అన్ స్టాపబుల్ లోకేష్..

Publish Date:Jul 11, 2023

Advertisement

యువగళం@2000KM! నాలుగేళ్ళ జగన్మోహన్ రెడ్డి పాలనలో అవకతవకలను ఎండగడుతూ కక్ష్ పూరిత రాజకీయాలతో నలిగిపోయిన తెలుగు తమ్ముళ్లకు భరోసా ఇస్తూ, మూర్ఖత్వంతో ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలతో విసిగిపోయిన ప్రజలకు అండగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మరో కీలక  మైలురాయికి చేరుకుంది. లోకేశ్ యువగళం పాదయాత్ర మంగళవారం (జూలై11) 2000 కిలోమీటర్ల మైలురాయి చేరుకుంది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో లోకేష్ 153వ రోజున ఈ 50 శాతం లక్ష్యం పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. 400 రోజుల్లో 4వేల కిలోమీటర్లు చేరుకోవాలని పాదయాత్ర ప్రారంభించిన లోకేష్‌ వడివడిగా అడుగులు వేస్తూ నిర్ధేశించిన గడువు కంటే ముందే యాభై శాతం లక్ష్యాన్ని పూర్తిచేసుకున్నారు. 

కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంతనుంచి జనవరి 27న యువనేత లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర దోని సిరిగుప్ప క్రాస్ వద్ద 77వరోజు చారిత్రాత్మక 1000 కి.మీ మైలురాయి చేరుకుంది. ఇక ఇప్పుడు 153వ రోజున నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కొత్తపల్లి వద్ద 2వేల కి.మీల మైలురాయిని చేరుకుంది. రోజుకు సగటున 10 కిలోమీటర్ల చొప్పున నడవాలని తొలుత లక్ష్యంగా నిర్ణయించుకున్న లోకేష్.. 153 రోజుల్లో సగటున 13.15 కి.మీల చొప్పున నడక సాగించారు. ఈ పాదయాత్రలో లోకేష్ ఇప్పటి వరకు సుమారు 30 లక్షల మంది ప్రజలను నేరుగా కలుసుకోగా.. మొత్తం 53 అసెంబ్లీ నియోజకవర్గాలు, 135 మండలాలు, 1297 గ్రామాల గుండా నడక సాగించారు. 49 చోట్ల బహిరంగసభలలో ప్రసంగించిన ఈ యువనేత వివిధవర్గాలతో ఫేస్ టూ ఫేస్ సమావేశాలు నిర్వహించారు. ఈ యాత్రలో మొత్తం 2,895 రాతపూర్వక వినతిపత్రాలు అందుకున్న లోకేష్.. 5 చోట్ల ప్రజల మధ్య నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాలకు పల్లె ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది.

ఇక పాదయాత్ర విషయానికి వస్తే రాయలసీమలో లోకేష్ యువగళం చరిత్ర సృష్టించింది. గతంలో మరే నాయకుడు చేయని విధంగా రాయలసీమలో 124 రోజులపాటు 44 అసెంబ్లీ నియోజకర్గాల మీదుగా 1587 కి.మీ పాదయాత్ర చేసి రికార్డు సృష్టించగా.. ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లో ఇప్పటివరకు 29 రోజులు 425 కి.మీ మేర పాదయాత్ర పూర్తయింది. తారకరత్న మరణం, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, ఉగాది, మహానాడు వంటి అనివార్యమైన సందర్భాల్లో మినహా విరామం లేకుండా యువగళం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా, లోకేష్ విజయవంతంగా 2 వేల కిలోమీటర్ల మైలురాయిని అందుకున్న సందర్భంగా తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సహా లోకేష్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలియజేస్తున్నారు. మరోవైపు ట్విట్టర్‌లో ఇండియా వైడ్‌గా నారా లోకేష్ పాదయాత్ర 2వేల కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా.. 3వ స్థానంలో #2000kmOfYuvaGalam హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ట్విట్టర్ వేదికగా వేల సంఖ్యలో ట్వీట్స్ చేస్తున్నారు. యువనేత పాదయాత్రకి విశేష స్పందన లభిస్తున్నది. 

ఈ పాదయాత్రపై ప్రత్యర్ధులు అవాకులు చవాకులు పేలినా లోకేష్ యాత్ర ముమ్మాటికీ సూపర్ సక్సెస్ అయింది. గతంలో లోకేష్ మాట్లాడిన ఒకటీ రెండో అమాయకపు మాటలతో ట్రోల్ చేసే వారికి ఈ యువగళం యాత్ర చెంపపెట్టు లాంటి జవాబిచ్చింది. ఇన్ని వేల కిలోమటర్ల   దూరం ప్రజల మధ్యకి వెళ్లి వారి కష్టాలను తెలుసుకుంటూ.. సొంత పార్టీలో, కార్యకర్తల్లో అసంతృప్తిని దూరం చేసి భరోసా ఇస్తూ ముందుకు సాగడం అంటే సామాన్య విషయం కాదు. ఒక వైపు ప్రత్యర్ధుల విమర్శలకు సమాధానం ఇస్తూనే లోకేష్ ఒక్కో మెట్టు ఎదగడం విశేషం. ఉదాహరణకు పెనుగొండ నియోజకవర్గంలో పాదయాత్ర సమయంలో కియా ఫ్యాక్టరీ వద్ద లోకేష్ విసిరిన సెల్ఫీ చాలెంజ్ మొత్తం యాత్రకు హైలైట్ కాగా.. టిసిఎల్, జోహో, డిక్సన్ వంటి కంపెనీల వద్ద లోకేష్ విసిరిన సెల్ఫీ చాలెంజ్ రాష్ట్ర యువతను ఆకట్టుకున్నాయి. డిక్సన్ కంపెనీ ఉద్యోగుల బస్సు ఎక్కి లోకేష్ సెల్ఫీ దిగుతూ.. మిస్టర్ జ‌గ‌న్ రెడ్డీ.. నేను తెచ్చిన డిక్సన్ కంపెనీ ఇది.. అందులో ఉద్యోగాలు చేస్తున్న అక్కాచెల్లెళ్లు వీరు.. నువ్వు ఒక్క కంపెనీ అయినా తెచ్చాన‌ని చెప్పుకోగ‌లవా.. ఒక్క ఉద్యోగ‌మైనా ఇప్పించ‌గ‌లిగాన‌ని ప్రక‌టించ‌గ‌ల‌వా అంటూ లోకేష్ విసిరిన బాణాలు సూటిగా జగన్ మోహన్ రెడ్డికి తగిలాయి. 

వీటితో పాటు ప్రతి వంద కిలోమీటర్లకు ఓ వరాన్ని ప్రకటిస్తూ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన లోకేష్.. ప్రతి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న బహిరంగసభల్లో అధికారపార్టీ ఎమ్మెల్యేల అవినీతిని ఎండగడుతూ.. నాలుగేళ్ళలో వైసీపీ ప్రభుత్వం ప్రజలను పెట్టిన ఇబ్బందులను గుర్తుచేస్తూ.. వైసీపీ ప్రభుత్వంలోని వైఫల్యాలను ఎండగడుతూ టిడిపి హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల విడమర్చి చెప్తూ జనంలోకి చొచ్చుకుపోతున్నారు. అయితే, ఇది సగమే. మరో అర్ధం భాగం ఉందంటే లోకేష్ ప్రజలకు ఇంకెంత   చేరువ అవుతారో అర్ధం చేసుకోవచ్చు.

By
en-us Political News

  
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.