బెడిసి కొట్టిన ఆర్జీవీ వ్యూహం!

Publish Date:Oct 20, 2023

Advertisement

ఏం చేసినా చూస్తూ ఊరుకునేందుకు ఇదేమీ ఆటవిక రాజ్యం కాదు కదా. ఎలాంటి మహారాజులనైనా చీల్చి చెండాడే రాజ్యాంగం అమలయ్యే దేశం కదా.. కాస్త ఆలస్యమైనా విపరీత ధోరణికి కళ్లెం పడాల్సిందే.  నేనేం చేసినా చెల్లుతుంది అనుకుంటే అందరూ చూస్తూ ఉండాలని రూల్ ఏమీ లేదు కదా. అసలే తలబిరుసు ఎక్కువాయె.. అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఇంతకీ దేని గురించి ఇదంతా అనుకుంటున్నారా? అదే టాలీవుడ్ లో వివాదాస్పద దర్శకుడిగా పేరున్న రామ్ గోపాల్ వర్మ గురించి.. ఆయన తెరకెక్కించిన వ్యూహం సినిమా గురించి. దీనిని సినిమా అనే కన్నా.. ఎన్నికలే లక్ష్యంగా  వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని హీరోగా చిత్రీకరించేలా తెరకెక్కించిన ఓ కంప్లీట్  ప్రచారం చిత్రం అని చెప్పొచ్చు. విడుదల కూడా కాకుండా మీరెలా చెప్తారని అంటారేమో.. ఏకంగా సినిమా తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ తానే స్వయంగా ఈ విషయం చెప్పారు.  ఔను.. నాకు జగన్ మోహన్ రెడ్డి హీరోలాగానే కనిపిస్తారు.. కనుకే ఆయన్ని ఈ సినిమాలో హీరోలా చూపించానని ఓపెన్ గానే చెప్పారు ఆర్జీవీ. జగన్ హీరో అంటే మిగతా ఆయన రాజకీయ ప్రత్యర్థులంతా విలన్లే కదా. అందుకే ఇష్టం వచ్చినట్లుగా జగన్ ప్రత్యర్థులందరినీ ఘోరాతి ఘోరంగా చూపించారు. ఇప్పటికే టీజర్లు, ట్రైలర్లలోనే ఆయన ఏం చెప్పాలనుకున్నాడో స్పష్టంగా చెప్పారు. అందుకే ఇప్పుడు ఆయన సినిమాకు బ్రేకులు పడే అవకాశాలే కనిపిస్తున్నాయి. .

 జగన్ రాజకీయ జీవితంలోని కీలక ఘట్టాల ఆధారంగా తెరకెక్కిన వ్యూహం సినిమా నవంబరు 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వర్మ అండ్ కో ఇప్పటికే ప్రకటించారు. అయితే, వ్యూహం సినిమా విడుదల కాకుండా ఆపాలంటూ టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ను, కేంద్ర హోంశాఖను, తెలంగాణ ఎన్నికల ప్రధాన కమిషనర్ ను కోరుతున్నారు. ఈ సినిమాలో ఏపీ సీఎం జగన్ ను, వైసీపీని గొప్పగా చూపించి, విపక్షాలను తక్కువ చేసి చూపించారని నట్టి కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ఏపీకి సంబంధించిన ఇతివృత్తం అయినప్పటికీ, త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నందున తెలంగాణలోనూ ఈ సినిమా ప్రభావం చూపించే అవకాశం ఉందని నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు. వర్మ వ్యూహం సినిమాలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, సోనియా గాంధీ వంటి రాజకీయ నేతలందరినీ తక్కువ చేసి చూపించడమే కాకుండా.. వారంతా కుట్రలు పన్నే నేతలుగా చూపించే ప్రయత్నం చేశారని నట్టి కుమార్ ఆరోపించారు. 

వ్యూహం సినిమా విడుదలైతే తెలంగాణ ఓటర్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆరోపించిన నట్టి కుమార్.. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ వ్యూహం సినిమా విడుదల సరి కాదని పేర్కొన్నారు. వచ్చే నెలలోనే ఎన్నికలు ఉన్న తెలంగాణలోతెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయని.. ఆ పార్టీల అధ్యక్షులైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాత్రలను ఈ సినిమాలో తప్పుగా చూపించారన్న విషయం ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ల ద్వారానూ, స్వయంగా ఆర్జీవీ మాటల ద్వారానూ అర్దం అవుతోందని పేర్కొన్న నట్టి కుమార్ ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రం విడుదల వాయిదా వేయాలని కోరారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ చేస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.   తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే అక్రమంగా అరెస్టై జైలులో ఉండగా.. ఆయన పాత్ర డూప్ ద్వారా వస్తున్న ఈ చిత్రం విడుదల చేస్తే అల్లర్లు జరిగే అవకాశం ఉందని నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాలలో చంద్రబాబు అక్రమ అరెస్టునకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయనీ, ఈ సమయంలో వ్యూహం సినిమా విడుదలైతే అల్లర్లు జరిగే అవకాశాలు మండుగా ఉన్నాయనీ నట్టి కుమార్   ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఈ సినిమాలో పాత్రలన్నీ యధాతధంగానే చిత్రీకరించారు. ఒక్క జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతీలను తప్ప మిగతా అందరినీ కుట్రదారులుగా చూపించారు. పైగా రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జరిగిన పరిణామాలలో వాస్తవాలను వక్రీకరించి తమకు కావాల్సినట్లుగా తెరకెక్కించారు. జగన్ కు వ్యతిరేకంగా మారే అవకాశం ఉన్న తన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల పాత్రలను ఎక్కడా సినిమాలో లేకుండా ఇది సంపూర్ణంగా జగన్ కోసమే.. జగన్ కు అనుకూలంగా ఉండేలా.. జగన్ ను ఓ ఆదర్శ నాయకుడిలా చూపించే ప్రయత్నంగానే కనిపిస్తున్నందునే  నట్టి కుమార్ ఫిర్యాదు చేశారు.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో పర్యటించారు.
హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో అనూహ్య విమాన ఘటన చోటుచేసుకుంది.
సైబరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కొత్త చర్యలకు సిద్ధమవుతోంది.
ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై హెచ్చరిక చిహ్నాల అమలులో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సర్వం సిద్ధమైంది.
హైదరాబాద్ నగరంలోని రేతిబౌలి ప్రాంతంలో జరిగిన పెళ్లి ఊరేగింపులో కత్తులు చేతబట్టి నృత్యం చేసిన నలుగురు వ్యక్తులను గుడిమల్కాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
సూపర్ ఇంటెలిజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మనిషి సహజ వృద్ధాప్య ప్రక్రియను నియంత్రించగలిగితే, సుమారు 1,400 సంవత్సరాల వరకు జీవించే అవకాశం
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
ప్రపంచ అందాల పోటీల చరిత్రలో కీలక మలుపు చోటు చేసుకుంది.
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు, రేడియల్ రోడ్ల నిర్మాణం, పట్టణాభివృద్ధి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాజెక్టుల పనుల స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ముంబయిలోని కాలాచౌకి ప్రాంతానికి చెందిన ఉదయ్ పవార్ పట్టుదల, ఆచరణాత్మక ఆలోచనలతో చిన్న స్థాయి సేవను లాభదాయక వ్యాపారంగా తీర్చిదిద్దారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.