మంత్రి సురేఖ‌పై ముప్పేట దాడి.. కాంగ్రెస్‌కు మ‌రో త‌ల‌నొప్పి

Publish Date:Oct 3, 2024

Advertisement

తెలంగాణ కాంగ్రెస్ పార్టీని వివాదాలు చుట్టుముడుతున్నాయి. అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ నేతల మధ్య అంతర్గత విబేధాల కార‌ణంగా పార్టీ శ్రేణులు ఇబ్బందులు ప‌డుతున్నాయి. మ‌రోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాలు ప్ర‌జ‌ల్లో పార్టీకి మంచి పేరు తీసుకొస్తున్నాయి అనుకునేలోగా   హైడ్రా విష‌యంలో  ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. భాగ్య‌న‌గ‌రంలో చెరువులు, నాలాల‌ను ఆక్ర‌మించి చేప‌ట్టిన అక్ర‌మ నిర్మాణాల‌ను హైడ్రా కూల్చివేస్తోంది. ప్రారంభంలో సినీ న‌టుడు అక్కినేని నాగార్జున ఎన్ క‌న్వెన్ష‌న్ కూల్చివేత స‌మ‌యంలోనూ , మ‌రికొంద‌రి బ‌డాబాబుల అక్ర‌మ నిర్మాణాలు కూల్చివేత స‌మ‌యంలో హైడ్రాపై ప్ర‌జ‌ల నుంచి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిసింది. రేవంత్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని సర్వత్రా పొగడ్తలు వినవచ్చాయి. కానీ రోజుల వ్యవధిలో పరిస్థితి మారిపోయింది.  మూసీ ప‌రివాహ‌క ప్రాంతాల్లోని పేద‌ల ఇండ్ల‌కూల్చివేత హైడ్రాపైనే కాకుండా రేవంత్ సర్కార్ పై కూడా  తీవ్ర వ్య‌తిరేకతకు కారణమైంది. 
రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ ప్ర‌జ‌లు హైడ్రా తీరును త‌ప్పుబ‌డుతున్నారు. దీంతో  విపక్షాలు బీఆర్ఎస్‌, బీజేపీలు హైడ్రాను అడ్డుపెట్టుకొని రేవంత్ సర్కార్ ను, కాంగ్రెస్ ను ఇరుకుపెట్టేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నాయి. హైడ్రా విష‌యంపై రెండు రోజులుగా అధికార‌, విప‌క్ష‌  పార్టీల నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ఈ స‌మ‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి మ‌రో స‌మ‌స్య‌ ఎదురైంది. మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పై చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ రాజ‌కీయాల‌తోపాటు సినీ రంగాన్ని ఓ కుదుపు కుదిపేశాయి.

ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాకలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కొండా సురేఖకు మెదక్ ఎంపీ రఘునందనరావు చేనేత కార్మికుల సమస్యలను విన్నవిస్తూ నూలుపోగు దండను మంత్రి మెడలో వేశారు. దీనిపై కొందరు ట్రోల్స్ చేయడంతోపాటు అసభ్యకరంగా పోస్టులు చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్టులు చేసిన వ్యక్తుల డీపీలో బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు ఫోటో ఉండటంతో వాళ్లు బీఆర్‌ఎస్ కార్యకర్తలుగా కాంగ్రెస్ అనుమానిస్తోంది. బీఆర్‌ఎస్ నేతల ఆదేశాలతోనే ఈ పోస్టులు చేశారని, దీని వెనుక కేటీఆర్, హరీష్‌రావు ఉన్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ ట్రోలింగ్స్‌పై హరీష్‌రావు స్పందిస్తూ.. కొండా సురేఖను ఉద్దేశించి చేసిన పోస్టులు సమర్థనీయం కాదన్నారు. అయితే, కేటీఆర్ వీటిపై స్పందిచకపోవడంతో ఆయనను కాంగ్రెస్ టార్గెట్ చేసింది. ఈ క్ర‌మంలో కొండా సురేఖ మాట్లాడుతూ.. కేటీఆర్ లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేశారు. కొందరు హీరోయిన్లకు కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేశారని ఆరోపించారు. హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటుచేయడంతో పాటు.. కేటీఆర్ వారిని వేధించారనీ ఆరోపించారు. కొందరు హీరోయిన్లు కెరీర్ ను వదులుకుని వివాహం చేసుకోవడానికి కారణం కూడా కేటీఆర్ వేధింపులే కారణం అన్నట్లుగా విమర్శలు గుప్పించారు. దీనిపై ఎవరైనా హీరోయిన్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారా అనే ప్రశ్నకు మంత్రి కొండా సురేఖ స్పందిస్తూ.. వాళ్లెవరూ బయటకురారని, ప్రభుత్వం మాత్రం ఈ ఘటనపై విచారణ చేస్తుందన్నారు. ఇదే స‌మ‌యంలో సమంత, నాగచైతన్య విడాకులపై కూడా కొండా సురేఖ ఆరోపణలు చేశారు. వీరిద్దరూ విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అన్నారు. ఈ విషయం అందిరికీ తెలుసు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో చాలామందికి తెలుసంటూ సురేఖ‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సురేఖ వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ నేత‌లు, టాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు మండిప‌డుతున్నారు.

