ఏపీలో కొత్త సమీకరణాలు.. వైసీపీకి ప్రమాద ఘంటికలు

Publish Date:Aug 30, 2022

Advertisement

రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది నానుడి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మారుతున్న రాజకీయ సమీకరణాలు ఆ నానుడికి అద్దంపట్టేవిగానే ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నాలుగేళ్ల కిందట మైత్రీ బంధాన్ని తెంచుకున్న తెలుగుదేశం, బీజేపీలు మళ్లీ దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నాయా? ఏపీలో తెలుగుదేశంతో మైత్రి బీజీపీకి తెలంగాణలో రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుందా? తెలంగాణ బీజేపీ నాయకత్వం ఏపీలో తెలుగుదేశంతో పార్టీ పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ అగ్రనాయకత్వానికి చెప్పిందా? అన్న ప్రశ్నలకు పరిశీలకులు ఔననే సమాధానం ఇస్తున్నారు.

 తెలంగాణ కమలం పార్టీ అధికారం చేపట్టాలంటే తెదేపా సహకారం అవసరం అని  బీజేపీ అగ్రనాయకత్వం కూడా భావిస్తుండటం వల్లనే ఏపీలో హటాత్తుగా వైసీపీపై బీజేపీ ఉద్దేశపూర్వక దూరాన్ని పాటిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వినాయకమండపాలకు ఫీజులపై అటు బీజేపీ-ఇటు టీడీపీ సర్కారుపై ఏకకాలంలో దాడి చేయడం   ఆ రెండు పార్టీలూ దగ్గర అవుతుందనడానికి సంకేతమని పేర్కొంటున్నారు.  అదే కాకుండా బెజవాడలో ముర్ముతో టీడీపీ నేతల భేటీ వద్దంటూ వైసీపీ  బీజేపీపై ఎంత  ఒత్తిడి తసుకు వచ్చినా వినకుండా  ఆమెతో టీడీపీ నేతల భేటీ కి సోము వీర్రాజు వంటి నేతలు స్వయంగా పూనుకోవడాన్ని కూడా ఇందుకు ఉదాహరణగా పరిశీలకులు చూపుతున్నారు. అంతే కాకుండా ఉరుము లేని పిడుగులా హఠాత్తుగా  చంద్రబాబుకు   12+12 ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ పెంచడం  కూడా ఆ రెండు పార్టీలూ దగ్గర అవుతున్నాయనడానికి నిదర్శనమేనని అంటున్నారు. మోదీ-బాబు భేటీ తర్వాతే ఏపీ బీజేపీ వైసీపీ ఎదురుదాడి తీవ్రతను పెంచిందని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో మోడీ, చంద్రబాబు కొన్ని నిముషాల పాటు ముచ్చటించుకోవడాన్ని వైసీపీ వారు జీర్ణించుకోలేకపోవడం కూడా బీజేపీ, తెలుగుదేశం పార్టీల మధ్య సయోధ్య అన్న ఆలోచనే వైసీపీని వణికిస్తోందనడానికి ప్రబల నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 అన్నిటికీ మించి ఇటీవల అమరావతి మహిళా జేఏసీ ఉపరాష్ట్రపతిని కలసి, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆయన దృష్టికి తీసుకువెళ్లింది. ఎంపీ గోరంట్ల మాధవ్ అంశంపై ఆయనకు ఫిర్యాదు చేసింది. అయితే ఆ సందర్భంగా ఉపరాష్ట్రపతి చంద్రబాబు దార్శనికతను   ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు వైసీపీలో వణుకు పుట్టించాయని చెప్పక తప్పదు.

 అందుకే మోడీని విమర్శించిన టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే అది వాళ్లిష్టం అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామృష్ణారెడ్డి వ్యాఖ్యానించారని అంటున్నారు. నిజానికి పొత్తులు అన్నది పూర్తిగా రెండు పార్టీలకు సంబంధించిన అంతర్గత వ్యవహారం.  ఆ విషయంలో ఎవరైనా ఎందుకు ఉలిక్కిపడాలో, ఎందుకు అభ్యంతరం చెప్పాలో అర్ధం కాని వ్యవహారం. ఇక చంద్రబాబుకు తాజాగా ఎన్ఎస్జీ భద్రత పెంపు విషయంలో కూడా వైసీపీ భుజాలు తడుముకుంటోంది. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యంగా తయారవ్వడమే భద్రత పెంపునకు కారణమని ఎవరూ విమర్శలు గుప్పించకపోయినా స్వచ్ఛందంగా వివరణలు ఇచ్చుకుంటోంది. కమలం తీర్థం పుచ్చుకున్న ఇద్దరు నేతల వల్లే చంద్రబాబుకు భద్రత పెంచారని వైసీపీ విమర్శించడం బీజేపీ, తెలుగుదేశం పొత్తుపై ఆ పార్టీలో నెలకొన్న ఆందోళనకు, భయానికీ తార్కానంగా చెబుతున్నారు.

