తెలంగాణలో వాహనాలకు ఇక ‘టిఎస్’ సిరీస్!
Publish Date:Jun 12, 2014
.jpg)
Advertisement
తెలంగాణ రాష్ట్రంలో తిరిగే వాహనాల నంబర్లు మారనున్నాయి. ఇప్పుడున్న ‘ఎ.పి.’ పేరును తొలగించి ‘టి.ఎస్.’ అని మార్చుకోవాల్సి వుంటుంది. ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాహనాలకు బుధవారం నుంచి ‘టి.ఎస్.’ సిరీస్‌లో రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తారు. దీనికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ప్రతి జిల్లాకు కోడ్ నెంబర్ ఇస్తామని ఆయన చెప్పారు. దాని ప్రకారం వాహనాల నెంబర్లు మార్చాల్సి ఉంటుందన్నారు. నాలుగు నెలల్లో పాత వాహనాల నెంబర్లన్నీ మార్చుకోవాలని మహేందర్ రెడ్డి సూచించారు. అవసరమైతే నాలుగు నెలల గడువును పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఈ విషయంలో ఇంకా విధి విధానాలను రూపొందించాల్సి వుందని, ‘ఎ.పి.’ నుంచి ‘టి.ఎస్.’కి మారడానికి వాహనానికి ఎంత ఖర్చు అయ్యేది కూడా త్వరలోనే ప్రకటిస్తామని ఆయన చెప్పారు. కొత్త వాహనాలకు మాత్రం బుధవారం నుంచి టీఎస్ పేరుతో రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని మహేందర్ రెడ్డి సూచించారు.
http://www.teluguone.com/news/content/new-vehicle-registration-code-for-telangana-39-34748.html












