పులివెందులలో రిగ్గింగ్ అంటూ అంబటి ఫేక్ వీడియో.. నెటిజన్ల ట్రోలింగ్ మామూలుగా లేదుగా

Publish Date:Aug 16, 2025

Advertisement

అసత్య ప్రచారాలు, ఫేక్ వీడియోలు వైసీపీకి అలవాటే. దొరికిపోయిన ప్రతిసారీ నెటిజన్ల ట్రోలింగ్ కూడా ఆ పార్టీ నేతలకు కొత్తేం కాదు. అధికారంలో ఉన్నప్పటి నుంచీ కూడా వైసీపీ చేస్తున్నది ఇదే. వైసీపీ సోషల్ మీడియా వేదికగా చేసిన అరాచకాలు, దుష్ప్రచారాలు, మార్ఫింగ్ వీడియోతో చెలరేగిన తీరు సామాన్య జనానికి కూడా వెగటు పుట్టించింది. గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి  ఈ తీరు కూడా ఒక కారణమనడంలో సందేహం లేదు. ఇప్పుడు అధికారం కోల్పోయి, కనీసం విపక్ష హోదా లేని పరిస్థితుల్లో కూడా మళ్లీ పుంజుకోవాలంటూ ఫేక్ తీరు శరణ్యమని వైసీపీ భావిస్తున్నట్లు ఉంది. అయినా గత ఎన్నికలలో ఓటమి కంటే ఘోరమైన పరాజయం ఆ పార్టీకీ, ఆ పార్టీ అధినేత జగన్ కీ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఎదురైంది. సహజంగానే ఈ ఓటమి వైసీపీ అధినేత జగన్ సహా.. ఆ పార్టీ నేతలు, శ్రేణుల నైతిక స్థైర్యం పాతాళానికి పడిపోయింది. ఓటమిని జీర్ణించుకోలేక కక్కలేకా, మింగలేకా అన్నట్లుగా ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఉంది. రిగ్గింగు, అరాచకాలు అంటూ అధికార తెలుగుదేశం కూటమిపై విమర్శలు గుప్పిస్తోంది. కానీ కనీసం డిపాజిట్ కూడా దక్కకుండా పులివెందుల జడ్పీటీసీలో ఎదురైన ఓటమికి ఏం చెప్పుకోవాలో, ఎలా చెప్పుకోవాలో తెలియక మల్లగుల్లాలు పడుతోంది.  

ఈ నేపథ్యంలోనే  మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా పులివెందులలో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ, తన ఆరోపణలకు రుజువిదిగో అంటే ఓ వీడియోను పోస్టు చేశాడు. అయితే ఆయన ఇలా ఆ వీడియో పోస్టు చేసి పులివెందుల రిగ్గింగ్ కు సాక్ష్యం అన్నారో.. ఆ క్షణం నుంచీ నెటిజనులు అంబటిపై ఓ రెంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు. అంబటిగారూ పులివెందులలో పోలింగ్ జరిగితే.. పశ్చిమబెంగాల్ లో రిగ్గింగు అంటారేంటండీ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. 

ఇంతకీ విషయమేంటంటే.. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలలో రిగ్గింగుకు రుజువిదుగో, తెలుగుదేశం పులివెందుల జడ్పీటీసీ ఎన ఉప ఎన్నికలో అక్రమాలకు పాల్పడిందనడానికి ఇంత కంటే నిదర్శనం కావాలా అంటూ అంబటి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఓ ఫేక్ వీడియో. 
పశ్చిమ బెంగాల్ లో గతంలో ఎప్పుడో జరిగిన పోలింగ్ కు సంబంధించిన వీడియో.. దానిని పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించిందేనని నమ్మబలుకుతూ అంబటి రెచ్చిపోయారు. అయితే స్వల్ప వ్యవధిలోనే ఆయన బండారం బయటపడిపోయి తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ కు గురయ్యారు పాపం.  ఇంతకీ అంబటి నకిలీ గుట్టు ఎలా బయటపడిందో తెలుసా?

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఉపయోగించిన గులాబి రంగు బ్యాటెల్ పత్రాలు. కానీ అంబటి షేర్ చేసిన వీడియోలో పసుపు రంగు బ్యాటెల్ పత్రాలు కనిపించాయి. తెలుగుదేశం జెండా రంగు పసుపు కదా.. అంతా నమ్మేస్తారని భ్రమించినట్లున్నారు అంబటి.  ఆ భ్రమలు పటాపంచలైపోవడమే కాదు..పులివెందులలో ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందనీ, అక్రమాలకు రుజువులు చూపడం చేతకాకే నకిలీలపై పడ్డారని పరిశీలకులు అంటున్నారు.  

By
en-us Political News

  
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.