Publish Date:Apr 27, 2024
ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత జగన్ రాష్ట్రం చుట్టి వచ్చారు కదా..., విషయం అర్థం అయి వుంటుంది. అందుకే సి.ఎం.జగన్, ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికలు జరగక ముందే జగన్ చేతులెత్తేశారనే మాటలు ప్రతిపక్షాల నుంచి గట్టిగానే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ రెండు విషయాలు మనం మాట్లాడుకుంటే
1. నామినేషన్ల పర్వం చాలా పేలవంగా, జనమే లేకుండా వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. జనాన్ని తరలించాలంటే డబ్బు పెట్టాలి. ఎలాగూ ఓడిపోతాం కదా అని అనుకున్నారేమో కానీ, నామినేషన్ల ఘట్టంలో వైసీపీ అభ్యర్థులు జనాన్ని తరలించలేకపోయారు.
2. గేమ్ ఛేంజర్ గా ఉంటుందని ప్రచారం జరిగిన మేనిఫెస్టో.... అదే పాత మేనిఫెస్టోని కొంచెం మార్చి ప్రకటించేశారు.
పాత ఎన్నికల మేనిపెస్టోనే మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పారు అంతే. వృద్ధుల పెన్షన్ల విషయంలో మరో నాలుగేళ్ల పాటు మూడు వేల పెన్షనే ఉంటుందని వచ్చే ఎన్నికలకు ముందు రెండు విడతలుగా రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుతానని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఇప్పటికే నాలుగు వేలు చేస్తామని హామీ ఇచ్చారు. జగన్ కూడా నాలుగు వేలు చేస్తారని అనుకున్నారు. కానీ అలాంటి మార్పు కనిపించలేదు. మరో ఐదేళ్ల వరకూ కూడా మూడువేలే ఉంటుందని తేల్చేశారు. ఇతర పథకలకు డబ్బులు రెట్టింపు చేస్తామని చెప్పారు. కానీ వృద్ధుల పెన్షన్ విషయంలో మాత్రం వెనుకడుగు వేశారు.
మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసి ఇప్పుడు బాధపడుతున్నారు. క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే, విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో మూడు రాజధానుల అంశం ప్రధాన ఎజెండాగా మారింది. విశాఖ పరిపాలనా రాజధాని చేస్తామన్నారు. చట్టపరంగా సాధ్యం కాని అంశం ఇది. అయినా, మేనిఫెస్టోలో పెట్టారు. పోలవరం ప్రాజెక్టు వచ్చే ఐదేళ్లలో పూర్తి చేస్తామని మళ్ళీ పాత పాటే పాడారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లారు. మూడు ఉచిత సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, నాలుగు వేలపెన్షన్ ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. వీటితో పాటు జనసేన చెప్పిన మరో 4 పథకాలను కూడా కలిపి.. 10 గ్యారెంటీ హామీలను ఇస్తామంటోంది. వైసీపీ ఇప్పుడు మేనిఫెస్టో విడుదల చేసేసింది. వైసీపీ మేనిఫెస్టో తేలిపోయింది కాబట్టి, ఇక టీడీపీ కూటమి మేనిఫెస్టో ఎలా ఉంటుంది అనేది ప్రజల్లో ఉత్కంఠత నెలకొంది.
- ఎం.కె.ఫజల్
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/navaratnas-plus-v/s-six-guarantees-39-174673.html
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం (మే9) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు నాలుగు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
రఘురామకృష్ణం రాజు.. పరిచయం అక్కర్లేని పేరు. గత నాలుగున్నరేళ్లుగా జగన్ ప్రభుత్వ అరాచకాలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న వ్యక్తి. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా నరసాపురం లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించిన రఘురామకృష్ణం రోజు.. ఆ తరువాత కొద్ది రోజులకే జగన్ విధానాలతో విభేదించి రెబల్ గా మారారు. నిత్యం జగన్ అరాచకపాలనను విమర్శిస్తూ వచ్చారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను క్యాట్ కొట్టేసింది. తనను రెండో సారి జగన్ సర్కార్ సస్పెండ్ చేయాడాన్ని ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ లో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తెచ్చి జగన్ ఏపీ ప్రజల భూములను దోచుకోవడానికి ప్లాన్ వేశారంటూ పెద్దయెత్తున ప్రచారం చేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన చట్టమని, దీనివల్ల రైతులకు ఎలాంటి నష్టం ఉండదని వైసీపీ చెబుతున్నప్పటికీ అది ఎంత మేరకు రైతుల మైండ్ కు చేరుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న
ఈ ఎన్నికలలో ఎవరైనా ఓటు వేస్తే ఆంధ్రప్రదేశ్ ఓటరు ఈ క్రింది విషయాలను ఒప్పుకున్నట్లే అని సోషల్ మీడియాలో ఒక బాధ్యతగల పౌరుడు స్పందించాడు. నిప్పులాంటి నిజాలను గుర్తు చేశాడు.
