సంక్షిప్తం 11 AM

Publish Date:Jun 22, 2023

Advertisement

1. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో  మంత్రులు , ఎమ్మెల్యేలు, రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్  నిన్న  సమీక్ష నిర్వహించారు.  పనితీరు లేని ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికలలో టికెట్ ఇచ్చేది లేదని హెచ్చరించారు.  

2. నకిలీ ఔషధాలపై కేంద్రం సీరియస్ అయ్యింది. కలుషిత దగ్గు మందు కారణంగా విదేశాలలో పిల్లలు ప్రాణాలు కోల్పోయారన్న నివేదికల నేపథ్యంలో  కేంద్ర మంత్రి మాండవీయ 18 కంపెనీల మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు.  

3. తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విమర్శించారు.  తాంబరంలో  జరిగిన బీజేపీ పార్టీ బహిరంగ లో   మాట్టాడిన ఆయన ఒక సారి బీజేపీకి అధికారం ఇస్తే అవినీతి రహిత పాలన ఎలా ఉంటుందో చూపుతామని పేర్కొన్నారు.  

4.   ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దాతల సహకారంతో రూ.4 కోట్లతో అన్నదాన భవనం నిర్మించేందుకు టిటిడి పాలకమండలి ఆమోదం తెలిపింది.  

5. కడప నగరానికి బ్రహ్మంసాగర్ జలాశయం నుంచి మంచినీటిని తరలించడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బ్రహ్మంసాగర్-కడప నీటి  ప్రాజెక్టు రూ.462 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు.  

6. కేరళలోని కొట్టాయం జిల్లాలో శబరిమల గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్ర పర్యావరణశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.3,411 కోట్ల వ్యయంతో ఎరుమలి ప్రాంతంలో 2,570 ఎకరాల్లో ఈ విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు.  

7.మహబూబ్ నగర్ సమీపంలోని అప్పన్నపల్లి  వద్ద రెండో రైల్వే ఓవర్ బ్రిడ్జిని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ నిన్న ప్రారంభించారు.  30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రెండో రైల్వే ఓవర్ బ్రిడ్జిని కేవలం 12 నెలల్లోనే పూర్తి చేశామని మంత్రి చెప్పారు.

8. తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు.   జయశంకర్ వర్ధంతి సందర్భంగా బుధవారం ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే గండ్ర పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.  

9. విపక్షాల ఐక్యత కోసం  వివిధ రాష్ట్రాలకు చెందిన 15 మంది ప్రతిపక్షాల నేతలు రేపు పాట్నాలో భేటీ కానున్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇంట్లో జరగనున్న ఈ సమావేశానికి కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, ఎన్సీపీ, ఎస్పీ, ఎన్సీ తదితర పదిహేను పార్టీల అధినేతలు హాజరు కానున్నారు.  

10. ఒడిశా రైలు ప్రమాదం సమయంలో స్వచ్ఛందంగా స్పందించిన గ్రామస్థులు  వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు.  ఇప్పుడు ఆ గ్రామాభివృద్ధికి  రైల్వే మంత్రి  అశ్వినీ వైష్ణవ్  రూ.2 కోట్ల నిధులు ప్రకటించారు.   

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో కీలక పరిణామం చోటుచేసుకుంది.
సోషల్ మీడియా మోజు ఎంతలా పెరిగిపోయిందంటే.. కొందరు కనీస మానవీయ విలువలను, కన్నబిడ్డల భద్రతను కూడా విస్మరిస్తున్నారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
హైదరాబాదు నగరంలోని నాదర్‌గుల్‌లో ఉన్న ఎంవీఎస్ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో దాండియా వేడుకలు నిర్వహించారు.
తెలంగాణ వ్యాప్తంగా దసరా పండుగ శోభ సంతరించుకున్న వేళ, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎర్రవెల్లి నివాసంలో దసరా వేడుకలను అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో విజయదశమి లేదా దసరాకు ప్రత్యేక స్థానం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
పదేళ్లుగా పెండింగ్‌లో రూ.20 కోట్ల విలువైన స్థలం.. పఠాన్ ఎన్డీఏలో చేరగానే గిఫ్ట్.!
హైదరాబాద్‌లోని ఉప్పల్‌–నాగోల్ మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.