జాతీయ బాలికల దినోత్సవం.. ఆడపిల్లల భవితకు ఓ చేయూత..!

Publish Date:Jan 24, 2026

Advertisement


ఆడపిల్ల ఇంటికి వెలుగు అంటారు. ఆడపిల్ల ఇంట్లో ఉండే  మహాలక్ష్మి ఇంట్లో ఉన్నట్టే అని కూడా అంటారు. అయితే కొన్ని దశాబ్దాల క్రితం ఆడపిల్ల పుడితే పురిట్లోనే చిదిమేసేవారు,  ఇంకొందరు బ్రూణ హత్యలు చేయించేవారు.  ఈ కారణాల వల్ల ప్రస్తుతం మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లల నిష్పత్తి తక్కువగా ఉంది.  పెళ్లిళ్ల కోసం ఆడపిల్లలు కరువయ్యారు అంటూ పెద్దలు మొరపెట్టుకుంటున్నారు.  అయితే ఆడపిల్లల గురించి, వారి భవిత గురించి ఆలోచించి వారి అబివృద్ది కోసం ప్రతి ఏడాది జనవరి 24వ తేదీన జాతీయ బాలికల దినోత్సవం జరుపుకుంటున్నారు,  బాలికల హక్కులు,  వారి భద్రత,  విద్య,  ఆరోగ్యం వంటి అంశాలపై సమాజంలో అవగాహన కల్పించేందుకే ఈ రోజును జరుపుకుంటారు.  ఈ రోజు గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..

జాతీయ బాలికల దినోత్సవం..

2008 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించింది. మహిళా,  శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Women and Child Development), భారత ప్రభుత్వం కలిసి ఉమ్మడిగా ఈ రోజును జరుపుకోవాలని పిలుపు ఇచ్చింది.

జనవరి 24నే ఎందుకు..

ఈ తేదీకి ప్రత్యేకమైన చారిత్రక సంఘటన ఏమీ లేదు. కానీ బాలికల హక్కులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టేందుకు, సంవత్సర ఆరంభంలోనే సమాజానికి ఒక బలమైన సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ తేదీని ఎంపిక చేశారు.

 ఎందుకు జరుపుకుంటారు..

సమాజంలో బాలికలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా.. బాల్యవివాహాలు,  శిశుహత్యలు, లింగ వివక్షత,  బాలికల విద్యకు అవకాశాల లోపించడం,  ఆరోగ్యం, పోషణలో నిర్లక్ష్యం వంటి సమస్యలు ఎక్కువగా ఉండేవి.  ఈ సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించి, బాలికలకు సమాన హక్కులు, గౌరవం, అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ప్రధాన లక్ష్యాలు..

బాలికలపై జరుగుతున్న వివక్షను తగ్గించడం, బాలికల విద్యను ప్రోత్సహించడం, బాల్యవివాహాలు, ఆడ పిల్లలను పురిటిలో లేదా కడుపులోనే హత్య చేయడం,   వంటి  దారుణమైన కార్యకలాపాలను  అరికట్టడానికి,  బాలికల ఆరోగ్యం, భద్రతపై దృష్టి పెట్టడానికి  తగినట్టు కార్యాచరణ చేయడమే ఈ రోజు ప్రధాన లక్ష్యాలలో భాగంగా ఉంటుంది.  అదేవిధంగా.. బాలికలు కూడా సమాజానికి ఒక బలం అనే భావనను పెంపొందించడం దీని లక్ష్యం.

ఎలా జరుపుకుంటారు..

పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం.  వ్యాసరచన, ప్రసంగ పోటీలు, బాలికల హక్కులపై చర్చలు, ర్యాలీలు.  ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం. బాలికలను ప్రోత్సహించే  కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఈ రోజును జరుపుకుంటారు.

బాలికల గౌరవం, హక్కులు, భవిష్యత్తుపై దేశంలోని ప్రతి ఒక్కరి  బాధ్యతను గుర్తు చేసే రోజు ఇది.   ముఖ్యంగా ఆడపిల్ల చదువు బారం  అనే రోజు నుండి బాలిక చదువుకుంటే  దేశం అభివృద్ధి చెందుతుంది అని దేశం మొత్తం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఇలాంటి రోజులను నిర్వహిస్తూ ప్రజలలో అవగాహన కల్పించడం వల్లే వచ్చింది. బాలికల చదువును ప్రోత్సహించి, వారి రక్షణ చూసుకోవాల్సిన బాధ్యత దేశ పౌరుల మీద ఖచ్చితంగా ఉంటుంది.