వైసీపీకి ఇవే చివరి ఎన్నికలంటూ అభ్యర్థి కాకర్ల సురేష్ తన దైన స్టైల్లో ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ టీడీపీ కూటమికే జైకొట్టేందుకు సిద్ధంగా ఉన్నారనే, అన్నీ సర్వేల్లో తేలిపోయింది. ఉదయగిరి నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్ గా మారుస్తానని, ఉదయగిరి కోటను, సిద్దేశ్వరం, శ్రీ వెంగమాంబ టెంపుల్, గండిపాలెం రిజర్వాయర్ ను పర్యాటక కేంద్రంగా మార్చి ఉద్యోగాలు సృష్టిస్తానన్నారు సురేష్ హామీలు ఇస్తున్నారు.
వైసీపీలో కొన్ని రోజుల నుంచీ ఒక విధమైన నైరాశ్యం కనిపిస్తోంది. ఆ పార్టీ అధినేత జగన్ నుంచి, కీలక నేతలైన విజయసాయిరెడ్డి వంటి వారి వరకూ అందరూ అన్యాపదేశంగా తమ పార్టీ ఓటమి తథ్యమన్న సంకేతాలే ఇస్తున్నారు. ముందుగా జగన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లపై నమ్మకం పోయిందంటూ చేతులెత్తేశారు.
రాజకీయంగా సీనియర్ కూడా అయిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తన మార్కు రాజకీయాలు చేస్తున్నారు. బాలశౌరికి రాజకీయంగా ఎంతో అనుభవం ఉంది. ముఖ్యంగా ప్రజలను తనవైపు తిప్పుకోవడంలోనూ ఆయన నేర్పుగా ముందుకు సాగుతారనే పేరు తెచ్చుకున్నారు.
గదిలో బంధించి కొడితే పిల్లి కూడా పులిలా తిరగబడుతుందన్నది సామెత. సినీ పరిశ్రమలు అన్ని విధాలుగా అవమానించిన ఏపీ సీఎం జగన్ కు సరిగ్గా ఎన్నికల వేళ ఆ సినీ పరిశ్రమ నుంచి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. సినీ పరిశ్రమ నుంచి ఒక్కరొక్కరుగా జగన్ కు వ్యతిరేకంగా జనసేనానికి మద్దతుగా బయటకు వచ్చి గొంతు విప్పుతున్నారు.
చినుకు పడితే హైదరాబాద్ జంటనగరాలు చిగురుటాకులా వణికిపోవడం కొత్త కాదు. ప్రతి ఏటా వానాకాలంలో భాగ్యనగర వాసులు నరకం చూడటమూ కొత్త కాదు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లో మంగళవారం(మే7)న కురిసిన వర్షంతో భాగ్యనగరం కాస్తా భాగ్యనరకంగా మారిపోయింది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యాం సేఫ్టీ మధ్యంతర నివేదికను అందజేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలంగాణ ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గాయపడ్డారు. ఎన్నికలకు గట్టిగా ఐదు రోజుల సమయం కూడా లేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా చురుగ్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూనే, కూటమి అభ్యర్థుల విజయం కోసం రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్నారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా పవన్ కూటమి శ్రేణుల్లో జోష్ నింపేలా ప్రసంగాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంత కాలం ఓ నమ్మకం ఉండేది. తాను ఎంత అరాచకపాలన సాగించినా, ఎంత ఆర్థిక అవకతవకలకు పాల్పడినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీ తనకు అండగా నిలుస్తారనీ, ఎన్నికల గండం నుంచి గట్టెక్కిస్తారని. అయితే తెలుగుదేశం, జనసేనతో ఏపీలో బీజేపీ జతకట్టడంతో ఆ ఆశలు అడియాసలయ్యాయి.