మంత్రి సురేఖ వ్యాఖ్య‌ల‌పై హీరో నాగార్జున‌, ఆయ‌న స‌తీమ‌ణి అమ‌ల‌తోపాటు స‌మంత కూడా స్పందించారు. వీరితోపాటు మ‌రికొంద‌రు టాలీవు్ సినీ ప్ర‌ముఖులు మంత్రి వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టారు. నాగార్జున ట్విట‌ర్ వేదిక‌గా స్పందిస్తూ.. కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ప్రకటించారు.  రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను, మీ ప్రత్యర్థుల్ని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని నాగార్జున పేర్కొన్నారు. నాగార్జున భార్య అమ‌ల కూడా ట్విట‌ర్ వేదిక‌గా స్పందించారు. రాజకీయ స్వలాభం కోసం ఇంత భయంకరమైన ఆరోపణలు చేయడం, మామూలు ప్రజలను వేటగా మార్చుకోవడం కూడా షాకింగ్‌గా అనిపిస్తోంది. రాహుల్ గాంధీ గారు.. మీరు నిజంగా మానవత్వాన్ని నమ్మితే మీ నాయకులను ఆపండి. అలాగే మీ మినిస్టర్ చేసిన ఘోరమైన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని మా కుటుంబానికి క్షమాపణలు చెప్పేలా చేయండి. ఈ దేశ ప్రజలను కాపాడండి.. అంటూ రాహుల్ గాంధీకి కూడా అమ‌ల ఓపెన్‌గా రిక్వెస్ట్ పెట్టారు.

మంత్రి సురేఖ వ్యాఖ్య‌ల‌పై స‌మంత కూడా స్పందించారు. ఒక అమ్మాయిగా పుట్టడం, బయటికి వచ్చి పనిచేయాలని అనుకోవడం, అమ్మాయిలను ఆటబొమ్మల్లాగా కాకుండా మనుషులుగా ఎక్కువగా ట్రీట్ చేయని గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టి ముందుకు సాగడం, ప్రేమలో పడడం, ప్రేమ నుండి బయటపడడం, అయినా నిలబడి పోరాడడం.. ఇవన్నీ అంత సులభం కాదు. దీనికోసం చాలా శక్తి, ధైర్యం కావాలి. ఈ ప్రయాణం నన్ను ఎలా మలిచింది అనే విషయంపై నేను గర్వపడుతూనే ఉంటాను మంత్రి గారు.. దయజేసి దానిని చిన్నచూపు చూడకండి. మినిస్టర్‌గా మీరు మాట్లాడే మాటలు జనాల్లోకి ఎలా వెళ్తాయో ఒక్కసారి ఆలోచించండి అంటూ కొండా సురేఖ పేరును ప్రస్తావిస్తూ స‌మంత లేఖ‌ విడుద‌ల చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్ గా తీసుకున్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని లీగల్ నోటీసు పంపారు. అబద్దాలు, అసత్యాలతో దురుద్దేశపూర్వకంగా మాట్లాడినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ పేర్కొన్నారు. సురేఖ వ్యాఖ్య‌ల‌పై ప‌లువురు టాలీవుడ్‌ సినీ ప్ర‌ముఖులు స్పందిస్తున్నారు. మంత్రి హోదాలో ఉండి ఆమె ఇలా మాట్లాడ‌టం స‌రికాద‌ని పేర్కొంటున్నారు. 

 మొత్తానికి మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌లు తెలంగాణ రాజ‌కీయాల‌నేకాక‌.. టాలీవుడ్ నూ కుదిపేస్తున్నాయి. ఇప్ప‌టికే హైడ్రా కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పి తెచ్చిపెట్ట‌గా.. ప్ర‌స్తుతం కొండా సురేఖ వ్యాఖ్య‌లు కాంగ్రెస్ పార్టీకి కొత్త త‌ల‌నొప్పి తెచ్చిపెట్టాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో కొండా సురేఖ క్ష‌మాప‌ణ‌లు చెబుతారా? ఎదురుదాడికి దిగి వివాదం మ‌రింత తీవ్ర‌రూపం దాల్చ‌డానికి కార‌ణం అవుతారా అనే విష‌యంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృత చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే అది ఈ వివాదం సర్దుమ ణగడానికి సరిపోతుందని పరిశీలకులు భావించడం లేదు. 

By
en-us Political News

  
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు. విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.
బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడాయా ఖాతాలలో అంగన్ వాడీలకు సెల్ ఫోన్ల వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందంటూ వచ్చిన వరుస పోస్టులు తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించాయని సీతక్క ఆ నోటీసులో పేర్కొన్నారు.
తమిళనాడులో ఆదివారం జరిగిన ఒక రోడ్‌షోలో హలోగ్రాఫిక్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించారు. విజయ్ స్వయంగా అక్కడ ప్రచారంలో పాల్గొన లేదు. కానీ ఏఐ ద్వారా విజయ్ రూపం, గొంతుఓటర్ల ముందుకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
డిజిటల్ మీడియా, ఆ తరువాత త్వరలోనే పూర్తి స్థాయి శాటిలైట్ చానల్ అని ప్రకటిస్తూ విజయ సాయి రెడ్డి.. ఆ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే అలా విమర్శించి ఊరుకోకుండా అమరావతిలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం అంటే దీక్ష చేస్తున్న రామచంద్రయాదవ్ కు మద్దతు ప్రకటించారు.
కేంద్రం ఇంత వేగంగా ఈ నిర్ణయం తీసుకోవడం, పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఇందుకు సంబంధిచిన బిల్లు ఆమోదం పొందడం, ఆ వెంటనే రాష్ట్రపతి సంతకం, గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఎలాంటి జాప్యం లేకుండా సాగిపోవడం వెనుక ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఆ విషయంలో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో కీలక చర్చ జరుుగుతోంది.
జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్ అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలు దేశరాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశాధినేతలు, రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికపైకి వచ్చారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.