అడకత్తెరలో పోకచెక్కలా కేసీఆర్ పరిస్థితి!

Publish Date:May 26, 2023

Advertisement

నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం పై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధంగా మొదలైన వివాదం, రాజకీయ దుమారంగా మారింది. పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి ఎలా ప్రారంభిస్తారని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రపతి చేతుల మీదుగా పార్లమెంట్ నూతన భవనం ప్రారంభించడం సముచితంగా ఉంటుందని, రాజ్యాంగాన్ని ఉటంకిస్తున్న ప్రతిపక్ష పార్టీలు ప్రాధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా నూతన పార్లమెంట్ భవనం ప్రారంభించడం రాష్ట్రపతిని అవమానించడమే అని అరొపిస్తున్నాయి. 

అంతే కాదు, చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయే, ఆ గౌరవం ప్రధాని మోడీకి ఎట్టి పరిస్థితుల్లో దకక్కుండా అడ్డుకునేందుకు విపక్షపార్టీలన్నీ ఏకమయ్యాయి. ఒకటి  కాదు, రెండు కాదు ఏకంగా 19 ప్రతిపక్ష పార్టీలు నూతన పార్లమెంట్ భవన సముదాయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రారంభ వేడుకలను బహిష్కరించాలని నిర్ణయించాయి. మరో అడుగు ముందుకేసి ప్రదాని మోడీ చేతుల మీదుగా పార్లమెంట్ భవనం ప్రారంభం కాకుండా అడ్డుకునేదుకు న్యాయస్థానాలను సైతం ఆశ్రయిస్తున్నారు. సరే, చివరకు న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుంది ఏమిటి అనే విషయాన్ని పక్కన పెడితే, విపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, మోడీ చేతుల మీదుగా పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం జరగడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. 

నిజానికి, ప్రారంభ వేడుకలనే కాదు, పార్లమెంట్ నూతన భవన నిర్మాణాన్ని ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి గట్టిగా వ్యతిరేకిస్తోంది. పార్లమెంట్ భవన శంకు స్థాపన సమయంలోనే కాంగ్రెస్ పార్టీ అప్పటి తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కొవిడ్ కారణంగా చూపించి, పార్లమెంట్ నిర్మాణ పనులను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇతర నాయకులు అనేక సందర్భాలలో అసలే దేశం క్లిష్ట పరిస్థితిల్లో  ఉందని అంటూ  ఇప్పడు నూతన పార్లమెంట్ భవనం  అవసరమా అని ప్రశ్నిస్తూ వచ్చారు. అయితే, విపక్షాలు ఎన్ని అభ్యంతరాలు చెప్పినా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుకున్న విధంగా పార్లమెంట్ నిర్మాణ పనులను కొనసాగించింది. అనుకున్న విధంగానే నిర్మాణం పూర్తిచేసింది. ఈనెల (మే) 28 న ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. ఈ దశలో విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి గౌరవాన్ని అస్త్రంగా చేసుకుని వేడుకను వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నది.

అయితే.. పార్లమెంట్ ప్రాంగణంలో నిర్మించిన భవనాలను ప్రధానమంత్రి టెంకాయ కొట్టడం ఇదే తొలిసారి కాదని అధికార బీజేపీ నాయకులు, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద జోషీ ఇతర మంత్రులు గుర్తుచేస్తున్నారు. గతంలో 1975లో  పార్లమెంట్ ప్రాంగణంలో నిర్మించిన నూతన భవన సముదాయాన్ని అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రారంభించారు. ఆతర్వాత 1980లలో అదే పార్లమెంట్ ప్రాంగణంలో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ప్రారంభించారని బీజేపీ నేతలు గుర్తుచేస్తున్నారు. 

అదలా ఉంటే, ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లుగా పార్లమెంట్ నితన భవనాలను ప్రధానమంత్రి ప్రారంభించడాన్ని తప్పు పడుతూ విపక్షాలు చేస్తున్న ఆందోళన, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అగ్ని పరీక్షగా మారింది. ఒక విధంగా 2024 ఎన్నికల్లో మోడీ ఓడించేందుకు ఏకమవుతున్న విపక్షాలు  పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి హాజరు కావడం అంటే, అది దేశ ద్రోహం కంటే మహాపరాధం అన్నట్లుగా, మోడీ వ్యతిరేకతకు లిట్మస్ టెస్ట్’గా భావిస్తున్నాయి. అటో ఇటో తేల్చుకోమని బీఆరేఎస్ వంటి బీజేపీ వ్యతిరేక పార్టీలకు సవాలు విసురుతున్నాయి. నిజానికి  ప్రతిపక్షాల ఐక్యతా యత్నాలు సాగిస్తున్న నితీష్ కుమార్, మమతా బెనర్జీ, శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్ వంటి నాయకులు ఎవరూ బీఆర్ఎస్ పార్టీని, కేసేఆర్ ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. దూరం ఉంచుతున్నారు. ఈ పరిస్థితిలో కేసీఆర్ .. సుమోటోగా  పార్లమెంట్ భవన ప్రరంభోత్సవ వేడులకలను  భాహిష్కరించడం ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకో వచ్చు. కానీ తెలంగాణ సచివాలయ నూతన భవన ప్రారంభోత్సవానికి గవర్నర్ పిలవక పోవడంతో, ఇప్పుడు ఎటూ తేల్చుకోలేక న్యూట్రల్ గా మిగిలి పోయారు. 

అదలా ఉంటే తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఇదే అదనుగా కేసీఆర్ కు చురక అంటించారు. పార్లమెంటును ప్రధాని మోడీ కాకుండా రాష్ట్రపతి ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె, తెలంగాణ సచివాలయ నూతన భవన ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని గుర్తుచేశారు. కనీసం తనకు ఆహ్వాన పత్రిక కూడా ఇవ్వలేదని తెలిపారు. దీంతో తెలంగాణ సర్కార్ పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారిపోయింది.

By
en-us Political News

  
జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్ అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలు దేశరాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశాధినేతలు, రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికపైకి వచ్చారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.