                           *రూపశ్రీ.

By
en-us Political News

  
కొత్త వస్తువులు కొంటేనే చాలామంది చాలా సంతోషంగా ఉంటారు.  ఇక మహిళలు అయితే వంటింటి వస్తువుల నుండి వారు కొనుగోలు చేసే వస్తువు పట్ల చాలా ఇష్టంతో ఉంటారు.  కానీ కొత్త వస్తువుల లుక్ పాడు చేసే వాటిలో వాటి మీద ఉండే స్టిక్కర్లు ప్రధానంగా ఉంటాయి...
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి గుర్తుగా బుధవారం దేశంలో రంజాన్ చంద్రుడు కనిపించాడు. అంతకుముందు సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 17న చంద్రుడు కనిపించాడు.  ఫిబ్రవరి 18న అక్కడ రంజాన్ ఉపవాసం ప్రారంభానికి గుర్తుగా చంద్రుడు కనిపించాడు...
ప్రతి వ్యక్తి జీవితం గురించి చాలా ఆలోచిస్తారు.  తమ జీవితం ఎలా ఉండాలో,  ఎలా ఉంటే బాగుంటుందో అని చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.  సరిగ్గా గమనిస్తే.. కొందరు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని అంటూ ఉంటారు...
తల్లిదండ్రులు పిల్లలు ఎంత పెద్దైనా వారు చిన్నవారిగానే కనిపిస్తారు అని  అంటుంటారు.  కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు,  పిల్లల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీనికి   అతిపెద్ద కారణం  చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు..
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు  అన్ని ఆనందాలను పొందాలని,  జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు. తమ పిల్లలు తమలాగా కష్టాలను పడకూడదని అనుకుంటారు.  అందుకే నేటికాలంలో మేము కష్టాలు...
డబ్బు మనిషి జీవితానికి చాలా అవసరం.  డబ్బు లేని జీవనం దుర్బరంగా ఉంటుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో పేద వారు మరీ అంత ఇబ్బందులలో ఉండరు...
వాలెంటైన్స్ డే ప్రతి ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకుంటారని అందకీ తెలిసిందే. అయితే ఫిబ్రవరి 14కు ముందు వారం రోజుల నుండే వాలెంటైన్  హడావిడి మొదలవుతుంది.  వారం రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక ప్రత్యేక దినంగా పరిగణిస్తూ..
నేటికాలంలో మనిషి కష్టపడి డబ్బు సంపాదించేది ధనవంతుడు కావడానికే. ఎందుకంటే ధనవంతుడిగా ఉంటే చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి.  కానీ చాలామంది ఆర్థికంగా ఎదగలేరు...
రవాణా ప్రజల జీవితాలలో ఎంతో ముఖ్యమైనది. రోడ్డు రవాణా చాలా సహజంగా అందరికీ తెలిసేది,  కనిపించేది. కానీ  వాయు రవాణా, జల రవాణా ప్రజల నివాసాలకు దూరంగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా వేల సంవత్సరాల..
ఏదైనా సంబంధానికి పునాది నిజాయితీపై ఆధారపడి ఉంటుందని చాలామంది చెబుతారు.  భాగస్వామి నుండి ఏదీ దాచకుండా ఉండటం, ప్రతిదీ పారదర్శకంగా ఉండాలి అని అనడం చూస్తుంటాం.  భాగస్వామితో ప్రతి చిన్న విషయాన్ని..
ఫిబ్రవరి అంటేనే వాలెంటైన్స్ డే గుర్తుకు వస్తుంది. మనసులోనే తమ ప్రేమను దాచుకున్న ఎందరో ప్రేమికులు తమ మనసు విప్పే సమయమిది.  అయితే చాలా మంది తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఏదో ఒక బహుమతి కొని ఆ బహుమతి...
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీషు పాలనలో భారతీయుల పరిస్థితి ఎంతో ధీనంగా ఉండేది. భారత పౌరులు అందరూ బ్రిటీషర్లకు బానిసలుగా మారారు.  కానీ భారతదేశంలో ఎందరో వీరులు ఈ బానిసత్వం నుండి దేశానికి విముక్తి కలిగించాలని...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.