అంతరిక్షంలో.. మరో అద్భుతం !
Publish Date:Jun 17, 2025
.webp)
Advertisement
అంతర్జాతీయ అంతరిక్ష సహకారంలో మరో మహోత్తర ఘట్టం ఆవిష్కరణ సమయం ఆసన్నమైంది. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా), భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), జూన్ 18న తమ మొదటి ఉమ్మడి ఉపగ్రహ మిషన్, నిసార్ (నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్) ను చెన్నై శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నాయి. ఇది, భూఉపరితలంపై జరిగే చిన్న పెద్ద మార్పులను అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించడానికి అత్యాధునిక, సింథటిక్ ఎపర్చర్ రాడార్ వ్యవస్థతో అనుసంధానం చేయబడిన అసాధరణ ఉపగ్రహ ప్రయోగం, నిసార్ ఉపగ్రహ ప్రయోగం.
నిసార్’ ఉపగ్రహం వాతావరణ మార్పుల అవగాహన, పరిష్కారానికి అత్యవసరమైన, భూ ఉపరితల పర్యావరణం, ప్రకృతి వైపరీత్యాలు, సముద్ర మట్టం ఎదుగుదల, భూగర్భజలాలు, హిమానీనదాలకు (గ్లోసరీస్)కు సంబందించిన,సంక్లిష్ట సమాచారాన్ని, అత్యంత ఖచ్చితత్వంతో సేకరించడమే, ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఈ రాడార్ నాసా అత్యాధునిక ఎల్ – బ్యాండ్ సింథటిక్ అపెట్రూర్ ఎపర్చర్’ రాడార్’( ఎస్ఎఆర్), ఇస్రో ఎస్- బ్యాండ్ రాడార్’ల సంయుక్త కృషి ఫలితం. అందుకే, దీన్ని, ‘నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్’ గా వ్యవాహరిస్తున్నారు.
ఈ రాడార్ వ్యవస్థలోని డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సామర్ధ్యం, శాస్త్ర వేత్తలు భూమి ఉపరితలం పై ప్రతి సెంటీ మీటర్ పరిమాణం వరకు జరిగే మార్పులను గుర్తించేందుకు తద్వారా, భూకంపాలు, అగ్ని కీలల విస్పొటనాలు, మంచు చరియలు విరిగే పడే ప్రమాదాలను ముందుగానే పసిగట్టేందుకు ఉపకరిస్తుంది. కాగ,ఇస్రో సీనియర్ అధికారి ఒకరు, ‘ఇది రెండు ప్రపంచ ప్రసిద్ద అంతరిక్ష సంస్థల మధ్య కుదిరిన ఒక చారిత్రిక భాగస్వామ్యం’గా పేర్కొన్నారు.అలాగే, ‘భూమండలం ఎదుర్కుంటున్న, అత్యంత ప్రధాన సవాళ్ళను అర్థం చేసుకోవడంతో పాటుగా, పరిష్కార స్పందనలో మార్పులకు నిసార్ ఉపగ్రహం సహాయ పడుతుందని, అన్నారు. ఈ ఉపగ్రహాన్ని, ఇస్రో – జీఎస్ఎల్వీ ఎంకే 2 రాకెట్ ద్వారా ప్రయోగిస్తారు.
ఉపగ్రహం కక్షలో ప్రవేశించిన తర్వాత, ప్రతి 12 రోజులకు ఒక సారి భూమిని చుట్టి వస్తుంది. శాస్త్ర వేత్తలు మొదలు విధాన నిర్ణేతలు, విపత్తు నిర్వహణ సంస్థలు, వరకు అనేక మందికి, అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది., నిసార్’ కేవలం ఒక శాస్త్రీయ అద్భుతం, సాకేతిక మైలు రాయి మాత్రమే కాదు, భారత్, అమెరికా దేశాల మధ్య పెరుగుతున్న అంతరిక్ష , సాంకేతిక సహకారానికి ఓ చిహ్నం. ఈ మిషన్, భూ పర్యవేక్షణ, విపత్తు నివారణలో ప్రపంచ సామర్ధ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. ఈ దశాబ్దపు అత్యంత ప్రధానమైన, ఎర్త్ సైన్సు మిషన్’ గా భావిస్తున్న నిసార్ ప్రయోగం కౌంట్ డౌన్ ప్రారంభమైన నేపధ్యంలో, ఉభయ దేశాల్లో అంచానాలు ఎగసి పడుతున్నాయి.
http://www.teluguone.com/news/content/nasa-39-200173.html












