అక్రమాస్తుల కేసులో కదలిక.. జగన్‌కు కొత్త టెన్షన్!?

Publish Date:Nov 2, 2023

Advertisement

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హడావుడి మొదలైన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఈ నెలలోనే ఎన్నికలు జరగనుండగా ఏపీలో వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లో జరగనున్నాయి. అంటే ఏపీలో కూడా ఐదు నెలలలోనే ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఏపీలో కూడా రాజకీయం రసవత్తరంగా సాగుతున్నది.  ఇప్పటికే విపక్ష తెలుగుదేశం  దూకుడు మీద ఉండగా.. జనసేన కూడా తెలుగుదేశంకు తోడు కావడంతో  అధికార వైసీపీలో ఓటమి భయం ముప్పిరి గొంది.

ఇప్పటికే ముందస్తు సర్వేలు, ప్రజల అభిప్రాయాలతో వైసీపీ ఓటమి ఖరారైనట్లేనని నివేదికలు బయటకు వస్తున్నాయి.  దీంతో వైసీపీ లో నిరుత్సాహం అలముకుంది.  సీఎం జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలతో ఉత్సాహం నింపేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా విపక్షాల జోరు ముందు అవేమీ ఆనడం లేదు. తెలుగుదేశం అధినేత  చంద్రబాబును అరెస్టు చేసి.. ఆయనను జనానికి దూరం చేశామని అధికార వైసీపీ భావించినా.. ఆ అరెస్టు జనంలో వైసీపీపై   వ్యతిరేకత  మరింత పెరగడానికీ, తెలుగుదేశం పట్ల అభిమానం వెల్లువెత్తడానికీ మాత్రమే దోహదపడింది. మధ్యంతర బెయిలుపై చంద్రబాబు బయటకు వచ్చిన తరువాత జనం ఆయనకు బ్రహ్మరథం పట్టిన తీరు చూసిన వైసీపీ శ్రేణులకు సినిమా అర్ధమైపోయింది. అయితే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న వైసీపీకి , ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఇప్పుడు  కొత్త టెన్షన్ మొదలైంది.   

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ హైదరాబాద్ నుంచి  వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ  వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ ను సుప్రీం శుక్రవారం విచారించనుంది. జగన్ పై  సీబీఐ నమోదు చేసిన 11 కేసులు ఇప్పటి వరకూ 3,041 సార్లు వాయిదా పడ్డాయని తన పిటిషన్ లో పేర్కొన్న రఘురామకృష్ణం రాజు.. ఈ కేసులో విచారణ త్వరగా జరిపి నిందితులను శిక్షించాలన్న ఉద్దేశం సీబీఐలో కనిపించటం లేదని ఆరోపించారు. ఇందులో జగన్ కు ఇష్టానుసారం వాయిదాలు కోరే స్వేఛ్చను ఇచ్చారని..  ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే కేసుల విచారణ ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించటం లేదని రఘురామరాజు తన పిటిషన్ లో పేర్కొన్నారు.  తమిళనాడుకు ముఖ్యమంత్రిగా చేసిన జయలలిత అక్రమాస్తుల కేసుల విచారణను కర్నాటకలో విచారణ జరిపినట్లే.. ఇప్పుడు జగన్ కేసుల విచారణను తెలంగాణలో కాకుండా మరో రాష్ట్రంలో  జరపాలని   తన పిటీషన్‌లో కోరారు.

కాగా  జగన్ అక్రమాస్తుల కేసుతో రఘురామ సుప్రీం తలుపు తట్టడం  రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.   జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భట్టిలతో కూడిన ధర్మాసనం  ఈ పిటిషన్‌ విచారించనుంది.   ఈ పిటిషన్ శుక్రవారం (నవంబర్ 3) విచారణకు రానుంది.  జగన్ కేసుల విషయంలో విచారణ జాప్యం మీద సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా  అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. పిటిషనర్ ఎంపీ రఘురామ కోరినట్లుగా వేరే రాష్ట్రానికి ఈ కేసుని బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయా? ఒక వేళ ఉంటే  ఏ రాష్ట్రానికి ఈ కేసు బదిలీ చేసే అవకాశం ఉంది అన్న చర్చ జోరందుకుంది. సుప్రీం ఈ కేసుపై అడిగే ప్రశ్నలకు సీబీఐ ఎలాంటి సమాధానం ఇవ్వనుంది.. ఎందుకు విచారణ ఇంత ఆలస్యమవుతుందంటే ఏ చెప్పనుందన్నది ఆసక్తిగా మారింది.

ఈ కేసులో సుప్రీం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది జగన్ మోహన్ రెడ్డికి ఇబ్బందికరమే అవుతుంది. ఈ కేసు మరో రాష్ట్రానికి బదిలీ చేసినా..  సీబీఐ కోర్టు విచారణకు జగన్ రావాల్సిందేనని నోటీసులు ఇచ్చినా కూడా అది జనగ్ కు ఇబ్బందికరంగానే మారుతుందనడంలో సందేహం లేదు.   ఎన్నికల సమయంలో జగన్ అక్రమాస్తుల కేసులో కదలిక మళ్లీ జగన్ కేసులపై జనం దృష్టి మళ్లడానికి దోహదపడుతుందనడంలో సందేహం లేదు. స్కిల్ కేసులో చంద్రబాబు గొప్పతనంపై జనంలో చర్చ జరిగింది. అదే జగన్ అక్రమాస్తుల కేసులో కదలిక వస్తే.. జగన్ అక్రమార్జన, క్విడ్ ప్రోకో, అరెస్టు వంటి  అంశాలపై  జనంలో చర్చ జరుగుతుందని  పరిశీలకులు  విశ్లేషిస్తున్నారు. దీంతో కేసులో ఎలాంటి కదలిక వచ్చినా అది జగన్ ప్రతిష్టకు  భగం వాటిల్లడమే కాకుండా.. ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా కూడా మారుతుంది. అసలే చంద్రబాబు అక్రమ అక్రమ అరెస్టుతో తెలుగుదేశం  శ్రేణులు ఇప్పటికే పదే పదే జగన్ కేసులను ప్రస్తావిస్తున్నాయి. జగన్ బెయిలు దశాబ్ద  ఉత్సవాలు అంటూ సెటైర్లు కూడా వేశాయి. ఇలాంటి సమయంలో సీబీఐ ఈ కేసు విచారణ వేగవంతం చేస్తే అది కచ్చితంగా   జగన్ కు ఇబ్బందికరంగా మారుతుంది. అలాగే ఒకవేళ ప్రతి శుక్రవారం సీబీఐ  కోర్టులో జగన్ విచారణకు రావాల్సిందేనని ఆదేశిస్తే..  అది జగన్  ప్రతిష్టకు డ్యామేజీ అవుతుందనడంలో సందేహం లేదు.  ఏది ఏమైనా ఈ కేసు భవితవ్యం ఏంటన్నది ఈ శుక్రవారం దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చనుండడంతో ఇప్పుడు అందరి దృష్టి అక్కడే ఉంది. సుప్రీం నిర్ణయం ఎలా ఉంటుందన్న ఆసక్తి అన్న విర్గాలలో వ్యక్తం అవుతోంది. 

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచడం వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు చేపట్టిన నషా ముక్త్ భారత్ యాత్రకు ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
తమిళనాడులో సంచలనం సృష్టించిన మహిళా ఐఏఎస్ అధికారిణి వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
మదురై సమీపంలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభం వద్ద శనివారం దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.