By
en-us Political News

  
కేరళం ప్ర‌జ‌ల‌కు దశాబ్దాలుగా సేవ చేస్తూ, విలువలతో కూడిన‌ రాజకీయాలు చేసే సతీశన్‌కు ఈ పదవి రావడం సముచిత గుర్తింపని రేవంత్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు అధికార బాధ్యతలు అప్పగించారని అన్నారు.
ఎల్‌డీఎఫ్ హయాంలో వి.డి.సతీశన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. క్లిష్ట సమయలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన తీవ్రంగా శ్రమించారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి తీసుకు రావడంలో సతీశన్ కీలక పాత్ర పోషించారు. కేరళం కాంగ్రెస్ కేడర్‌లో కూడా ఇదే అభిప్రాయం బలంగా ఉంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న అధిష్ఠానం సీఎంగా సతీశన్ ను ఎంపిక చేసింది.
సాధారణంగా ముఖ్యమంత్రులు, మంత్రుల పర్యటనల సమయంలో భద్రతా కారణాల రీత్యా పెద్ద సంఖ్యలో వాహనాలు కాన్వాయ్‌లో ఉంటాయి. అయితే.. దీనివల్ల భారీగా ఇంధన వ్యయం అవ్వడమే కాకుండా.. ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయని భావించిన సీఎం, డిప్యూటీ సీఎం.. ఖజానాపై అనవసర భారం పడకూడదనే ఉద్దేశంతో, భద్రతకు విఘాతం కలగకుండానే వాహనాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించారు.
తీవ్రమైన పోక్సో కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆ కారణంగానే బండి కుమారుడిపై పోక్సో కేసు నీరుగారిపోయిందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌ను ఏ విధంగా ఐటీ, హెల్త్ హబ్‌గా మార్చానో గుర్తు చేస్తూ.. అమరావతిని అంతకంటే అద్భుతమైన నగరంగా నిర్మిస్తానని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ గతమైతే, అమరావతి భవిష్యత్తు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని దాదాపు మూడు వారాల పాటు విధులకు దూరంగా హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకున్న ఆయన బుధవారం ఉదయం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని విధుల్లో నిమగ్నమయ్యారు.
ఈ బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది శాసనసభ్యులు మద్దతు పలకగా.. 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో ఐదుగురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అమరావతి నిర్మాణ వేగం పెరిగింది. అయినా వైసీపీ అధినేత మావిగన్ ప్రతిపాదన, అమరావతి పురోగతిని అడుగడుగునా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు మాత్రం అమరావతి అనిశ్చితి మేఘాలు పూర్తిగా తొలగిపోకుండా ఉండేందుకు కారణమయ్యాయి.
బండి బగీరథ ఈ కేసు నుంచి పులుకడిగిన ముత్యంలా బయటపడితేనే.. తిరిగి బండి సంజయ్ కు పార్టీలో ప్రాధాన్యత, గుర్తింపు ఉంటాయని అన్యాపదేశంగానే అయినా విస్పష్ట సందేశం ఇచ్చింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వమైతే.. చట్టం ముందు అంతా సమానమేనని స్పష్టం చేసింది.
ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో విజయ్ తన కారు డ్రైవర్‌ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌కు విజయ్ టీవీకే తరఫున టికెట్ ఇచ్చారు. చెన్నైలోని విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శబరినాథన్ విజయం సాధించారు. తాజాగా ఆయన్ను ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కీలక సమావేశం నిర్వహించారు.
కేవలం మర్యాదపూర్వక భేటీలుగా వీటిని చూడలేమని, దీని వెనుక తెలంగాణలో ఎన్డీయే కూటమిని బలోపేతం చేసే భారీ వ్యూహం దాగి ఉందనీ ప్రముఖ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు నివాసంలో గంటకు పైగా గడపడం.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం వెనుక లోతైన రాజకీయ అర్థాలు ఉన్నాయన్నారు.
తమిళనాడు ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా సుమారు రూ.48వేల‌ కోట్ల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం మూసివేసినవి కేవలం 717 దుకాణాలు మాత్రమే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దుకాణాల్లో ఇది కేవ‌లం 15శాతం మాత్ర‌మే. ఇందువల్ల ఆదాయంలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ, అది భారీ నష్టం కాకపోవచ్చు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.