టీడీపీలో కొత్త పదవి.. నారా లోకేష్‌కి ప్రమోషన్?

Publish Date:May 15, 2025

Advertisement

కడప మహానాడులో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అందులో భాగంగా ఐటీ, విద్యాశాఖ మంత్రిగా తనదైన ముద్ర వేస్తున్న నారా లోకేష్ కు టీడీపీలో నిర్ణయాత్మక పదవి ఇచ్చేందుకు కడప మహానాడు వేదిక అవుతుందన్న  ప్రచారం జోరందుకుంది. లోకేష్‌కు ప్రమోషన్‌పై టీడీపీలో ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. ఆ ప్రమోషన్ ఎలా ఉండబోతుందనే ప్రశ్నలకు ఈ మహానాడు సమాధానం చెప్పనుందని అంటున్నారు. టీడీపీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా లోకేష్‌ను నియమించే ఛాన్స్‌ ఉందంటున్నారు. నారా లోకేష్‌ కోసం పార్టీలో కొత్తగా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పోస్ట్‌ క్రియేట్ చేయబోతున్నారంట.

 ఇకపై ఒక నేతకు ఒకే పదవి రెండు సార్లు మాత్రమే ఇవ్వాలనుకుంటున్నారంట. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని వదులుకుంటానని లోకేష్‌ చెప్పినట్లుగా టాక్ నడుస్తోంది. అందుకే కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని ఏర్పాటు చేసే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే టీడీపీ తొలి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా లోకేష్ బాధ్యతలు చేపట్టడం లాంఛనమే. నారా లోకేశ్ ఇప్పుడు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలకంగా ఉన్నారు. ఆయన తన ముద్రను అన్ని రకాలుగా చూపించుకుంటున్నారు. దీంతో పాటు కార్యకర్తలకు రెగ్యులర్ గా అందుబాటులో ఉంటున్నారు. 

నారా లోకేశ్  యూత్‌కు కనెక్ట్ అవుతుండటంతో ఆయన ఇమేజ్ ను మరింత పార్టీ పరంగా పెంచాలన్న ఆలోచనలో పార్టీ సీనియర్లు ఉన్నారంట. పొలిట్ బ్యూరోతో పాటు పార్టీలోనూ యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి లోకేష్‌ను మరింత ఎలివేట్ చేయడానికే ఈ కొత్త పోస్ట్ అంటున్నారు. మొన్నటి వరకూ లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని పార్టీలోనే డిమాండ్లు బాగా వినిపించాయి. అయితే ఆ టాపిక్ పై మాట్లాడొద్దని సీఎం చంద్రబాబు స్వయంగా పార్టీ నేతలను హెచ్చరించారు.

అటు పార్టీలోని ఇతర కీలక నేతలు మాత్రం పార్టీ పరంగా లోకేశ్ కు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని అంటున్నారు. రెగ్యులర్ గా కార్యకర్తలకు అందుబాటులో ఉండే లోకేశ్ కు కీలక పదవి ఇస్తేనే పార్టీ మరింత బలోపేతమవుతుందని సూచిస్తున్నారు. అందుకే ఈ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పోస్ట్ క్రియేట్ చేస్తున్నారంట. ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పీడ్ పెంచారు. వ్యూహాత్మకంగా ఆయ‌న అడుగులు వేస్తున్నట్టు ప‌నితీరే చెబుతోంది. ప్రధానంగా విద్యావంతుల్ని ఆక‌ర్షించ‌డం ద్వారా, వాళ్ల కుటుంబాల్ని రాజ‌కీయంగా త‌మ‌వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

లోకేష్ నేతృత్వంలో ఇప్పటి వ‌ర‌కూ 91 ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటుకు ముందుకొచ్చాయి. 91వేల 839 కోట్ల పెట్టుబ‌డులు, ఒక లక్షా 41వేల 407 ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్దమయ్యాయి. రాబోయే ఐదేళ్లలో ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ రంగాల్లో 5 ల‌క్షల ఉద్యోగాల కల్పన దిశగా లోకేష్ కృషి చేస్తున్నారు. సో అటు పార్టీ, ఇటు ప్రభుత్వం రెండిట్లోనూ తనదైన ముద్ర వేసుకుంటున్న లోకేష్‌ను పార్టీపరంగా మరింత నిర్ణయాత్మక శక్తిగా మార్చడానికి ఈ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పోస్ట్ దోహద పడుతుందనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారంట. మరి చూడాలి కడప మహానాడులో ఎలాంటి కీలక నిర్ణయాలు ప్రకటిస్తారో?

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.