వినూత్న ఆలోచనలు, విధానాలతో ముందుకు సాగుతున్న మోడీ

Publish Date:Aug 15, 2015

Advertisement

 

ప్రధాని నరేంద్ర మోడీ డిల్లీలో ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశంలో పేరుకుపోయిన అవినీతిని, అనేక సమస్యలను తమ ప్రభుత్వం ఏవిధంగా పరిష్కరించుకొంటూ వస్తోందో సవివరంగా తెలిపారు. అనేక దశాబ్దాలుగా పేరుకుపోయున్న ఈ సమస్యలకు సాంప్రదాయ పద్దతులలో పరిష్కారించాలంటే అవి ఇంకా నానాటికీ పెరుగుతూనే ఉంటాయి తప్ప ఎన్నటికీ పరిష్కారానికి నోచుకోవని గుర్తించి, తమ ప్రభుత్వం వాటిని వాస్తవిక దృక్పధంతో ఎదుర్కొని ఏవిధంగా పరిష్కరిస్తున్నదీ ఆయన ఉదాహారణలతో సహా వివరించారు.

 

ఉదాహరణకి ఇన్ని దశాబ్దాలుగా గ్యాస్ సబ్సిడీని సామాన్యులే కాకుండా దేశంలో ఉన్నత, అధికాదాయ వర్గాల ప్రజలు కూడా వినియోగించుకొంటున్నారు. కానీ ఆ సంగతి ఇంతవరకు ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అటువంటి వారందరూ సామాన్య ప్రజల కోసం గ్యాస్ సబ్సీడీని వదులుకోమని ఇచ్చిన పిలుపుకి ఇంతవరకు సుమారు 20 లక్షల మంది తమ సబ్సీడీని స్వచ్చందంగా వదులుకొన్నారని, ఆ విధంగా ఏడాదికి రూ.15, 000 కోట్లు మిగులుతుందని ఆ సొమ్మునంతా సామాన్య ప్రజల కోసమే వినియోగిస్తామని మోడీ తెలిపారు.

 

ఇంతవరకు బొగ్గు గనులను, స్పెక్ట్రం వగైరా లైసెన్సులను కేంద్రప్రభుత్వం పెద్ద పెద్ద సంస్థలకు, వ్యక్తులకు నామ మాత్ర ధరలకే కేటాయించేవని కానీ తమ ప్రభుత్వం వాటన్నిటినీ వేలం ద్వారా కేటాయించడం ద్వారా ప్రభుత్వ ఖజనాలో రూ.3 లక్షల కోట్లు జామా అయ్యాయని మోడీ తెలిపారు. బొగ్గు గనులనే కాక ఎఫ్.ఎం. రేడియో లైసెన్సులను కూడా వేలం వేస్తూ ప్రభుత్వానికి అదనపు ఆదాయ మార్గాలను సృష్టించుకొంటున్నామని తెలిపారు.

 

అదేవిధంగా ఇంతవరకు దేశంలో వివిధ రాష్ట్రాలలో గనుల నుండి వెలికి తీస్తున్న బొగ్గుని, విదేశాలలో నుండి దిగుమతి చేసుకొంటున్న బొగ్గును సుదూర ప్రాంతాలకు తరలించేవారని, తద్వారా మధ్య దళారులు, బడా సంస్థలు లాభపడుతుంటే ప్రభుత్వాలు, ప్రజలు ఆ నష్టాన్ని భరించవలసి వచ్చేదని, తమ ప్రభుత్వం ఆ పద్దతిని మార్చి ఎక్కడి బొగ్గును అక్కడి పరిసర ప్రాంతాలకు, సమీప రాష్ట్రాలు వినియోగించుకొనే విధంగా పద్దతులు, నియమనిబంధనలలో మార్పులు చేసామని, ఆ విధంగా కూడా ప్రభుత్వంపై భారం, నష్టాలు తగ్గించుకోగలిగామని తెలిపారు.

