నెటిజన్ల ట్రోలింగ్ కు రోజా మరోసారి

Publish Date:Nov 14, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా... తాజా వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. పూర్తిగా కాషాయం బట్టలతో ఆర్కే రాజా పడవపై కూర్చొని.. నదీ విహారం చేస్తూ..  పక్షులకు గింజలు వేస్తూ.... తపస్సు చేస్తూ.. పడవపై కూర్చొని కాళ్లతో నదీలో నీళ్లతో ఆడుతోంది. మంత్రి ఆర్కే రోజా.. అయోధ్యలోని రామజన్మ భూమిలో పర్యటించారని..  అనంతరం ఆమె త్రివేణి సంగమం వద్ద నదీ విహారం చేస్తున్న సమయంలోనిదీ  వీడియో అంటూ అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో కథనాలు   వెల్లువెత్తాయి.  రోజా వీడియోపై  నెటిజన్లు.. తమదైన శైలిలో స్పందిస్తున్నారు. పర్యాటక శాఖ మంత్రిగారికి ఇంతకన్నా పనేముందని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే.. పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. రోజమ్మ గారు గుళ్లూ గోపురాలకు కీ ఇచ్చిన బొంగరంలా రింగ రింగా అంటూ తిరిగేస్తున్నారని మరో నెటిజన్ కామెంట్ పెట్టారు.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని గుళ్లూ గోపురాలన్నీ ఈ మంత్రి రోజా  తిరిగేశారని.. ఇప్పుడు దేశంలోని గుళ్లు గోపురాల చుట్టూ ప్రదక్షణ చేస్తున్నారని ఇంకో నెటిజన్లు పేర్కొన్నారు. మరోకరు అయితే ఏకంగా..  తీర్థయాత్ర.. తీర్థయాత్ర.. తీర్థయాత్ర అంటూ కామెంట్ పేట్టేశారు. జపం జపం జపం.. కొంగ జపం.. అంటూ మరో నెటిజన్ సెటైరికల్‌గా కామెంట్ పెట్టాడు.  

రోజా... గతంలో సినిమాల్లో హీరోయిన్‌గా నటించారని.. ఆ రంగం నుంచి ఇంకా ఆమె బయటకు రాలేకపోతోందని మరి కొందరు అంటున్నారు. అయినా బాధ్యతగల ఓ మంత్రిగా రోజా ఆ బట్టలు? ఆ మెడలో దండ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 

అయినా ఇటీవల విశాఖ ఎయిర్ పోర్టులో ఆర్కే రోజా వ్యవహారంపై ఇప్పటికే సోషల్ మీడియా సాక్షిగా నెటిజన్లు మండిపడుతున్నారు. కీలక మంత్రి పదవిలో ఉండి.. ఇలా వ్యవహరించడం ఎంత వరకు సబబు అని నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజల్లోకి అంతగా వచ్చిందేలేదని... అలాగే మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కనీసం సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించకుండా.. ప్రజా సమస్యలను పట్టకుండా రాష్ట్రంలో ఉండకుండా... బయట రాష్ట్రాల్లో పర్యటనలు ఏమిటని   ప్రశ్నిస్తున్నారు.

 జగన్ తొలి కేబినెట్‌లోనే కాదు.. మలి కేబినెట్‌లో సైతం అలాంటి మంత్రులే ఉన్నారని నెటిజన్లు అంటున్నారు.  మరోవైపు  కొత్తా దేవుడండి.. కొంగొత్త దేవుడండీకి పేరడీగా.. కొత్త దేవతండి.. కొంగొత్త దేవతండి అంటూ మంత్రి రోజా వ్యవహార శైలిపై  ఉందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా మంత్రి రోజా నిత్యం వార్తల్లో ఉండేందుకే ఇలా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో పర్యటించారు.
హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో అనూహ్య విమాన ఘటన చోటుచేసుకుంది.
సైబరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కొత్త చర్యలకు సిద్ధమవుతోంది.
ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై హెచ్చరిక చిహ్నాల అమలులో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సర్వం సిద్ధమైంది.
హైదరాబాద్ నగరంలోని రేతిబౌలి ప్రాంతంలో జరిగిన పెళ్లి ఊరేగింపులో కత్తులు చేతబట్టి నృత్యం చేసిన నలుగురు వ్యక్తులను గుడిమల్కాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
సూపర్ ఇంటెలిజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మనిషి సహజ వృద్ధాప్య ప్రక్రియను నియంత్రించగలిగితే, సుమారు 1,400 సంవత్సరాల వరకు జీవించే అవకాశం
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
ప్రపంచ అందాల పోటీల చరిత్రలో కీలక మలుపు చోటు చేసుకుంది.
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు, రేడియల్ రోడ్ల నిర్మాణం, పట్టణాభివృద్ధి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాజెక్టుల పనుల స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ముంబయిలోని కాలాచౌకి ప్రాంతానికి చెందిన ఉదయ్ పవార్ పట్టుదల, ఆచరణాత్మక ఆలోచనలతో చిన్న స్థాయి సేవను లాభదాయక వ్యాపారంగా తీర్చిదిద్దారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.