కొడితే కుంభస్థలాన్నే కొట్టాలనుకుంటున్న సిద్ధూ..

Publish Date:Jul 19, 2016

Advertisement

భారత మాజీ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ బీజేపీకి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన చూపు ఆమ్‌ ఆద్మీ పార్టీ వైపు ఉందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. పంజాబ్ రాజకీయాల్లో తక్కువ కాలంలోనే ప్రభావవంతమైన నేతగా గుర్తింపు పొందారు సిద్దూ. సిద్దూ ప్రాతినిధ్యం వహిస్తున్న అమృత్‌సర్ నియోజకవర్గం నుంచి ఆయనను పక్కకు తప్పించి, అరుణ్‌జైట్లీకి ఆ సీటు ఇవ్వడంపై సిద్దూ అలిగి ఉన్నాడు. ఇంత చేసినా తీరా జైట్లీ అక్కడ గెలవలేకపోయాడు. అప్పట్లో సిద్దూ బీజేపీతో అంటీముట్టనట్లుగా వ్యవహరించాడు. అతన్ని బుజ్జగిస్తూ రెండు నెలల కిందటే రాజ్యసభ ఎంపీ పదవిని కట్టబెట్టారు కమలనాథులు.

 

అయితే త్వరలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. రాష్ట్రంలో ఉన్న 13 ఎంపీ సీట్లలో నాలుగు గెలుచుకున్న ఆప్ మరింత కష్టపడితే..ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశపడుతోంది. అందులో భాగంగానే ఆప్ సిద్దూతో సంప్రదింపులు జరిపింది. దీనిపై తీవ్ర తర్జన భర్జనలు పడ్డ సిద్దూ ప్రస్తుతానికైతే బీజేపీకి రాజీనామా చేశారు. సిద్దూ కోసం ఆప్ అంతగా ఆసక్తి చూపడానికి కారణాలున్నాయి. అంతకు ముందే టీమిండియా క్రికెటర్‌గా దేశవ్యాప్తంగా పేరున్న సిద్దూకు పంజాబ్‌ రాజకీయాల్లోనూ మంచి పేరుంది. స్వతహాగా మాటకారి అయిన ఆయన తన వాక్చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకోవడంలో దిట్ట.

 

ఢిల్లీ తర్వాత పంజాబ్‌‌లోనే ఆప్ బలంగా ఉన్నా అక్కడ సరైన నాయకత్వం లేదు. ఢిల్లీకి చెందిన ఆప్ నేతలే అక్కడ కూడా కార్యకలాపాలు, ప్రచారం చేపడుతున్నారు. అయితే ఢిల్లీకి పంజాబ్‌కు సామాజికంగా, సాంస్కృతికంగా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. అందుకే ఢిల్లీ నేతలు అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా నడిపించలేకపోతున్నారు. ఈ దశలో సిక్కు వర్గానికి చెందిన బలమైన నేత కోసం ఆప్ వెతుకుతోంది. ఈ ప్రయత్నంలో వారికి కనిపించిన వ్యక్తి సిద్దూ. మరి సిద్దూ ఆఫ్‌లో చేరుతారా..? లేక సిద్దూ విలువ తెలిసిన బీజేపీ తిరిగి ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేస్తుందా అనేది వేచి చూడాలి.

By
en-us Political News

  
లోకేష్‌తో పాటు ఇటీవల ప్రకటించిన 252 మందితో కూడిన జాతీయ, రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసింది. కీలక నేతలందరూ పార్టీ పట్ల తమ విధేయతను ప్రకటిస్తూ బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.