12న దేశవ్యాప్త సమ్మె
Publish Date:Feb 10, 2026
Advertisement
కేంద్రంలోని మోడీ సర్కార్ అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 12న దేశ వ్యాప్త సమ్మె జరగనుంది. ఈ సమ్మెకు దేశంలోని పది ప్రధాన కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక పిలుపు నిచ్చింది. ఈ సమ్మె ప్రభావం దేశవ్యాప్తంగా 600కు పైగా జిల్లాల్లో తీవ్రంగా ఉంటుందని కార్మిక సంఘాల ఐక్యవేదిక పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ ఈ సమ్మెకు పిలుపు నిచ్చినట్లు తెలిపింది. ప్రధానంగా కేంద్రం తీసుకొచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, ఉపాధి హామీ పథకంలో మార్పులను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్లతో ఈ సమ్మెకు పిలుపు నిచ్చినట్లు తెలిపింది. గత జులైలో జరిగిన దేశవ్యాప్త సమ్మెలో పాతిక కోట్ల మంది పాల్గొన్నారనీ, ఈ సారి ఫిబ్రవరి 12 (గురువారం) జరగనున్న దేశ వ్యాప్త సమ్మెలో అంతకంటే ఎక్కువగా దాదాపు 30 కోట్ల మంది పాల్గొననున్నారనీ కార్మిక సంఘాలు తెలిపాయి. ఈ సమ్మెకు సంయుక్త కిసాన్ మోర్చా సహా పలు రైతు సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి.
http://www.teluguone.com/news/content/national-wide-strike-on-febraury12th-36-213807.html





