స్పీడ్ న్యూస్ -1

Publish Date:Jun 29, 2023

Advertisement

1. ప్రవాసాంధ్రురాలు స్వాతిరెడ్డి పోరాటానికి చంద్రబాబు మద్దతు ప్రకటించారు. ఆమెకు ఫోన్ చేసి మాట్లాడిన టీడీపీ అధినేత ఆమెపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.

2.మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వ్యతిరేక నిరసనల్లో తమ లోగో వినియోగించడంపై ఫోన్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా తమ లోగోను వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించింది.

3.రాజకీయ రంగ ప్రవేశంపై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఊహాగానాలకు తెరదించాడు. రాజకీయాల్లోకి వస్తున్నట్టు తాజాగా ప్రకటించాడు.

4.మొత్తానికి కరోనా వైరస్ సహజంగా పుట్టినది కాదన్న విషయం బహిర్గతమైంది. వైరస్‌ చైనాలోని వుహాన్ ల్యాబ్‌లోనే పురుడు పోసుకుందని వైరాలజీ ఇనిస్టిట్యూట్ పరిశోధకుడు చావోషావ్ వెల్లడించాడు.

5. తెలంగాణ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్ కన్నుమూశారు. గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

6. ఉత్తరప్రదేశ్ విలేజ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ నియామక పరీక్షలో నకిలీల బెడదకు కృత్రిమ మేధతో చెక్ పడింది. మంగళవారం జరిగిన ఈ పరీక్షకు ఏకంగా 87 మంది నకిలీ అభ్యర్థులు హాజరయ్యారు.

7ప్రొటీన్ షేక్‌లతో ఆరోగ్య సమస్య తలెత్తే ప్రమాదం ఉంటే ఆ విషయాన్ని ప్యాకింగ్‌పై స్పష్టంగా ముద్రించాలని బ్రిటన్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి తాజాగా అభిప్రాయపడ్డారు. మూడేళ్ల క్రితం ప్రొటీన్ షేక్ తాగిన భారత సంతతి టీనేజర్ రోహన్ గోధానియా మరణించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

8.తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని మారుస్తారంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ కమల దళపతి బండి సంజయ్ స్పందించారు. బీజేపీ అధ్యక్షుడి మార్పు వార్తల్లో వాస్తవం లేదన్నారు. 

9.భారతీయ సినిమా ఖ్యాతిని 'ఆర్ఆర్ఆర్' చిత్రం ఆస్కార్ వేదిక వరకూ తీసుకెళ్లి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆస్కార్ అవార్డులను సాధించడమే కాక ఇప్పుడు ఆ సినిమా టీమ్ ఏకంగా ఆస్కార్ జ్యూరీ మెంబర్లు అయ్యేంత గొప్ప స్థాయిని తీసుకొచ్చింది.

10.హాలీవుడ్ శృంగార తార, సింగర్ మడొన్నా వయసు 64 ఏళ్లకు చేరుకున్నా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఏమాత్రం చెక్కుచెదరలేదు. తాజాగా ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 

 

By
en-us Political News

  
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తుల తాకిడి ఒక్కసారిగా భారీగా పెరిగింది.
బర్త్‌డే నాడే భార్యను చంపి సూసైడ్ చేసుకున్న టెకీ.!
చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేశీయ ఆహార భద్రతా నియంత్రణ సంస్థ కీలకమైన ముసాయిదా నిబంధనను తెరపైకి తెచ్చింది.
భారతీయ సైన్యంలో అత్యున్నత ప్రమాణాలుగా భావించే క్రమశిక్షణను ఉల్లంఘించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారిని ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు దర్శించుకున్నారు
ఢిల్లీలో తీవ్ర సంచలనం సృష్టించిన పరిణామాల మధ్య కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు న్యాయస్థానం ఊరటనిచ్చింది.
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోయాననే అసంతృప్తి.. కొత్తగా తన జీవితంలోకి వచ్చిన భర్తపై ద్వేషంగా మారిందా? కాపురం ప్రారంభమై నెల రోజులు కూడా గడవకముందే ఓ నవవధువు తీసుకున్న నిర్ణయం
సోషల్ మీడియాలో విపరీతమైన వ్యూస్, లైక్స్ సంపాదించాలనే దురాశతో కొందరు యువకులు రోజుకో ప్రమాదకర చర్యకు పాల్పడుతున్నారు.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
ఇంటర్నెట్ వినియోగం కేవలం పెద్దలకే పరిమితం కాదు, పిల్లలకు కూడా ఇదొక ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
రాత్రి అందరూ కలిసి భోజనం చేశారు.. ఎన్నో ఆశలతో నిద్రలోకి జారుకున్నారు.. కానీ తెల్లవారేసరికి ఆ ఇంట్లో ఐదుగురు విగతజీవులుగా కనిపించారు
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.