స్పీడ్ న్యూస్ -2

Publish Date:Jul 11, 2023

Advertisement

26.అమరావతి రాజధాని వ్యవహారంలో దాఖలైన పిటిషన్లను డిసెంబర్ లో విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.  ఈ కేసును అత్యవసరంగా విచారించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.

27. తెలంగాణ రైతులకు 24 గంటలూ ఉచితంగా విద్యుత్ అందిస్తే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఏడుపు ఎందుకని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. రైతులపై మీకు, మీ పార్టీకి కక్ష ఎందుకని రేవంత్ రెడ్డిని నిలదీశారు. 

28.మహారాష్ట్రలోని నాసిక్ లో కొంతమంది దొంగలు ఏకంగా ఏటీఎం మెషిన్ నే ఎత్తుకెళ్లారు. దర్జాగా లారీ తీసుకొచ్చి, మెషిన్ ను అందులోకి ఎక్కించి తీసుకెళ్లారు.

29.  ఆగస్టు 1న పూణెలో లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డును ప్రధాని మోదీ అందుకోబోతున్నారు. లోకమాన్య తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ అందిస్తున్న ఈ అవార్డు కార్యక్రమానికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తోపాటు అజిత్  కలిసి కనిపించనుండడం అదే తొలిసారి అవుతుంది. 

30.ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెళ్లి వారితో పొదిలి నుంచి కాకినాడకు వెళ్తున్న బస్సు దర్శి సమీపంలో అదుపుతప్పి సాగర్ కాల్వలో పడిన ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా మరో 15 మంది గాయపడ్డారు. 

31.అర్జెంట్‌గా ఢిల్లీకి రావాలని.. ఏపీ ఎన్నికల కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో భారీగా ఓట్ల గల్లంతు, నకిలీ ఓట్ల చేర్పులపై సీఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 

32.పవన్ ఆరోపణలకు సమాధానం చెప్పలేని ఏపీ ప్రభుత్వ నేతలు వాలంటీర్లను రెచ్చగొట్టి రోడ్ల మీదకు ఉసిగొల్పారు. ప్రతిపక్ష పార్టీల ధర్నాలు, రాస్తారోకోలకు అనుమతి ఇవ్వని ప్రభుత్వం పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలు దహనం చేయడానికి మాత్రం పర్మిషన్ ఇచ్చేసింది. 

33.ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఓ హెలికాప్టర్ అదృశ్యమైంది. నేపాల్‌లో జరిగిందీ ఘటన. మేనేజింగ్ ఎయిర్‌కు చెందిన హెలికాప్టర్ 9ఎన్-ఏఎంవీ (ఏఎస్ 50) సోలుకుంబు నుంచి ఖఠ్మాండు వెళ్తుండగా చాపర్ అదృశ్యమైంది. హెలికాప్టర్‌లో పైలట్‌తోపాటు ఐదుగురు విదేశీయులు ఉన్నారు. ఈ ఉదయం 10.12 గంటలకు అది రాడార్ నుంచి అదృశ్యమైంది. 

34. హెలికాప్టర్ అదృశ్యం కాగానే రంగంలోకి దిగిన అధికారులు దానిని వెతికేందుకు మరో హెలికాప్టర్‌ను పంపారు. అయితే హెలికాప్టర్ టేకాఫ్ అయిన 15 నిమిషాలకే దానితో సంబంధాలు తెగిపోయాయని నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది. 

35. టెక్ కంపెనీల్లో గతేడాది మొదలైన కొలువుల కోతలు ఇటీవల కొంత నెమ్మదించాయి. దీంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకుంటుండగానే టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మళ్లీ లేఆఫ్‌లకు తెరలేపి వేలాదిమంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్దం చేసింది.

36. ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. రేవంత్ మాటలు వ్యక్తిగతమని, ఆయన చెప్తే ఫైనల్ కాదన్నారు.

37. దర్శి దుర్ఘటన మానవ తప్పిదమా? లేక ఆర్టీసీ బస్సు సాంకేతిక కారణమా  అనే విషయమై అధికారులు దర్యాప్తు చేయాలని జన సేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. 
క్షతగాత్రులకు మేలైన వైద్య సదుపాయం కలిగించడంతో పాటు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికంగా సాయపడాలని కోరారు. 

38. ఆటోమొబైల్ రంగంలో దిగ్గజ కంపెనీ హ్యుందాయ్ మోటార్ సరికొత్త ఎస్ యూవీని ఇండియన్ మార్కెట్లోకి తీసుకు వచ్చింది. ఎంట్రీ లెవల్ మోడల్ ‘ఎక్స్ టర్’ ను సోమవారం మార్కెట్ కు పరిచయం చేసింది.

39. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర కావలి నియోజకవర్గం కొత్తపల్లి వద్ద 2వేల కి.మీ. మైలురాయికి చేరుకుంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని కొత్తపల్లిలో ఏర్పాటుచేసిన పైలాన్ ను లోకేశ్ ఆవిష్కరించారు.

40.  చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పెరుమాళ్లపల్లికి చెందిన దివ్యాంగుడు జీవన్ కుమార్ రెడ్డి తమకు వచ్చే పెన్షన్ తోపాటు కొంత సొంత డబ్బు కలిపి రూ.5 వేల విరాళాన్నిటీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి లోకేశ్ కు అందజేశారు. 

41. దర్శి ఆర్టీసీ బస్సు  ప్రమాదంపై సీఎం జగన్ స్పందిస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

42.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు హైదరాబాద్ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు  కోటి రూపాయలు ఖర్చు చేసి రీడెవలప్ చేశాడు. దీంతో గచ్చిబౌలి కేశవనగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రస్తుతం కార్పొరేట్ స్కూల్ లా మారిపోయింది. 

43.: వైసీపీ పార్టీ జగన్‌ది కాదని, వేరే వాళ్ల దగ్గర నుంచి ఆ పార్టీని లాక్కున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. వారాహి యాత్ర నిర్వహిస్తున్న ఆయన మంగళవారం ఏలూరు జిల్లా దెందులూరులో వీర మహిళలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

44.వాలంటీర్లపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మరోసారి  సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే దేశం ఆగిపోదని.. నిత్యావసర వస్తువుల వ్యవస్థ ఆగిపోదని తేల్చిచెప్పారు.

45. ఇంటర్మీడియట్‌లో పరీక్షా పేపర్ మూల్యాంకనం సరిగ్గా చేయలేదంటూ ఓ విద్యార్థి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో  మంగళవారం విచారణ చేపట్టింది.  వాదనలు విన్న కోర్టు విద్యార్థి పరీక్ష పత్రాలను పున: సమీక్షించాలంటూ ఇంటర్మీడియట్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది.

By
en-us Political News

  
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.