తేదీ 11.. ఎమ్మెల్యేలు 11.. సమయం 11 నిముషాలు!

Publish Date:Feb 11, 2026

Advertisement

వైసీపీని 11 నంబర్ వదల నంటున్నది. 2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. అప్పటి నుంచీ ఆ నంబర్ వింటేనే  ఆ పార్టీ ఉలిక్కిపడుతోంది. 151 టు 11 గా ఆ పార్టీ తిరోగమన ప్రస్థానాన్ని నెటిజనులు అప్పట్లో ఓ ఆట ఆడుకున్నారు. జగన్ ప్రతిపక్ష హోదా అంటూ డిమాండ్ చేస్తూ అసెంబ్లీకి గైర్హజర్ కావడాన్ని కూడా 11 అంకెను ప్రస్తావిస్తూ నెటిజనులు ఇప్పటికే ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అది పక్కన పెడితే.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా 11వ తేదీనే ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు జగన్ తన బాయ్ కాట్ ను పక్కన పెట్టి తనతో సహా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలతో సమావేశాలకు హాజరయ్యారు. అవ్వడం కాదు.. ఆ 11 మందీ సభలో సరిగ్గా 11 నిముషాల పాటు ఉన్నారు. దీంతో మరోసారి జగన్ ను, వైసీపీని ఈ 11 నంబర్ తో నెటిజనులు విపరీతంగా ట్రోల్ చేస్తూ ఓ ఆటాడుకుంటున్నారు.  

నిజానికి తాను తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరౌతానంటూ జగన్ ప్రకటించిన తరువాత స్పీకర్ అయ్యన్న పాత్రుడు  సెటైరికల్ గా వారు 11 నిముషాలకు మించి సభలో ఉండరు అని జోక్ కూడా చేశారు. సరిగ్గా ఆయన అన్నట్లుగానే జగన్ తన 11 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వచ్చి సరిగ్గా 11 నిముషాల సేపు సభలో ఉండి కొన్ని నినాదాలు చేసి వాకౌట్ చేశారు. వైసీపీ అధినేత జగన్, పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి వాకౌట్ చేయడం అన్నది.. తమ శాసనసభ సభ్యత్వాలను కాపాడుకోవడానికి రిజిస్టర్ లో సంతకం చేయడానికేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
అది పక్కన పెడితే 11 నంబర్ తో జగన్ ను నెటిజనులు చేస్తున్న ట్రోలింగ్ తో ఆయనకు పదకొండు సంఖ్య అంటేనే వణికిపోయే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ఆ సంఖ్య కనిపించినా, వినిపించినా భరించ లేకపోతున్నారని అంటున్నారు.  ఇక ప్రస్తుత బడ్జెట్ సమావేశాలకు వస్తే.. ఈ నెల 11 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమౌతాయని నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచీ వైసీపీని నెటిజనులు ట్రోలింగ్ తో తెగ టీజ్ చేస్తున్నారు.

మళ్లీ వచ్చింది 11 అంటూ ఎద్దేవా చేశారు. అక్కడితో ఆగకుండా.. సభా సంప్రదాయలను ఒకింత పక్కన పెట్టి బుధవారం (ఫిబ్రవరి 11) అంటే 11 తేదీనే గవర్నర్ ప్రసంగం పూర్తికాగానే ప్రభుత్వం సభలో బడ్జెట్ ప్రవేశపెట్టాలంటూ చిలిపిగా ప్రభుత్వానికి సూచనలు చేసి జగన్ ను వేరే రేంజ్ లో ట్రోల్ చేశారు. ఇక బడ్జెట్ సమావేశాలు మార్చి 7  వరకూ జరగనున్నాయి. అంటే పక్షం రోజులకు పైగానే.. మరి ఇప్పుడు జగన్ సహా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలూ సభకు వచ్చి తమ వాణిని వినిపిస్తారా? బడ్జెట్ పై చర్చలో పాల్గొంటారా? అన్నది రానున్న రోజులలో తేలుతుంది. 

By
en-us Political News

  
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.