న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పేరుతో సైబర్ మోసగాళ్ల టోకరా
Publish Date:Dec 30, 2025
Advertisement
నూతన సంవత్సర వేడుకలను అవకాశంగా మలుచుకున్న సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు కొత్తరకం ఎత్తుగడలకు తెరలేపారు... “న్యూ ఇయర్ గ్రీటింగ్స్”, “గిఫ్ట్ వచ్చింది” అంటూ లింకులు, ఏపీకే (APK) ఫైల్స్ పంపిస్తూ అమాయకపు జనాలపై వల విసురుతు న్నారు. . గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వస్తున్న ఈ ఫైల్స్‌ను ఓపెన్ చేస్తే మొబైల్ ఫోన్ మొత్తం సైబర్ నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్లే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు పంపిస్తున్న ఏపీకే గిఫ్ట్ ఫైల్స్ ఓపెన్ చేసిన వెంటనే ఫోన్‌లో ఉన్న కీలక సమాచారం మొత్తం హ్యాక్ అవుతోంది. ముఖ్యంగా బ్యాంక్ యాప్స్, వాలెట్ యాప్స్‌ను ఓపెన్ చేసి ఖాతాల్లోని డబ్బును క్షణాల్లో ఖాళీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కొంతమంది నేర గాళ్లు బాధితుల పేరుతోనే వారి కాంటాక్ట్స్‌లో ఉన్న వ్యక్తులకు “డబ్బులు కావాలి” అంటూ మెసేజ్‌లు పంపి మోసానికి పాల్పడు తున్నారు. అలాగే వాట్సప్‌ను హ్యాక్ చేసి బాధితుల స్నేహితులు, బంధువులకు డబ్బులు పంపాలని మెసేజ్‌లు పంపుతున్న ఘటనలు కూడా రోజురోజుకి పెరుగుతున్నాయి. ఈ తరహా మోసాల వల్ల ఇప్పటికే పలువురు లక్షల రూపాయలు కోల్పోయినట్లు సైబర్ క్రైమ్ అధికారులు వెల్లడించారు.ఈ విషయంలో డీసీపీ, సైబర్ క్రైమ్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే ఏపీకే ఫైల్స్, గిఫ్ట్ లింకులు ఓపెన్ చేయవద్దు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పేరుతో వచ్చే అనుమా నాస్పద మెసేజ్‌లను ఓపెన్ చేయకూడదు...ఫోన్ హ్యాక్ అయినట్లు అనుమానం వస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ పోలీసు లను సంప్రదించాలి. ఒకవేళ ఫోన్ పూర్తిగా సైబర్ నేరగాళ్ల కంట్రోల్‌లోకి వెళ్లినట్లు గుర్తిస్తే, తక్షణమే ఫ్యాక్టరీ రీసెట్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. అంతేకాకుండా తక్షణమే బ్యాంక్‌కు సమాచారం ఇచ్చి ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేయాలని, పాస్‌వర్డ్స్ మార్పు చేయాలని సూచించారు. నూతన సంవత్సరం సంబరాల సమయంలో చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టానికి దారి తీసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/new-year-greetings-36-211804.html





