తరచూ దర్శనమిస్తున్నాయి.

14.వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇంటజరిగింది. బుధవారం పొద్దుపోయాక జరిగిన ఈ భేటీలో హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర కీలక నేతలు పాల్గొన్నారు.

15.ముఖ్యమంత్రి కేసీఆర్ కుర్చీ కదులుతోందనే భయంతోనే కేటీఆర్ ఢిల్లీలో గల్లీగల్లీ ప్రదక్షిణలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమో, మెట్రో రైలు కోసమో, కంటోన్మెంట్ రోడ్ల కోసమో కేటీఆర్ ఢిల్లీకి వెళ్లడం లేదని విమర్శించారు. 

16.తనకు నచ్చి, పది మందికి ఉపయోగపడుతుందని, ఆలోచించేలా చేస్తుందని భావిస్తే చాలు.. అది ఫొటో అయినా, వీడియో అయినా, సందేశం అయినా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో తన కోటి మంది ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటారు.
 తాజాగా ఆయన ఓ గ్రామంలోని ఇంటిలో స్థలం ఆదా చేసుకునే దానికి సంబంధించి ఫొటోని షేర్ చేశారు.

17.అట్లాంటిక్ మహాసముద్రంలో వందేళ్ల క్రితం మునిగిపోయిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లి పేలిపోయిన సబ్‌మెర్సిబుల్ ‘టైటాన్’ శకలాలను తీరానికి తీసుకొచ్చారు. కెనడాలోని న్యూఫౌండ్‌లాండ్ అండ్ లాబ్రాడార్ ఫ్రావిన్సులోని సెయింట్ జాన్స్‌ ఓడరేవుకు నిన్న వాటిని తీసుకొచ్చారు. 

18. చంద్రయాన్ 3 మిషన్ ప్రయోగానికి సిద్ధంగా ఉన్నట్లు ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ తెలిపారు. జూలై 12 నుండి 19 మధ్యన చేపట్టనున్నట్లు చెప్పారు.

19.హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఒక్కసారిగా భూమి కుంగడంతో స్థానికంగా కలకలం రేగింది. గౌతమ్ నగర్ కాలనీలోని ఓ సంస్థ భవనం నిర్మాణ పనులు చేపడుతుండగా పక్కనే ఉన్న రోడ్డు కుంగిపోవడంతో స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు.

20.పాకిస్థాన్ విధానాన్ని భారత విదేశాంగ మంత్రి తప్పుబట్టారు. రాత్రి ఉగ్రవాదం నడిపించే దేశంతో పగలు వాణిజ్యం చేయలేమని తేల్చి చెప్పేశారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దుర్గాపూజ ఉత్సవాల వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆ కళాశాలలో నవ్వులు విరిశాయి.. స్నేహితుల సందడి, దాండియా నృత్యాలతో ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటాక అత్యంత హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తుల తాకిడి ఒక్కసారిగా భారీగా పెరిగింది.
బర్త్‌డే నాడే భార్యను చంపి సూసైడ్ చేసుకున్న టెకీ.!
చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేశీయ ఆహార భద్రతా నియంత్రణ సంస్థ కీలకమైన ముసాయిదా నిబంధనను తెరపైకి తెచ్చింది.
భారతీయ సైన్యంలో అత్యున్నత ప్రమాణాలుగా భావించే క్రమశిక్షణను ఉల్లంఘించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారిని ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు దర్శించుకున్నారు
ఢిల్లీలో తీవ్ర సంచలనం సృష్టించిన పరిణామాల మధ్య కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు న్యాయస్థానం ఊరటనిచ్చింది.
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోయాననే అసంతృప్తి.. కొత్తగా తన జీవితంలోకి వచ్చిన భర్తపై ద్వేషంగా మారిందా? కాపురం ప్రారంభమై నెల రోజులు కూడా గడవకముందే ఓ నవవధువు తీసుకున్న నిర్ణయం
సోషల్ మీడియాలో విపరీతమైన వ్యూస్, లైక్స్ సంపాదించాలనే దురాశతో కొందరు యువకులు రోజుకో ప్రమాదకర చర్యకు పాల్పడుతున్నారు.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.