హైదరాబాద్ లో వాన.. కల్వకుంట్ల కవితపై నెటిజనుల సెటైర్ల పిడుగులు!

Publish Date:Jun 11, 2026

Advertisement

తెలంగాణ రక్షణ సేన కల్వకుంట్ల కవిత సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నారు. పదేళ్ల పాటు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉండి.. ఇప్పుడు సొంత కుంపటి పెట్టుకున్న కవిత.. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై చేసిన విమర్శలపై నెటిజనులు ఫైర్ అవుతున్నారు. తాజాగా రెండు రోజుల కిందట హైదరాబాద్ లో కురిసిన వర్షానికి విశ్వనగరంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో గప్పాలు కొట్టుకున్న మహానగరం అతలాకుతలమైన సంగతిని ప్రస్తావిస్తూ.. నెటిజనులు టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) అధినేత్రి కవితను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. 

తెలంగాణ గడ్డపై భాగ్యనగరం విశ్వనగరంగా, గ్లోబల్ ఐటీ హబ్‌గా ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వేల కోట్ల పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాలు, ఆకాశాన్ని తాకే బహుళ అంతస్తుల భవనాలతో హైదరాబాద్ ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. కానీ, ఇంతటి మహానగరం ఒక్క అరగంట పాటు కురిసే వర్షానికే కుదేలైపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ  కవితను భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.   కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ..  ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న  అమరావతిని కవిత  వరద ప్రాంతమంటూ  ఎద్దేవా చేయడాన్ని తప్పుపడుతున్నారు. వానాకాలం వస్తే అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి సీటు కిందకు నీళ్లు చేరకుండా చూసుకోండి అంటూ ఇటీవల కవిత అవహేళన చేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా..  వర్షాకాలం మొదలైతే అమరావతిలో ప్రయాణించడానికి పడవలు వాడాలా అంటూ వ్యాఖ్యానించారు.

ఇప్పుడు హైదరాబాద్‌లో   ఒక్క గంట వర్షానికి ఐటీ కారిడార్‌ అంతా జలమయం కావడంతో..  నెటిజన్లు కవిత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆమెపై తెగ సెటైర్లు గుప్పిస్తున్నారు.   పక్క రాష్ట్ర రాజధాని గురించి  వెటకారాలు తరువాత..  ముందు మీ నగరానికి వర్షాల నుంచి రక్షణ కల్పించుకో కవితక్కా అంటూ ఓ నెటిజన్ సలహా ఇవ్వగా..   గత పదేళ్ల మీ బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో మీరు చేసిన అద్భుతమైన అభివృద్ధి ఇదేనా? అంటూ మరో నెటిజనుడు నిలదీశారు.  

ప్రత్యేక తెలంగాణ వస్తే బంగారు తెలంగాణగా మారుస్తామని మీ తండ్రి కేసీఆర్  చేసిన ప్రకటనల పరమార్థం ఇదేనా? ఇదేనా అంటూ మరి కొందరు ప్రశ్నించారు.  వర్షం వస్తే ఇప్పుడు హైదరాబాద్‌లోనే పడవలు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ పాత వీడియోలను, మీమ్స్‌ను షేర్ చేస్తూ కల్వకుంట్ల కవితపై నెటిజనులు విరుచుకుపడుతున్నారు.  

By
en-us Political News

  
మాజీ మంత్రి కార్మూరి నాగేశ్వరరావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఈడీ కార్యాల యానికి తరలించారు. లిక్కర్ రవాణా వ్యవహారా ల్లో ఆయన పాత్రపై అధి కారులు విచారణ చేపట్టారు.
జనగామ జిల్లాలో నాటుకోడి కూర విషయంలో మొదలైన కుటుంబ కలహం విషాదాంతానికి దారితీసింది.
కోడి కూర చేయడానికి ఓపిక లేదనీ, రేపు వండుతానని చెప్పింది. అయితే తప్పతాగి ఉన్న రమేశ్ కోడి కూర ఇప్పుడే వండాలంటూ భార్యపై చేయి చేసుకున్నాడు.
పలావు ఫ్లాగ్‌తో ప్రయాణిస్తున్న ఎంటీ సెట్టెబెల్లో అనే చమురు ట్యాంకర్ 24 మంది భారతీయ సిబ్బందితో గల్ఫ్ ఆఫ్ ఒమన్ గుండా వెళుతోంది. ఇరాన్ చమురు రవాణాపై అమెరికా విధించిన ఆంక్షలను ఈ నౌక ఉల్లంఘించిందనే నెపంతో, యూఎస్ సెంట్రల్ కమాండ్ కు చెందిన యుద్ధ విమానాలు ఈ నౌకపై దాడి జరిపాయి.
ఖమ్మంలో కీచకుడి దాడిలో గాయపడి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు.
పశ్చిమ బెంగాల్ అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్ (TMC) చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత తీవ్రమైన రాజకీయ సంక్షోభంలో మునిగిపోయింది.
గతంలో సిట్ కేవలం సాధారణ అవినీతి నిరోధక చట్టాల కింద విచారణ జరపగా, ఈడీ ఎంట్రీ తో కథ కొత్త మలుపు తిరిగింది. మద్యం సిండికేట్లు, వివిధ షెల్ కంపెనీల ద్వారా సేకరించిన దాదాపు 3,500 కోట్ల రూపాయల భారీ ముడుపులు ఎక్కడెక్కడికి చేరాయి? హవాలా మార్గాల ద్వారా విదేశీ ఖాతాల్లోకి ఎలా తరలిపోయాయి? అనే మనీ ట్రయిల్ గుట్టును పూర్తిగా రట్టు చేసేందుకు ఈడీ సిద్ధమైంది.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సాధారణంగా తనదైన దూకుడు రాజకీయ శైలితో, వాడీవేడి వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ షాక్ ఇచ్చింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ రూట్ ఎందుకు ఆలస్యం కానుంది? రియల్ ఎస్టేట్‌పై చూపే ప్రభావం, రాజకీయ దుమారం పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
తనిఖీల్లో అర్హత లేని వ్యక్తులు వైద్య సేవలు అందిస్తున్నట్లు, సరైన అనుమతులు లేకుండానే చికిత్సలు నిర్వహిస్తున్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ దాడుల్లో అధికారులు పలు క్లినిల్ లను పరిశీలించి, రికార్డులు, వైద్య సిబ్బంది అర్హతలు, చికిత్సల విధానాలపై సుదీర్ఘంగా విచారణ చేశారు.
ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలతో హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. వాణిజ్య నౌకలు కనిపిస్తే పేల్చేస్తామన్న హెచ్చరికలతో గ్లోబల్ ఆయిల్ మార్కెట్లు సంక్షోభంలో పడ్డాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వేదాంత 5 విడి విడి కంపెనీలుగా మారిన తర్వాత షేర్ హోల్డర్లకు వచ్చే డివిడెండ్ల పరిస్థితి ఏంటి? అల్యూమినియం, జింక్ వ్యాపారాల విభజనతో ఇన్వెస్టర్లకు లాభమా నష్టమా? మార్కెట్ నిపుణుల విశ్లేషణ పూర్తి వివరంగా ఇక్కడ చూడండి.
రాజ్యసభ అభ్యర్థిగా తాను దాఖలు చేసిన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ.. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌ ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.