Publish Date:Nov 24, 2013
హరికృష్ణ రాజకీయ నిర్ణయాల వలన జూ.యన్టీఆర్ సినిమా కెరీర్ లో ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీడియాలో వస్తున్న వార్తలు నిజమయిన పక్షంలో ఇప్పుడు అతనికి తన మామగారు నార్నే శ్రీనివాసరావు వలన కూడా కొత్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. నార్నేశ్రీనివాసరావు గుంటూరు లేదా నరసరావు పేట నుండి లోక్ సభకు పోటీ చేసేందుకు జగన్మోహన్ రెడ్డిని సంప్రదిస్తున్నట్లు సమాచారం. అయితే ఆ రెండు సీట్లు ఇప్పటికే వల్లభనేని బాలశౌరి, అయోధ్య రామిరెడ్డికి ఇచ్చేందుకు జగన్ మాట ఇచ్చినందున, శ్రీనివాసరావుకి ఎటువంటి హామీ ఈయనప్పటికీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఎందుకంటే, ఆయనను పార్టీలోకి రప్పించగలిగితే, జూ.యన్టీఆర్ కూడా ఆయన పక్షం వహించక తప్పదు. అంతే గాక ఆయనకు చెందిన ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ యన్.స్టూడియో కూడా వైకాపా పక్షం వహిస్తుంది గనుక, అది ఎన్నికల ముందు పార్టీకి చాలా ఉపయోగపడుతుంది. అందువల్ల ఆయనకి వేరే ఎక్కడయినా టికెట్ ఇచ్చి పార్టీలోకి రప్పించవచ్చు.
అదే జరిగితే, మొట్ట మొదటగా ఆ ప్రభావం జూ.యన్టీఆర్ మీదే పడటం ఖాయం. ఇదివరకు వైకాపా ఫ్లెక్సీ బ్యానర్స్ తో ఆడిన మైండ్ గేమ్స్ వలన తమకూ, పార్టీకి, కుటుంబానికి మధ్య అగాధం ఇప్పటికీ పూడ్చుకోలేక జూ.యన్టీఆర్, అతని తండ్రి హరికృష్ణ నేటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇప్పుడు నార్నే శ్రీనివాసరావు కనుక వైకాపాలో చేరినట్లయితే జూ.యన్టీఆర్ మరో అగ్ని పరీక్ష ఎదుర్కోక తప్పదు.
అతను తన మామగార్ని అనుసరించి వైకాపా వైపు వెళ్ళలేడు. వెళితే అది అనేక కొత్త సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా అది అతని సినిమా కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. నార్నెవారు వైకాపాలో జేరినట్లయితే, జూ.యన్టీఆర్- తెదేపాల మధ్య ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్నసంబంధాలు పూర్తిగా చెడే ప్రమాదం ఉంది. గనుక నార్నెవారు వైకాపా తీర్ధం పుచ్చుకొనే ముందు ఇటువంటి విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం మేలేమో! అంతకంటే ఆయన తెదేపా నుండి టికెట్ సంపాదించుకొన్నట్లయితే అది ఉభాయకుశులోపరిగా ఉంటుంది కదా!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/narne-srinivasarao-39-27752.html
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.