యూపీ రాజీ డ్రామాలో మరో మలుపు..

Publish Date:Jan 12, 2022

Advertisement

ఉత్తప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల క్రతువు ఇంకా పూర్తిగా ప్రారంభం కాలేదు. కేవలం ఎన్నికల షెడ్యూలు మాత్రమే విడుదలైంది. కానీ, ఇంతలోనే రాజకీయం చిత్ర విచిత్ర మలుపులు తిరుగుతోంది. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తీరు పట్ల గుర్రుగా ఉన్న, కార్మిక శాఖ మంత్రి, బలమైన ఓబీసీ నేత స్వామి ప్రసాద్‌ మౌర్యతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలకు ఒకే రోజు పార్టీకి గుడ్‌బై చెప్పారు. అంతే అయితే, అదో రకం, కానీ కథ అక్కడితో ముగియ లేదు. మంత్రి పదవికి రాజీనామా చేసిన మంత్రి మౌర్య, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు సమాజ్ వాదీ పార్టీలో చేరడం ఖాయమని వార్త లొచ్చాయి. మరెవరో కాదు, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ట్విటర్ వేదికగా మౌర్య పార్టీలో చేరుతున్నారని ప్రకటించారు. ముహూర్తం కూడా నిర్ణయించారు. 

అయితే, ఇంతలోనే ఏమైందో ఏమో కానీ, తమ రాజీనామాపై వస్తోన్న వార్తలపై స్పందించిన మౌర్య, తాను కేవలం మంత్రిమండలి నుంచి మాత్రమే వైదొలిగానని, బీజేపీ పార్టీ సభ్యత్వానికి ఇంకా రాజీనామా చేయలేదని చెప్పారు. అలాగే, సమాజ్‌వాదీ పార్టీలో చేరే విషయమై కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. మరో రెండు రోజుల తర్వాత తన భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తానని మౌర్య యూపీ స్టోరీని కొత్త మలుపు తిప్పారు.

దీని బట్టి చూస్తే అయన అటు బీజేపీతో ఇటు ఎస్పీతోనూ బేరసారాలు జరుపుతున్నారని అనుమానిన్చావలసి వస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, బీజేపీలో కొనసాగే ఆలోచన లేదన్న సంకేతాలు ఇచ్చారు. తన రాజీనామా బీజేపీలో ప్రకంపనలు సృష్టించిందని, రానున్న రోజుల్లో మరింత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీని వీడే అవకాశాలున్నాయని, మరో సంచలనానికి తెర తీశారు. ఆ విధంగా బీజేపీలో కొనసాగే ఆలోచన లేదని చెప్పకనే చెప్పారు. 

మౌర్య వ్యవహారం ఆలా ఉంటే ఆయనతో పాటు  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమైన ముగ్గురు ఎమ్మెల్యేలలో ఒకరైన వినయ్‌ షాక్యా కిడ్నాప్‌కు గురైనట్లు వచ్చిన వార్తలు రాష్ట్ర‌ రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. స్వయంగా ఆయన కుమార్తె రియానే బ్రెయిన్‌ స్ట్రోక్‌ కు గురైన తండ్రిని తన బాబాయే అపహరించినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనే తన తండ్రిని బలవంతంగా సమాజ్‌వాదీ పార్టీలో చేరుస్తున్నారని ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలను ఎమ్మెల్యే వినయ్‌ ఖండించారు. తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని, తాను సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. తన  కుమార్తె చెప్పిందాంట్లో నిజం లేదని, తాను స్వామి ప్రసాద్‌ మౌర్య వెంటే ఉంటానని స్పష్టం చేసినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. మొత్తానికి యూపీ రాజకీయం, నాటకీయ పరిణామాల మధ్య మలుపులు తిరుగుతోంది.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సర్వం సిద్ధమైంది.
హైదరాబాద్ నగరంలోని రేతిబౌలి ప్రాంతంలో జరిగిన పెళ్లి ఊరేగింపులో కత్తులు చేతబట్టి నృత్యం చేసిన నలుగురు వ్యక్తులను గుడిమల్కాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
సూపర్ ఇంటెలిజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మనిషి సహజ వృద్ధాప్య ప్రక్రియను నియంత్రించగలిగితే, సుమారు 1,400 సంవత్సరాల వరకు జీవించే అవకాశం
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
ప్రపంచ అందాల పోటీల చరిత్రలో కీలక మలుపు చోటు చేసుకుంది.
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు, రేడియల్ రోడ్ల నిర్మాణం, పట్టణాభివృద్ధి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాజెక్టుల పనుల స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ముంబయిలోని కాలాచౌకి ప్రాంతానికి చెందిన ఉదయ్ పవార్ పట్టుదల, ఆచరణాత్మక ఆలోచనలతో చిన్న స్థాయి సేవను లాభదాయక వ్యాపారంగా తీర్చిదిద్దారు.
పిల్లల కేరింతలు.. ఆటపాటలు.. ఆనందోత్సాహాల మధ్య సాగాల్సిన స్కూల్ పిక్నిక్ ఓ చిన్నారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
కుటుంబాలను పోషించేందుకు రోజూ పనికి వెళ్లిన ఆ ముగ్గురు కార్మికులకు అదే పని చివరి రోజవుతుందని ఎవరూ ఊహించలేదు
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
చనిపోయిన రోగుల పేర్లపైనా బిల్లులు..ఏసీబీ దాడుల్లో బట్టబయలు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.