ఎన్ కన్వెన్షన్ పూర్తిగా అక్రమ కట్టడం.. స్పష్టం చేసిన హైడ్రా
Publish Date:Aug 28, 2024
Advertisement
తెలంగాణలో గత కొన్ని రోజులుగా హైడ్రా టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిపోయింది. ముఖ్యంగా నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారు మోగిపోతోంది. కాగా తన కన్వెన్షన్ కూల్చివేత అక్రమమని నాగార్జున ప్రకటించారు. ఎలంటి అతిక్రమణలూ లేకుండా పట్టాభూమిలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ ను అక్రమంగా కూల్చివేశారని ఆరోపించారు. కోర్టుకు వెళ్లారు. అంతే కాకుండా గతంలోనే ఎన్ కన్వెన్షన్ కు కూల్చవద్దన్న కోర్టు ఉత్తర్వులను లెక్క చేయకుండా హైడ్రా ఓవరేక్షన్ చేసి తన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసిందని ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ నిర్మాణానికి కనీసం అనుమతి కూడా లేదని హైడ్రా తన సుదీర్ఘ వివరణలో కుండబద్దలు కొట్టింది. నటుడు నాగార్జున తమ్మిడికుంట చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్ టిఎల్) ను ఆక్రమించి నిర్మించారనీ, అందుకే దానిని కూల్చివేశామని నిర్ద్వంద్వంగా పేర్కొంది. తన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అక్రమమని, చట్ట విరుద్ధమని నాగార్జున పేర్కొనడాన్ని ఖండించింది. అలాగే ఎన్ కన్వెన్షన్ ను పట్టాభూమిలోనే నిర్మించామని నాగార్జున చెప్పడం శుద్ధ అబద్ధమని హైడ్రా పేర్కొంది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఎన్ కన్వెన్షన్ ఎలాంటి అనుమతులూ లేకుండా నిర్మితమైన కట్టడమని స్పష్టం చేశారు. అంతే కాకుండా మొత్తం తమ్మిడికుంట చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ ను పూర్తిగా ఆక్రమించి మరీ ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగిందని విస్పష్టంగా చెప్పారు. ఎన్ కన్వెన్షన్ కు 2014లోనే జీహెచ్ ఎంసీ నోటీసులు జారీ చేసిందని వివరించారు. దాంతో అప్పట్లోనే ఎన్ కన్వెన్షన్ యజమానులు హైకోర్టును ఆశ్రయించారని రంగనాథ్ వివరించారు. ఆ తరువాత కోర్టు ఎన్ కన్వెన్షన్ యజమానుల సమక్షంలో సర్వే నిర్వహించాల్సిందిగా ఆదేశించిందని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు సర్వే నిర్వహిచిన అనంతరం ఎన్ కన్వెన్సన్ యజమానులకు జీహెచ్ఎంసీ మరో నోటీసు జారీ చేసిందనీ, ఆ నోటీసులో తమ్మిడికుంట చెరువు ఎఫ్ టిఎల్ ను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగిందని పేర్కొందని వివరించారు. ఆ తరువాత ఎన్ కన్వెన్షన్ యజమానులు బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీం (బీఆర్ఎస్) కింద క్రమబద్ధీకరించుకోవడానికి విఫలయత్నం చేశారని హైడ్రా చెర్మన్ రంగనాథ్ పేర్కొన్నారు.
http://www.teluguone.com/news/content/nconvetion-completely-illegal-constuction-39-183743.html





