పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం.. పీపుల్స్ పల్స్ సర్వే!

Publish Date:Mar 30, 2026

Advertisement

పుదుచ్చేరిలో  వచ్చే నెల 9న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంటే  పీపుల్స్ పల్స్   సంస్థ నిర్వహించిన ప్రీ పోల్ సర్వే ఔననే అంటోంది.  30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీకి వచ్చే నెల 9న జరగనున్న ఎన్నికలలో  ఎన్డీయే 14 నుంచి17 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది. ఇక విపక్ష  ఎస్పీయే 9 నుంచి11,  నటుడు విజయ్ నూతనంగా స్థాపించిన టీవీకే పార్టీ 2 నుంచి4 స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇతరులు ఒకటి నుంచి రెండు స్థానాలలో గెలిచే అవకాశాలున్నాయని సర్వే పేర్కొంది.  

9నుంచి 11స్థానాలు కైవసం చేసుకుని ఎన్.ఆర్ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించనున్నట్లు ఈ సర్వేలో వెల్లడయింది. ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీ బీజేపీ 5 నుంచి 7, ఎస్పీఏలో భాగస్వాములైన కాంగ్రెస్ 3నుంచి 5, డీఎంకే 6 నుంచి 8 స్థానాలు గెలుపొందే అవకాశాలు ఉన్నాయి.  పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ఎన్డీయే 34 నుంచి 36 శాతం, ఎస్పీఏ 30- నుంచి 32 శాతం, టీవీకే 16నుంచి 18 శాతం ఒట్లు, ఎన్టీకే 4నుంచి 6 శాతం, వీసీకే 1నుంచి 3 శాతం, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు కలిసి 2 నుంచి 5 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉందని పీలుల్స్ పల్స్ సర్వే పేర్కొంది.  

పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ ఈ సర్వేను 16-23 మార్చి, 2026 మధ్య పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 పోలింగ్ స్టేషన్లను ఎంచుకుని, ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి 20-25 శాంపిల్స్ ను సేకరించడం జరిగింది. ఈ సర్వేలో కులం, మతం, మహిళలు, పురుషులు, అన్ని వయసుల వారిని పరిగణనలోకి తీసుకుని శాస్త్రీయ పద్ధతిలో ఈ సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వే నివేదికను నిఖిల్ కుమార్ రూపొందించారు. డేటా ఎనాలిసిస్ ను, ఇతర సాంకేతిక సహకారాన్ని అవెల్జెన్స్ సంస్థ అందించింది. 

ఎన్నికల షెడ్యూల్ ముందు ప్రతిపక్ష ఎస్పీయే కూటమి పట్ల ప్రజలు కొంత సానుకూలత చూపించినా... ఆ సానుకూలత ప్రస్తుతం కనిపించడం లేదు. టికెట్ల పంపకం తర్వాత ఆరుగురు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కూటమిలో భాగస్వామి అయిన డీఎంకే పార్టీకి కేటాయించిన సీట్లలో నామినేషన్లు దాఖలు చేసి ఉపసంహరించుకోకపోవడంతో ఎస్పీఏకు  తీవ్ర నష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్... డీఎంకే పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం లోపించడంతో పుదుచ్చేరిలో ప్రస్తుత పరిస్థితులు ఎన్డీయేకు సానుకూలంగా మారాయి.

ఎన్డీయే కూటమిలోని ప్రధాన పక్షమైన ఎన్.ఆర్ కాంగ్రెస్, బీజేపీ మధ్య సీట్ల పొత్తుల్లో కొంత ప్రతిష్టంభన ఏర్పడినప్పటికీ... దానిని అధిగమించి వారి మధ్య పొత్తు కుదిరింది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం ఉండటం సానుకూలంగా మారింది.

దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు, నగదు  ఎస్పీఏలో కుమ్ములాటలు, సినీ నటుడు విజయ్ పార్టీ, ఓట్ల చీలిక తదితర అంశాల కారణంగా ఎన్డీయేకూ సానుకూలంగా మారుతున్నాయి. ఎన్నికల నాటికి ఎస్పీయేలో అంతర్గత విభేదాలకు తోడు ఎన్డీయే వ్యతిరేక పక్షాలు ఎక్కువ ఓట్లు చీలిస్తే అవి ఎన్డీయేకు అనుకూలంగా మారి 20 సీట్లకు పైగా గెలుపొందినా ఆశ్చర్యపోనవసరం లేదు. 

