నెల్లూరు నెంబర్ గేమ్
Publish Date:Dec 12, 2025
Advertisement
నెల్లూరు మేయర్ పై అవిశ్వాసం పెట్టింది టీడీపీ. ఈ నెల పదహారున ఈ అవిశ్వాస తీర్మానం జరుగుతుండటంతో.. అటు వారు ఇటు- ఇటు వారు అటు అనే నెంబర్ గేమ్ మొదలైంది.. ఇప్పటి వరకూ ఉన్న వారెంత? లేని వారెందరు? ఎవరి బలాబలాలేంటి? అన్నది ఎప్పటికప్పుడు లెక్కలు మారుతూనేఉన్నాయి. సందట్లో సడేమియాలా కొందరు కార్పొరేటర్లు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మారుతూనే ఉన్నారు. ప్రస్తుతం టీడీపీలోకి వెళ్లిన ఐదుగురు వైసీపీ కార్పొరేటర్లు ఇటు తిరిగి ఇటు వచ్చేశారు. వీరిలో ఒక ఇద్దర్నితమ పార్టీ అధినేత జగన్ ముందు తీస్కెళ్లి ప్రవేశ పెట్టారు మాజీ మంత్రి అనిల్, రూరల్ నియోజకవర్గ ఇంఛార్జ్ పర్వతరెడ్డి. దీంతో గణాంకాల్లో తేడా వచ్చింది. మరో ఇద్దరుగానీ టీడీపీని వీడిపోతే.. అవిశ్వాసమేవీగిపోతుంది. కానీ ఇక్కడే టీడీపీ మేజిక్ చేయగలిగింది.. జగన్ ని కలిసిన ఆ ఇద్దరూ తిరిగి టీడీపీలోకి వచ్చేసినట్టు వారే స్వయంగా సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేశారు. ఇంతకీ నెల్లూరు మేయర్ వ్యవహారంలో అసలేం జరిగిందో చూస్తే.. నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టారో చూస్తే.. నాలుగేళ్ల క్రితం నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లను వైసీపీసొంతం చేసుకుంది. ఈ పార్టీకి చెందిన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కూటమిలోకి వచ్చారు. దీంతో కొందరు కార్పొరేటర్లు శ్రీధర్ రెడ్డి వెంబడి నడిచారు. దీంతో మేయర్ భర్త జయవర్ధన్ షాడో మేయర్ గా అధికారం చలాయించాడు. అక్రమాలు చేసి ఫోర్జరీ కేసుల్లో జైలుకు వెళ్లాడు. దీంతో నెల్లూరు నయా అభివృద్ధి కోసం కొత్త పాలక వర్గాన్ని ఎంపిక చేసేందుకు 42 మంది కార్పొరేటర్లు సిద్ధపడ్డారు. మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని కలిసి కలెక్టర్ అనుమతి పొందారు. చివరికి అవిశ్వాస తీర్మానం కోసం రంగం సిద్ధమైంది. ఈ పరిస్థితుల్లో క్వార్జ్ అక్రమాల విచారణలో ఉన్న జిల్లా నేతలు, వారికి అండగా ఉన్న గంజాయి బ్యాచ్ కార్పొరేటర్లను ప్రలోభ పెట్టడం ప్రారంభించారు. ఫోన్ల ద్వారా బెదిరింపులు చేయడం ప్రారంభించారు. టీడీపీ లోకి వచ్చిన వారిని బెదిరించడంతో పాటు ప్రలోభాలు మొదలయ్యాయి. ఈ విషయం మంత్రి నారాయణ ఎమ్మెల్యే కోమటిరెడ్డి దృష్టికి వెళ్లడంతో.. వారీ విషయం సీరియస్ గా తీస్కున్నారు. బెదిరింపులకు పాల్పడే వారి వివరాలివ్వాల్సిందిగా.. కోరారు. వారి డీటైల్స్ పోలీసులకు అందించి కఠిన చర్యలు తీస్కోవల్సిందిగా ఆదేశించారు. ఇప్పుడక్కడి పరిస్థితి ఎలా తయారైందంటే.. ఇటు వైసీపీ అటు టీడీపీ వర్గాలు కార్పొరేటర్ల నివాసాల ముందు నిఘా ఏర్పాటు చేశారు. మేయర్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నిర్వహించే కౌన్సిల్ సమావేశంలో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయొద్దని వైసీపీ చేయని ప్రయత్నం లేదు. మరికొందరు ఫోన్లలోనే బేరసారాలు మొదలు పెట్టారు. ఏ కార్పొరేటర్‌కి ఫోన్ చేసి బెదిరించినా వెంటనే సమాచారం అందించాలని మంత్రి నారాయణ సూచించారు. ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డిని ఆదేశించారు. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కౌన్సిల్ సమావేశం జరగనున్న పరిస్థితిలో మేయర్ ఎన్నిక నగరంలో తీవ్ర చర్చనీయంగా మారింది. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కౌన్సిల్ సమావేశం జరిగే వరకు వైసీపీ నేతలు ఎలాంటి ప్రలోభాల ప్రయోగాలు చేస్తారో వేచి చూడాలి. మేయర్‌గా ఉన్న పొట్లూరి స్రవంతికి, వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇది వరకే ప్రకటించారు. ఇక మాజీ మంత్రి అనిల్ యాదవ్ ఈ విఝయాన్ని గుర్తు చేశారు. అంతే కాదు తమకంతటి సంఖ్యాబలం లేదంటూనే లోలోపల లోపాయికారీ బేర సారాలు ఆడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో నెల్లూరు మేయర్ ఎన్నిక రసవత్తరంగా మారేలా కనిపిస్తోంది.
http://www.teluguone.com/news/content/nellore-mayoral-election-39-210912.html




