మహిళలంటే అంత చులకనా.. చిరుపై నెటిజన్ల ఫైర్

Publish Date:Feb 12, 2025

Advertisement

ఓ సినీ ఫంక్షన్ లో మెగా స్టార్ చిరంజీవి  యధాలాపంగా చేసిన సరదా వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సాధారణంగా చిరంజీవి వివాదాలుకు దూరంగా ఉంటారు. ఆయన ప్రసంగాలు కూడా ఆచి తూచినట్లు ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా పద్ధతిగా మాట్లాడతారు. అటువంటి చిరంజీవి బ్రహ్మా ఆనందం సినీమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో  చేసిన కొన్ని వ్యాఖ్యలపై మహిళా సంఘాల నుంచి తీవ్ర ఆక్షేపణ వ్యక్తం అవుతోంది.

మెగా లెగసీ కంటిన్యూ అవ్వడానికి తన కుమారుడు రామ్ చరణ్ ఒక మగపిల్లవాడికి తండ్రి  అయితే బాగుంటుంది అని చిరంజీవి అన్నారు.  ఈ ఫంక్షన్ లో  ఆయన తన మనవరాళ్లందరితో తన ఇళ్లు ఒక లేడీస్ హాస్టల్ లా, తాను ఆ హాస్టల్ వార్డెన్ గా మారిపోయామని వ్యాఖ్యానించారు.  ఒక చరణ్ కైనా మగపిల్లవాడు పుడతాడనుకుంటే ఆడపిల్లే పుట్టిందని, దీంతో  ఈసారైనా రామ్ చరణ్ తనకి ఒక మనవడిని ఇస్తాడని ఆశిస్తున్నానన్నారు.  మెగా వారసత్వాన్ని కొనసాగించాలని ఉందన్నారు. అక్కడితో ఆగకుండా చరణ్ కు మళ్లీ అమ్మాయే పుడుతుందేమోనన్న భయం వేస్తోందని చిరంజీవి అన్నారు. చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలే వివాదాస్పదంగా మారాయి.

నెటిజనులు ఓ రేంజ్ లో చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు. మహిళా సంఘాలు కూడా చిరు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  చిరంజీవికి మహిళలంటే అంత చులకనా అని నిలదీస్తున్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మెగాస్టార్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అంటున్నారు. మెగాస్టార్   మహిళలాలను చాలా తక్కువ చేసి మాట్లాడారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన మాటల ద్వారా సమజాజంలో ఆడపిల్లలు వద్దు అన్న సందేశాన్ని ఇచ్చారా అని  ప్రశ్నిస్తున్నారు.

By
en-us Political News

  
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
బంగారం ప్రియులకు ఇది నిజంగానే ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పవచ్చు
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హానీట్రాప్ ఉచ్చులో పడిన వాయుసేన అధికారి.. షాకింగ్ నిజాలు వెల్లడించిన ఛార్జ్‌షీట్.!
మినీ బస్‌ను ఢీకొన్న ట్రక్కు.. 23 మంది మృతి.!
రాష్ట్రంలో 25 పారిశ్రామిక ఎకోసిస్టమ్ లను అభివృద్ధి చేస్తాం: లోకేష్
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
1999లో ఎయిర్‌పోర్టుల గురించి ఎవరూ పెద్దగా ఆలోచించని సమయంలోనే.. సీఎం చంద్రబాబు నాయుడు శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై దృష్టి పెట్టారు.
ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టేనని పెద్దలు అంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.