By
en-us Political News

  
ఈ ప్రక్రియను వేగవంతం చేసి ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఇందుకు ఆమోదముద్ర వేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు వచ్చే నెల 1న లోక్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. కాగా ఈ అంశంలో కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తన వంతు సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది.
సభ్యులు ప్లకార్డులతో నిరసన తెలపడాన్ని మార్షల్స్ అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం మార్షల్స్‌ను అడ్డం పెట్టుకుంటోందని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వంద మంది ప్రముఖులతో ప్రకటించిన ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డిలు చోటు దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఈ జాబితాలో 13వ స్థానం దక్కగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 25వ స్థానంలో నిలిచారు.
హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయనీ, ఈ సందర్భంగా బలమైన ఈదురుగాలులతో పాటు వడగళ్లు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు మేనిఫెస్టోలో పలు పథకాలు ప్రకటించారు. ఆదాయపు పన్ను పరిధిలోకి రాని కుటుంబాల్లోని మహిళలకు ఇల్లతరసి పథకం కింద గృహోపకరణాలు కొనుగోలుకు 8వేల రూపాయల విలువైన వన్ టైమ్ కూపన్ ప్రకటించారు. ప్రస్తుతం మహిళా కుటుంబ పెద్దలకు నెలనెలా ఇస్తున్న వెయ్యిరూపాయల ఈర్థిక సయాన్ని రెండు వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాను ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలు ఇప్పటికీ దేశంలోని అనేక రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచాయన్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన అనుభవంతో, భవిష్యత్తులో అమరావతిని హైదరాబాద్‌ను మించిన ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర వాసులకు హామీ ఇచ్చారు.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రులకు మరింత ప్రాధాన్యత ఉన్న శాఖలను అప్పగించాలని మోడీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలుగు సమాజం మీద తెలుగేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ముద్ర ఎన్నటికి చెరిగిపోనిది. నటుడిగా అయన కృషి అజరామరం. రాజకీయ నాయకుడిగా అయన 14 ఏళ్ల ప్రస్థానంలో అయన ప్రభావం మహత్తరం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేయడంతో పాటు, తెలుగు సమాజంలో ఫ్యూడల్ వ్యవస్థలను నిర్మూలించి, అట్టడుగు వర్గాల సామాజిక, రాజకీయ ఉన్నతికి తోడ్పడం లో ఎన్టీఆర్ చూపించిన చొరవ నభూతో నభవిష్యతి.
ఈ తీర్మానంలో ప్రధానంగా ప్ర‌స్తావించిన సెక్ష‌న్ 5 స‌వ‌ర‌ణ అత్యంత కీల‌కం. 2014 ఏపీ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టంలోని సెక్ష‌న్ ఐదు ప్ర‌కారం.. హైద‌రాబాద్ ప‌దేళ్ల పాటు ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉంది. ఆ త‌ర్వాత ఏపీకి కొత్త రాజ‌ధాని ఉండాల‌ని ఉంది. కానీ, దాని పేరు అమ‌రావ‌తి అని ఎక్క‌డా స్ప‌ష్టంగా లేదు. ఈ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ చేసి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అనే ద‌గ్గ‌ర అమ‌రావ‌తి అనే ప‌దాన్ని చేర్చాల‌ని.. కేంద్రాన్ని కోరుతూ.. అసెంబ్లీ శనివారం తీర్మానం చేసింది.
శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ, దానికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గత కొన్నేళ్లుగా రాజధాని విషయంలో నెలకొన్న గందరగోళానికి శాశ్వతంగా స్వస్తి పలకడమే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
తాజాగా కాకినాడ జిల్లాలో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల కారణంగా ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివకాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా వడ్డాదిమాడుగుల గ్రామానికి చెందిన 22 ఏళ్ల మహమ్మద్ బషీర్ కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి సెంటిమెంట్లు బాగా ఎక్కువ‌. ఎందుకంటే ఆ కుటుంబం ఎదిగిందే ఇలాంటి సెంటిమెంట్ల ద్వారా.
తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్గీ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత కొత్తపార్టీ స్థాపనకు రంగం సిద్దం చేసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.