ఒక్క రోజులోనే దేశంలో 6 హెచ్ఎంపీవీ కేసులు.. తెలుగు రాష్ట్రాలు అప్రమత్తం!

Publish Date:Jan 7, 2025

Advertisement

హ్యూమన్‌ మెటానిమో వైరస్‌.. హెచ్ఎంపీవీ వ్యాప్తి వేగం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలో మొదలైన ఈ వైరస్ ప్రపంచాన్ని చుట్టేయడం ఖాయమన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. మొన్నటి వరకూ ఎవరూ చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ ఉద్ధృతిపై వార్తలు వస్తున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే సోమవారం (జనవరి 6) ఒక్క రోజే భారత్ లో ఆరు కేసులు వెలుగు చూడటంతో అందరిలో ఆందోళన మొదలైంది. హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పుడు దేశాన్ని గడగడలాడిస్తోంది. మరో సారి కరోనా నాటి పరిస్థితులను ఎదుర్కొనక తప్పదన్న భయం అందరినీ వణికించేస్తోంది.  కర్ణాటక, గుజరాత్‌, తమిళనాడు, ఢిల్లీలలో హెచ్ఎంపీవీ కేసులు వెలుగు చూడటంతో జనం భయంతో వణుకుతున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్ఎంపీవీ వైరస్ కొత్తదేం కాదనీ, ఇది ప్రాణాంతకం కాదనీ చెబుతున్నా జనం నమ్మడం లేదు. కరోనా వ్యాప్తి సందర్భంలో కూడా ఇలాగే చెప్పారంటూ నాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటున్నారు.

దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి వార్తల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.  ఏపీలో ఇప్పటి వరకూ హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు క ానప్పటికీ.. ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా,  హెచ్‌ఎంపీవీ గురించి, దాని వ్యాప్తి గురించి, తీసుకోవలసిన జాగ్రత్తలు, వైద్య సదుపాయాలు, మందులు అందుబాటు, ఆక్సిజన్ సరఫరా, అత్య వసర పరిస్థితులు వంటి అనేక అంశాలపైన  ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాల్లో హెచ్‌ఎంపీవీ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో అప్రమత్తతతో వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు దీనిపైన ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదనే విషయాన్ని సీనియర్‌ వైద్య నిపుణులు చెబుతున్నారని చెప్పిన ఆయన అయినా చాన్స్ తీసుకోవద్దనీ, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలనీ చంద్రబాబు సూచించారు. 

హెచ్ఎంపీవీ వైరస్ విషయంలో ప్రభుత్వానికి అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు మైక్రో బయాలజిస్ట్‌లు, పీడియాట్రిషియన్‌లు, పల్మోనాలజిస్ట్‌లు, ప్రివెంటివ్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్‌లతో నిపుణుల కమిటీ  ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  వైరస్‌ ప్రభావితుల పరీక్ష కోసం, హెచ్‌ఎంపీవీ వైరస్‌ని పరీక్షించడానికి యూనిప్లెక్స్‌ కిట్‌లను సేకరించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఐసిఎంఆర్‌ గుర్తింపు పొందిన 10 వైరాలజీ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయని, వీటిల్లో హెచ్‌ఎంపీవీ పరీక్షలు చేయవచ్చని చెప్పారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ పుణేలో హెచ్‌ఎంపీవీ నిర్ధారణ పరీక్ష జరగాలని కేంద్రం సూచించిందన్నారు.

ఐసిఎంఆర్‌ గుర్తింపు పొందిన వీడీఆర్‌ఎల్‌ ల్యాబ్‌లకు అవసరమైన టెస్టింగ్‌ కిట్‌లను సరఫరా చేస్తామని కేంద్రం తెలిపిందన్నారు. జర్మనీ నుండి  గా 3000 టెస్టింగ్‌ కెపాసిటీ కిట్‌లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అలాగే 4.50 లక్షల 95 మాస్క్‌లు, 13.71 లక్షల ట్రిపుల్‌ లేయర్డ్‌ మాస్క్‌లు, 3.52 లక్షల పీపీఈ కిట్లు తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలన్నారు.   చికిత్స కోసం అవసరమైన ఔషధాల లభ్యతపైన కూడా అధికారులతో సమీక్షించారు.  

అన్ని ప్రభుత్వ బోధన, జిల్లా ఆసుపత్రులలో 20 పడకల ఐసోలేషన్‌ వార్డులను  సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలోని అన్ని ఓపీ ప్రాంతాలలో ఆటో శానిటైజర్‌ డిస్పెన్సర్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎలాంటి అంతరాయం లేని ఆక్సిజన్‌ సరఫరా, ఆక్సిజన్‌ పైపు లైన్లు, లిక్విడ్‌ ఆక్సిజన్‌ సరఫరా, పిఎస్‌ఎ ప్లాంట్ల లభ్యత వంటి అంశాలపై అన్ని ఆసుపత్రులలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని ఆదేశించారు. హ్యాండ్‌ వాష్, మాస్క్‌ వాడకం, పరిశుభ్రత నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పూర్తిగా సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.  మరో వైపు తెలంగాణ కూడా హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై అప్రమత్తమైంది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను అదేశంచారు.  ఇలా ఉండగా ప్రధాని నరేంద్రమోడీ కూడా అధికారులతో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవలసిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 

By
en-us Political News

  
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.