చెవిరెడ్డికి మరోసారి సిట్ నోటీసులు
Publish Date:Jul 22, 2025

Advertisement
ఏపీ మద్యం కుంభ కోణ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన పీఏ బాలాజీ కుమార్ యాదవ్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల వేళ జగ్గయ్యపేట వద్ద టోల్‌గేట్ సమీపంలో రూ.8 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఘటనపై వివరణ సిట్ ఆదేశించింది. అలాగే ఇండోర్‌లో బాలాజీ అరెస్ట్ వేళ తాము సీజ్ చేసిన రూ. 3.50 లక్షల సొమ్ము లిక్కర్ స్కాందేనని భావిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇదివరకే ఒకసారి చెవిరెడ్డికి నోటీసులు జారీ చేశారు.
ఏసీబీ కోర్టులో తన వాదనలు వినిపించుకునే క్రమంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తన తండ్రి, తన సోదరుడు మద్యం కారణంగానే చనిపోయారని న్యాయాధికారికి చెప్పిన చెవిరెడ్డి.. తనను మద్యం వ్యాపారం చేయవద్దని తండ్రి చెప్పినట్టు వెల్లడించారు. తండ్రి, తమ్ముడు చనిపోవడంతోనే తాను లిక్కర్ జోలికి వెళ్లలేదని, చేయని తప్పుకు శిక్షణ అనుభవిస్తున్నందుకు బాధగా ఉందని కోర్టులో ఎమోషనల్ అయ్యారు
తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో ఫిజియోథెరపీ చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఒకవైపు లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి మరోవైపు తుడా ఉచ్చు బిగుసుకుంటోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.380 కోట్ల పైచిలుకు ఇష్టానుసారంగా ఖర్చు చేసినట్లు విజిలెన్సు అధికారులు గుర్తించారు.
ఈ కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. ఆగస్టు 1 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో 11 మంది నిందితులకు రిమాండ్ ముగియడంతో సిట్ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. నిందితులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, గోవిందప్ప బాలాజీ, ధనుంజయరెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి సహా 11 మందికి రిమాండ్‌ను పొడిగించింది.
http://www.teluguone.com/news/content/former-mla-chevireddy-bhaskar-reddy-39-202473.html












