Publish Date:Jun 30, 2025
తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ భార్య స్వప్న తెరపైకి వచ్చి సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త అమాయకుడని, అసలు బాధితురాలు తనేనంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఈ కేసులో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో నిందితుడైన పూర్ణచందర్‌ను వెనకేసుకొస్తూ ఆయన భార్య స్వప్న మాట్లాడారు. తన భర్త ద్వారానే స్వేచ్ఛ తనకు పరిచయమైందనీ, అప్పుడు వారిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి తనకు తెలియదని చెప్పిన స్వప్న, ఆ తరువాత వారి మధ్య ఎఫైర్ తెలిసి భర్తకు దూరమయ్యానని వివరించారు.
అంతేకాకుండా.. స్వేచ్ఛ తనను మానసికంగా వేధించిందని స్వప్న ఆరోపించారు. అదే విధంగా పూర్ణచందర్‌ను స్వేచ్ఛ బ్లాక్‌మెయిల్ చేసిందని, తన పిల్లలను కూడా "అమ్మా" అని పిలవాలంటూ భయపెట్టిందని చెప్పారు. స్వేచ్ఛ కుమార్తె అరణ్య తన భర్తపై చేస్తున్న ఆరోపణల్లో ఇసుమంతైనా నిజం లేదని స్వప్నచెప్పిన స్వప్న పూర్ణచందర్ అరణ్యను సొంత కూతురిలాగే చూసుకున్నాడన్నారు. నిందితుడి భార్య మృతురాలిపై ఆరోపణలు చేయడం ఈ కేసు దర్యాప్తులో ఈ వ్యాఖ్యలు కీలకంగా మారే అవకాశం ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/new-twist-in-swetcha-sucide-case-25-200939.html
మొహర్రం సందర్బంగా హైదరాబాద్‌లోని డబీర్ పురాలోని బీబీకా ఆలంను ఇవాళ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సందర్మించారు. ఈ సందర్బంగా బీబీకా ఆలయంలో మంత్రులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ల గత కొద్ది కాలంగా బీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అసలే గత ఎన్నికలలో పరాజయంపాలై, అధికారానికి దూరమై నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ కవిత ధిక్కార ధోరణితో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
రైతు సంక్షేమంపై ఎక్కడైనా చర్చకు సిద్దమని సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.
గూగుల్ మ్యాప్ సాయంతో కారులోవెళ్తున్న ప్రయాణికుల కారు వాగులో పడిపోయింది. జనగామ జిల్లా వడ్లకుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాగ్‌పూర్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఎల్బీ స్టేడియంలో జరిగిన సభ మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెంట్రిక్ గానే జరిగింది.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనారోగ్యం కారణంగా ఈ నెల 2న ఆయన అనారోగ్యం కారణంగా సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే.
చిత్తూరు జిల్లా మామిడి వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి పొలిటికల్ టర్న్ తీసుకుంది. జూలై 9న జగన్ బంగారుపాలెం మార్కెట్ యార్డ్ కి వచ్చి ఇక్కడి రైతులను పరమార్శించనున్నారు. కారణం ఈ రైతులకు తగిన ధర లేక అవస్థ పడుతున్నారని తెలియడమే. అలా తెలియడంతో ఇలా వారి కోసం ఓదార్పుయాత్రకు వచ్చేస్తున్నారు.
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్రం గుడ్ న్యస్ చెప్పింది. ఇక జాతీయ రహదారులపై టోల్ ఫీజ్ సగానికి సగం తగ్గనుంది. ఔను కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల టోల్ ఫీజు నిబంధనల్లో చేసిన మార్పుల కారణంగా ఇది భారీగా తగ్గే అవకాశం ఉంది.
బేసిగ్గా జేపీ నడ్డా అధ్యక్ష పదవీ కాలం 2023 జనవరితోనే ముగిసింది. అయితే 2024 లో ఎన్నికల కారణంగా జూన్ వరకూ పొడిగించారు. అప్పటికీ ఏడాది గడచిపోయింది. ఇప్పుడు పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం అనివార్యం.
తెలంగాణలో ఇప్పటికే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక అనివార్యం కావడంతో అన్ని పార్టీలూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి. గెలుపు గుర్రాలను బరిలోకి దింపి సత్తా చాటాలన్న వ్యూహాలు, ప్రణాళికలలో నిమగ్నమయ్యాయి.
అమరనాథ్ యాత్ర కొనసాగుతోంది. గురువారం (జూలై) ప్రారంభమైన ఈ యాత్ర 38 రోజుల పాటు సాగుతుంది. శనివారం (జులై 5) మూడో రోజు యాత్ర కొనసాగుతోంది.
చిత్తూరు జిల్లాలో ఎనుగుల గుంపు భయాందోళనలు సృష్టిస్తోంది. జిల్లాలోని గ్రామాలపై దాడులు చేస్తూ పంటపొలాలను ధ్వంసం చేస్తున్నాయి.
మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల డిజైన్ మార్పును గిరిజనం వ్యతిరేకిస్తున్నారు. కొత్త డిజైన్ నమూనా ఆదివాసి సంస్కృతికి వ్యతిరేకంగా ఉందని మేడారం పూజారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.