ఆకట్టుకుంటున్న మోడీ రీల్స్.!

Publish Date:Aug 7, 2026

Advertisement

ప్రధాని నరేంద్ర మోదీ యువతతో  మమేకమయ్యేందుకు డిజిటల్ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.  సరికొత్త డిజిటల్ వ్యూహాన్ని ఎంచుకున్నారు.   యువత, ముఖ్యంగా జెన్ జీ ,  జెన్ ఆల్ఫా  వర్గాలతో నేరుగా సంభాషించేందుకు మోడీ ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌  వేదికగా ఎంచుకున్నారు. తాజాగా మోడీ ఇన్ స్టాగ్రామ్ లో రీల్‌ పోస్టు చేశారు.  ఈ రీల్ ద్వారా దేశంలో రంగాని  ప్రచారం కల్పిస్తూ, న్యూ స్టైల్ లో  మోడీ కనిపించారు.

 మోదీ  షేర్ చేసిన ఈ తాజా రీల్ లో దేశ సంస్కృతి, సాంప్రదాయాల్లో చేనేత రంగానికి ఉన్న ప్రాముఖ్యతను   వివరించారు. దేశీయ చేనేత ఉత్పత్తులు మన సాంస్కృతిక వైభవానికి ప్రతీకలుగా పేర్కొంటూ నేత రంగాన్ని బలోపేతం చేసేందుకు   యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా, యువత  చేనేత  ఉత్పత్తులపై తమ అభిప్రాయాలను, సూచనలను పంచుకోవాలని  కోరారు. 

ప్రస్తుతం  సాంకేతిక విప్లవం కొనసాగుతున్న వేళ, యువత ఎక్కువ కాలం గడిపే ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో రాత్రి వేళల్లో వరుస రీల్స్ పోస్ట్ చేస్తున్న మోడీ..  యువత ఎక్కువగా యాక్టివ్ గా ఉండే సమయాన్ని ఎంచుకుని మరీ   తన సందేశాలను రీల్స్ రూపంలో ఇన్స్టాలో షేర్ చేస్తున్నారు. దీంతో ఆయన రీల్స్ కు వ్యూయర్స్ విపరీతంగా పెరుగుతున్నారు. చేనేతపై ఆయన షేర్ చేసిన రీల్ కూడా నెటిజనులను విపరీతంగా ఆకట్టుకుంది. 

ఇక మోడీ ఇన్ట్సా వేదికగా యువతకు చేరువకావడానికి చేస్తున్న ప్రయత్నం వేనుక.. ఢిల్లీ వేదికగా విద్యార్థులు చేపట్టిన  నిరసనలు, ఆందోళనలు ప్రభుత్వానికీ, యువతకు ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ ను ప్రస్ఫుటంగా బయట పెట్టాయి. ఈ నేపథ్యంలోనే ఆ గ్యాప్ ను పూడ్చాలన్న లక్ష్యంతో మోడీ ఇన్ట్సా వంటి సామాజిక మాధ్యమాలను ఆశ్రయించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

 ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వంటి  షార్ట్  వీడియోలు వేగంగా, ప్రభావమంతంగా యువతకు చేరువవుతాయన్న భావనతోనే.. ప్రధాని ప్రభుత్వ నిర్ణయాలు,  విధానాలను వివరిస్తూ యువతకు చేరువకావడానికి ఇన్స్టా వంటి వేదికలను ఎంచుకున్నారంటున్నారు.  ముఖాముఖిగా మాట్లాడేందుకు డిజిటల్ వేదికలను వాడుకోవడం పెంచారు. ఇటీవలి కాలంలో మెడీ విద్యార్థుల సమస్యలు, వివిధ అంశాలపై   విడేదల ,చేసిన సెల్ఫీ వీడియోలు, రీల్స్ నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.  

Narendra Modi Instagram Reels, PM Modi Handloom Campaign, PM Modi Gen Z Outreach, PM Modi Social Media Strategy, TeluguOne, 
Modi Handloom Sector Reel

By
en-us Political News

  
పశ్చిమ బెంగాల్‌ రాజకీయంలో మరోసారి తీవ్ర కలకలం రేగింది.
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పించి.. కుటుంబసభ్యులను ఓదార్చిన కేసీఆర్.. !
ఆషాఢ మాస బోనాల సందర్భంగా లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహం కాళి అమ్మవారి ఆలయం వద్ద పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు 5న చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన విషాదాం తమైంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరోసారి తీవ్ర రసవత్తరంగా మారబోతోంది.
మహారాష్ట్రలోని పూణే జిల్లా, బారామతి ప్రాంతం మరోసారి విమాన ప్రమాదంతో ఉలిక్కిపడింది.
విజయవాడ నగరం వేదికగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి
తెలంగాణ సంస్కృతికి, ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతిరూపంగా నిలిచే ఆషాఢ మాస బోనాల పండుగ హైదరాబాద్ నగరం అంతటా అత్యంత కోలాహలంగా, అంగరంగ వైభవంగా సాగుతోంది.
మెడికోపై కారు దాడి కేసు.. అది ప్రమాదం కాదు..!
సెలవుపై స్వగ్రామానికి బయల్దేరిన సైనికుడు..మిస్సింగ్‌పై అనుమానాలు..!
విద్యార్థులకు కళాత్మక తయారీ మరియు ప్రదర్శనలో శిక్షణ నిచ్చే తీరుపై మ్యూజియం నిర్వహుకులతో చర్చించారు.
భాగ్యనగరంలో ఆధ్యాత్మిక ఉత్సవ శోభ ఉప్పొంగుతోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే ఆషాఢ మాస బోనాల జాతర హైదరాబాద్ వ్యాప్తంగా అత్యంత వైభవంగా ప్రారంభమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.