ఈ రోజుల్లో వాహనాల రొద ఎక్కువైంది. వయసుతో సంబంధం లేకుండా మోటార్ వాహనాలు తెగ వుపయో గిస్తున్నారు. పని వున్నా లేకపోయినా, బడికి వెళ్లే వారూ చిన్నపాటి మోటార్‌సైకిల్ పైనే వెళుతున్నారు. వేగానికి అతి ప్రాధాన్యతనిస్తున్నారేగాని దాని వల్ల వాతావరణ కాలుష్యానికి అంతే కారకులవుతున్నారన్న ధ్యాస మాత్రం వుండడం లేదు. చాలాకాలం క్రితం మన దేశంలో సైక్లింగ్ కీ ప్రాధాన్యత వుండేది.
కాల క్రమంలో వేగానికి పెద్ద పీట వేయడం జరిగింది. అన్ని పనులు సత్వరం కావాలంటే మోటార్ వాహ నాల ప్రయాణమే సుఖం అన్న అభిప్రాయానికి వచ్చేయడంతో వాటినే ఎక్కడికి వెళ్లాలన్న వుపయోగిం చడం అలవాటైపోయింది. ప్రస్తుతం మన దేశంలో సైక్లింగ్ కేవలం ఆరోగ్య సూత్రాల్లో ఒకటిగా మిగిలి పోయింది. ఇది వూహించని మార్పు.
మనం నెదర్లాండ్స్ ప్రభుత్వాన్ని చూసి ఎంతో నేర్చుకోవాలి. అక్కడ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేవారు సైకిల్ మీద వెళితే కిలోమీటర్‌కి 15 డాలర్లు ప్రభుత్వం ఇస్తోందిట! దేశంలో సైక్లింగ్‌కు ప్రాధాన్యతనీయా లని అక్కడ ప్రభుత్వం ఆలోచన చేసింది. అంతేకాక, పర్యావరణ పరిరక్షణకు కాసింత వారివంతు తోడ్ప డటంలో ఇదో మార్గం ఎంచుకుంది. అంటే సైక్లింగ్ ద్వారా అక్కడి వారు వారానికి మన లెక్కల్లో రూ.300 సంపాదించే అవకాశం ప్రభుత్వం కల్పించింది. అది టాక్స్ ఫ్రీ!
సైకిలువాడకం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వొత్తిడిని తగ్గిస్తుంది. నగరాల్లో వాతావరణ కాలుష్యాన్ని బాగా తగ్గిస్తుంది. ఈ కారణాలవల్లనే సైక్లింగ్‌ను ప్రమోట్ చేస్తున్నామని నెదర్లాండ్స్ ప్రభుత్వ మౌలిక సదుపాయాల మంత్రి వాల్దువెన్ అన్నారు. సైక్లింగ్‌ను ఉత్సాహపరచడం ద్వారా సంవత్సరానికి వందల యూరోలు మిగులుతాయన్నారు. ప్రభుత్వానికి కూడా ఎంతో మేలు చేసినట్లేనని ఆయన అన్నారు. ప్రభుత్వం ఈ పరమైన గట్టి నిర్ణయాలను అమలు చేయడంలో ప్రజల ఆరోగ్య సంరక్షణ పట్ల వారి వున్న ప్రత్యేక దృష్టిని తెలియజేస్తుంది.
ఇలాంటి ఆలోచనలు మన దేశంలో అమలుచేయడానికి ప్రభుత్వాలకు ఎవరుచెప్పగలుగుతారు. రోజు రోజుకూ పెరిగిపోతున్న కాలుష్యానికి ఫుల్‌స్టాప్ పెట్టడానికి సైక్లింగ్ విధానాన్ని మన ప్రభుత్వాలూ చేపడితే మేలు. కాలుష్య నివారణ, ప్రమాదాల నివారణకూ సైక్లింగ్ని ఉత్సాహపరచాలి. నెలలో కనీసం కొన్ని రోజులు కార్యాలయాలకు సైకిల్ మీద రావాలని గట్టి నిబంధనను అమలుచేయడానికి పూనుకోవాలి. అపుడు నెదర్లాండ్స్ వలె మన దేశంలోనూ ప్రజారోగ్యం, పర్యావరణపరిరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ పెరుగు తుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nederlands-encouraging-cycling-39-139131.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.