ఎన్నికల వేళ రెండో రాజధాని రగడ!

Publish Date:Jun 18, 2023

Advertisement

దేనిని అయితే చూసుకొని కన్నూ మిన్నూ కానకుండా మిడిసి మిడిసి పడుతున్నారో.. దానిని వారి వద్ద నుంచి బలవంతంగానో.. ఎలాగోలా.. లాగేసుకొంటే.. ఆ తర్వాత వారి పరిస్థితి.. అనంతరం చోటు చేసుకొనే పరిణామాలు అందరికీ తెలిసినవే. చూడబోతే అలాంటి ప్రయత్నానికి కేంద్రంలోని మోదీ సర్కార్ శ్రీకారం చుట్టిందనే ఓ చర్చ అయితే తాజాగా పోలిటికల్ సర్కిల్‌లో వాడి వేడిగా యమ రంజుగాసాగుతోంది. 

గులాబీ బాస్ కేసీఆర్‌ను దెబ్బ కొట్టి.. తెలంగాణలో పాగా వేయాలి.. అలాగే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మనస్సులను చొరగొనాలి.. ఆ క్రమంలో అందుకు తగ్గట్లు కేంద్రంలోని మోడీ సర్కార్ వ్యూహాత్మకంగా ప్రణాళికలు సిద్దం చేసుకొని.. ఆ దిశగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తుందా?.. అందులోభాగంగానే  కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగరరావు ఆకస్మాత్తుగా తెరపైకి వచ్చి దక్షిణాదిలోని హైదరాబాద్‌ మహానగరం దేశానికి రెండో రాజధాని కావాల్సిన అవసరం ఉంది.. అంతేకాదు దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని అయి.. తీరుతోందని ఆయన స్పష్టం చేయడం.. అంబేద్కర్ స్మాల్ స్టేట్స్ పుస్తకంలో హైదరాబాద్ రెండో రాజధాని అని ప్రస్తావించిన అంశాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేయడం.. అదే విధంగా ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలంటూ సన్నాయి నొక్కులు నొక్కడం చూస్తుంటే.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏదో మతలబు తెరపైకీ తీసుకు వచ్చేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందన్న ప్రచారం జోరందుకుంది.  

అదీకాక గవర్నర్ గిరి పూర్తి అయిన తర్వాత కొన్నాళ్లపాటు సైలెంట్‌గా ఉన్న సిహెచ్ విద్యాసాగరరావు.. ఇలా ఒక్కసారిగా తెరపైకి వచ్చి మరీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ  ప్రకంపనలు సృష్టిస్తోంది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  విభజన జరిగి.. తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు వేడుకలు ఘనంగా జరుగుతోన్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా పోవడంతో.. ఆ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. 

అలాంటి వేళ.. ఇటువంటి నిర్ణయం అయితే అందరికీ శ్రేయస్కరమనే భావనలో మోడీ ప్రభుత్వం ఉందని.. అదీకాక హైదరాబాద్ మహానగరం నుంచి పన్నుల రూపంలో లక్షల కోట్ల రూపాయిల ఆదాయం వస్తుందని.. దీనిని చూసి కేసీఆర్ అండ్ కో.. కేంద్రంతో డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరిస్తోందని,  ఆ క్రమంలో భాగ్యనగరాన్ని దేశానికి రెండో రాజధానిగానే కాకుండా..  రెండు తెలుగు రాష్ట్రాలకు రాజధానిగా చేయడం..  అలాగే కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తే.. దీంతో బీజేపీకే కాదు.. తెలుగు రాష్ట్రాల ప్రజల అన్ని సమస్యలకు జిందా తిలిస్మాత్ లా ఔకటే ఔషదం అన్నట్లుగా అవుతోందని పోలిటికల్ సర్కిల్‌లో ఓ చర్చ  వైరల్ అవుతోంది. 

అదీకాక దశాబ్దాల కింద కాకినాడ వేదికగా జరిగిన సభలో ఒక ఓటు రెండు రాష్ట్రాలు తీర్మానం చేసిన కమలనాథులు.. మళ్లీ తాజాగా దేశానికి రెండో రాజధానిగానే కాకుండా... రెండు రాష్ట్రాలకు ఒకటే రాజధాని.. అదీ హైదరాబాద్ అని మోడీ సర్కార్ ప్రకటిస్తే సరిపోతుందనే ఆలోచనలో బీజేపీ అగ్రనాయకత్వం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అలా అయితేనే   అనుకున్నది  అనుకున్నట్లుగా సాధించగలుగుతామని.. మరోవైపు జమ్ము కాశ్మీర్‌లో గతంలో నిత్యం కాల్పులు, బాంబు దాడులు, కిడ్నాపులు వార్తలతో నిండిపోయి ఉండేదని.. కానీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత సదరు రాష్ట్ర పరిస్థితి ఎలా మారిపోయిందో అందరికీ తెలిసిందేనని .. అదే విధంగా మోదీ సర్కార్.. హైదరాబాద్‌పై ఇటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు.

ఒకవేళ అలా చేస్తే.. తెలంగాణలో చక్రం తిప్పుతోన్న కేసీఆర్ అండ్ కో.. తమ వ్యూహాలకు మరింత పదును పెట్టి.. కార్యక్షేత్రంలోని దూకుతొందనడంలో ఎటువంటి సందేహం లేదనే చర్చ సైతం నడుస్తోంది. అదీకాక. . విభజనతో ఆంధ్రప్రదేశ్ తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోతే.. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ సైతం దశాబ్ది వేడుకల సాక్షిగా లక్షల కోట్ల ఆప్పులో మునిగిపోయింది. అలాంటి వేళ.. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌ను కేంద్రం ఎంపిక చేస్తే.. ప్రజలు సైతం సుముఖత వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చ సైతం సాగుతోంది.  అదీకాక.. హైదరాబాద్ నడిబొడ్డున రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రాహావిష్కరణ సందర్బంగా ఆయన మనవడు ప్రకాశ్ అంబేద్కర్ సైతం తన తాత గారు దేశనికి రెండో రాజధానిగా హైదరాబాద్ ఉండాలని ఆకాంక్షించారని గుర్తు చేశారు. ఇదే సభా వేదికపై తెలంగాణ సీఎం కేసీఆర్ పక్కనుండగానే ప్రకాశ్ అంబేద్కర్ ఈ వ్యాఖ్యలు చేయడం కోసమెరుపు.

By
en-us Political News

  
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
ఒక్క తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఆ దిశగా ముందు.. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.