Publish Date:Jun 16, 2022
అధికారంలో వున్నాం గదా అని తస్మదీయులకు వీలయినంత ఎక్కువ సేవ చేస్తే ఆనక సమస్యలు తలకు చుట్టుకుంటాయన్న సూత్రం ప్రధాని మోదీజీకి బొత్తిగా అర్ధమయినట్టు లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు, బిజెపీ పార్టీకి ఎంతయినా గుజరాతీ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు వెన్నుదన్నుగా నిలిచారని ఆ ప్రేమతో వారికి ఎంత సాయం చేసిన తక్కువే అనుకున్నారు ప్రధాని మోదీజీ. ఇదుగో సరిగ్గా ఇక్కడే ప్రధాని తప్పులో కాలేసేసేరు!
అదానీకి శ్రీలంక ప్రభుత్వం నుంచి పవర్ ప్రాజెక్టును ఇప్పించా రు. ఫలితంగా ప్రధానిని వెంటనే రాజీనామా చేయాలన్న డిమాండ్ తో నెటిజన్లు ట్విటర్‌ను హోరెత్తిస్తున్నారు. పొరుగు దేశం శ్రీలంక అసలే ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయి నానా ఇబ్బందుల్లో వుంది. భారత్ నుంచి సాయం పొందడానికి కూడా సిద్ధపడింది. ఈ పరిస్థితుల్లో పొరుగు దేశానికి మనస్పూర్తిగా, ఎలాంటి స్వార్ధ చింతనా లేకుండా సాయం చేయాల్సింది పోయి, వారి నుంచే ఒక పెద్ద సాయం అడిగేసేరు
మన ప్రధాని. అదే శ్రీలంక విండ్ పవర్ ప్రాజెక్టును తమ వీరాభిమాని అదానికి ఇవ్వాలని. శ్రీలంక ప్రభుత్వం అందుకు పూర్తిగా మనస్పూర్తిగా అయితే అంగీకరించలేదు. కానీ అంగీకరించేట్టు శ్రీలంక ప్రధాని అధ్యక్షుడు గొటబ య రాజపక్సే పై ఎంతో ఒత్తిడి చేశారన్నవార్తలు ఒక్కసారిగా గుప్పు మన్నాయి. ఇంతకంటే దేశానికి వేరే అవమానం అక్కర్లేదు. ప్రధాని అంత అవమానకర ఒప్పందానికి ఎందుకు అంగీకరించినట్టు. మోదీ శ్రీలంక అధ్యక్షుడిని ఒత్తిడి చేసి అంగీకరించేట్టు చేశారనే ఆరోపణలు వెల్లు వెత్తడంతో ప్రధానిని రాజీనా మా చేయాలన్న హ్యాష్‌ట్యాగ్ ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది. దేశమంతా వ్యక్తమవుతున్న ఆరోపణల నేప థ్యంలో తెలంగాణా రాష్ట్రసమితి కార్యకర్తలు, నాయకులతో పాటువేలాది మంది నెటిజన్లు మోదీ రాజీ నామా చేయాలని గట్టిగానే డిమాండ్ బాగా జోరందుకుంది.
బుధవారం నుంచి ట్విట్టర్ లో ప్రారంభం అయిన మోదీ మస్ట్ రిజైన్ హాష్ ట్యాగ్ ట్రెండింగ్ ఈ రోజు కూడా కొనసాగుతోంది. ఇప్పుడు ట్విట్లర్లో ఇదే ఫస్ట్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, అనేక మంది ఇతర నెటిజెన్లు ట్వీట్లు చేశారు. వీటికి భారీ స్పందన లభించింది. దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు సైతం వీరికి తోడు కావడంతో ట్విట్టర్ లో మోదీ రాజీనామా అంశం అగ్రస్థానంలో కొనసాగుతోంది. దీంతో జాతీయ స్థాయిలో మోదీ రాజీనామా అంశం చర్చనీయాంశంగా మారింది.
అదాని కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తున్నదని, అదానీకి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని నెటిజన్లు అసహనం వ్యక్తంచేస్తున్నారు. భారత సంపద దోచి అదానీకి పంచడం సరికాదంటూ ట్విట్టర్లో పోస్టింగ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ హాష్ ట్యాగ్ కు కొంతమంది వ్యతిరేకిస్తూ.. మోదీకి సపోర్ట్ గా కామెంట్లు పెడు తున్నారు. ఇదిలా ఉంటే మోదీపై ఆరోపణలు చేసిన శ్రీలంక సిలోన్ విద్యుత్ సంస్థ చైర్మన్ ఫెర్డినాండో తన పదవికి రాజీనామా చేశారు. మోదీనే అదానికి విద్యుత్ ప్రాజెక్ట్ కేటాయించాలని తనపై ఒత్తడి తెస్తున్నాడని శ్రీలంక అధ్యక్షుడు తనతో చెప్పారని ఫెర్డినాండో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక్కడ మరో చిత్రమేమంటే తమ మధ్య ఈ ప్రస్తావనే రాలేదని అధ్య క్షుడు గోటబయ రాజపక్స తాపీగా వెల్లడించడం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/netizens-demand-for-modis-risignation-25-137773.html
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజకీయ సన్యాసం చేసినట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్పటికీ ఆయన తన టీం ద్వారా అకౌంట్ సర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జగన్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజయసాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవల జగన్ అర్ధంపర్దం లేకుండా చేసిన మావిగన్ అనే ప్రతిపాదన మీదే. కానీ రేణుక చౌదరి సభలో లేవనెత్తిన కమ్మరావతిని పట్టుకుని.. పోస్టులు పెట్టడం సరికాదంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.