వారసత్వ వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కు కొత్త మార్గదర్శకాలు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

Publish Date:Mar 26, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో వారసత్వ వ్యవసాయేతర స్థలాల రిజిస్ట్రేషన్‌కు చిక్కుముడులు వీడాయి. వారసత్వంగా వచ్చిన వ్యవసాయేతర స్థలాల రిజిస్ట్రేషన్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.  అటువంటి స్థలాల రిజిస్ట్రేషన్ ను సులభతరం చేసేలా ఈ మార్గదర్శకాలు ఉన్నాయి.   ఇకపై ఈ స్థలాల రిజిస్ట్రేషన్‌కు రెవెన్యూ శాఖ సర్టిఫికెట్‌ అవసరం లేదు. ఆ స్థల యజమాని సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది. వ్యసాయేతర  స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్‌కు రెవెన్యూ శాఖ సర్టిఫికెట్‌ ఇక తప్పని సరి కాదు.  స్థలం యజమానుల సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుంది. రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రభుత్వం జారీ చేసిన ఈ మార్గదర్శకాలను అమలు అవుతాయి. 

చాలామందికి వారసత్వంగా పూర్వీకుల నుంచి వ్యవసాయేత భూములు వచ్చాయి. అయితే ఈ భూములను  రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవసరమైన హక్కుకు సంబంధించి వీరి వద్ద ఆధారాలు లేవు. అంటే క్రయ, విక్రయ హక్కు భుక్తాదులకు సంబంధించి వీరు చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి చిక్కులకు పరిష్కారంగా  ఇంత వరకూ రెవెన్యూ అధికారుల నుంచి యాజమాన్య  పొజిషన్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే రిజిస్ట్రేషన్లు జరిగేవి.  అయితే రెవెన్యూ శాఖ నుంచి సర్టిఫికెట్‌ తీసుకోవడంలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

 నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ ఇబ్బందులకు పరిష్కారంగా వివాదాల కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది.    పూర్వీకుల నుంచి సంక్రమించిన వ్యవసాయేతర స్థలాల  రిజిస్ట్రేషన్‌ సమయంలో  ఈ ఆస్తి వారసత్వంగా వచ్చిందనీ, ఇతరులకు హక్కు లేదని, ఈ భూములు నిషేధిత జాబితా  లో లేదని కచ్చితంగా డాక్యుమెంట్‌లో స్పష్టంగా ప్రస్తావించాలి. రిజిస్ట్రేషన్ చేయబోయే స్థలానికి పూర్తి హక్కుదారు తామేనని సెల్ఫ్ డిక్లరేషన్‌  ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వేళ  తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే సివిల్, క్రిమినల్‌ చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం  ఆ మార్గదర్శకాలలో స్పష్టంగా పేర్కొంది.  అలాగే రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్‌ ఆధారంగా బయోమెట్రిక్‌ ధ్రువీకరణ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ కుటుంబ వివాదాలు, ప్రభుత్వ భూమి అనే అనుమానాలు వస్తే  ఆ భూమి రిజిస్ట్రేషన్‌ నిలిపిసే అధకారం అధికారులకు ఉంటుంది.    

By
en-us Political News

  
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
తిరుపతి ఫారెస్ట్ డివిజన్ అధికారులు అత్యంత అరుదైన 3 రోజ్-రింగ్డ్ ప్యారాకీట్స్ (రామచిలుకలను) సమర్థవంతంగా రక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వాటిని తిరిగి అడవిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే హయగ్రీవ జయంతి విశిష్టత, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తడానికి గల ఆధ్యాత్మిక కథ మరియు విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకోండి.
చంద్ర గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక రక్షణ మరియు మానసిక ప్రశాంతత పొందేందుకు పాటించాల్సిన సూతక కాల నియమాలు, మంత్ర జపం, గర్భవతుల జాగ్రత్తలు మరియు గ్రహణానంతర శుద్ధి, దానాల విశిష్టతలను వివరంగా తెలుసుకోండి.
2026 రక్షాబంధన్ సందర్భంగా సోదరుడి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం మరియు దీర్ఘాయువు కోసం సోదరీమణులు చేయాల్సిన పవిత్ర దానాల విశిష్టతలను తెలుసుకోండి. ఆహార ధాన్యాలు, బెల్లం, వస్త్రాలు మరియు నల్ల నువ్వుల దానం వల్ల కలిగే ఆధ్యాత్మిక, జ్యోతిష్య ప్రయోజనాలు ఇవే!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.