 

ఈ విధంగా సమకూర్చుకొంటున్న భారీ మొత్తాలతో దేశంలో అన్ని రాష్ట్రాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు మొదలుపెట్టిందని తెలిపారు. వాటిలో అనేక తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్న ఈశాన్య రాష్ట్రాలకి గ్యాస్ పైప్ లైన్లు వేయడం, రోడ్లు, విద్యుదీకరణ తదితర మౌలికవసతుల కల్పనకు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 69సం.లు అయినప్పటికీ అనేక రాష్ట్రాలలో మొత్తం 18,500 గ్రామాలు విద్యుత్ సదుపాయం లేక నేటికీ చీకటిలో మ్రగ్గుతున్నాయని, ఆ గ్రామాలన్నిటికీ మిగిలిన ఈ నాలుగేళ్ల కాలంలో తప్పకుండా విద్యుత్ సదుపాయం కల్పించి తీరుతామని మోడీ తెలిపారు.

 

భారత సైన్యంలో ఒకే ర్యాంక్, ఒకే పెన్షన్ విధానం ప్రవేశపెట్టమని గత 52 సం.లుగా సైనికులు కోరుతున్నారని కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వమూ ఈ సమస్యను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించలేదని కానీ తమ ప్రభుత్వం ఈ సమస్యను ఏవిధంగానయినా పరిష్కరించేందుకు చాలా గట్టి ప్రయత్నాలు చేస్తోందని కనుక మువ్వన్నెల జెండా సాక్షిగా ఈ సమస్యను వీలయినంత త్వరలోనే పరిష్కరిస్తానని మోడీ హామీ ఇచ్చారు.

 

నల్లదనం గురించి కూడా మోడీ తన ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, వాటి ఫలితాల గురించి తెలియజేసారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశాలలో పడిఉన్న నల్లదనం వెనక్కి రప్పించేందుకు వివిధ శాఖలకు చెందిన నిపుణులతో కూడిన ‘సిట్’ ఏర్పాటు చేసిందని, తమ ప్రభుత్వం నల్లదనాన్ని ఇంకా వెనక్కి రప్పించలేకపోయినా చాలా పటిష్టమయిన చట్టాలు తీసుకువచ్చి దేశంలో నుండి నల్లదనం బయటకి పోకుండా ఆపగలిగామని తెలిపారు. నల్ల కుభేరులకు తమ ప్రభుత్వం ఇచ్చిన గడువులో ఇప్పటికే చాలామంది ప్రభుత్వానికి తమ నల్లదనం వివరాలను తెలిపి దానికి జరిమానాలు చెల్లించడం మొదలుపెట్టినట్లు తెలిపారు.

 

దేశంలో చీడపురుగులా పేరుకుపోయిన అవినీతిని నిర్మూలించేందుకు తమ ప్రభుత్వం చేపడుతున్న అనేక చర్యల గురించి, వాటి ఫలితాల గురించి ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో సవివరంగా తెలిపారు. ఏడాదిన్నర పాలనలో తమ ప్రభుత్వం మీద ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాకపోవడమే తమ నీతి నిజాయితీలకు, పారదర్శకతకు ఉదారణలని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం ఏమి చేసినా దేశంలో సామాన్యుడి జీవన ప్రమాణాలు పెంచి సుఖంగా బ్రతికేందుకు అవకాశం కల్పించాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. రోగం ముదిరిపోయినప్పుడు బలమయిన మందులు, ఇంజక్షన్లు తీసుకొన్నప్పుడు దానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని అలాగే తమ ప్రభుత్వం చేపడుతున్న ఈ అవినీతి నిర్మూలన చర్యల వలన కూడా తమ ప్రభుత్వం అనేక సవాళ్ళను, ప్రతికూలతను ఎదుర్కోవలసివస్తోందని కానీ ఏమాత్రం జంకకుండా ముందుకు సాగుతున్నామని తెలిపారు.

 

వచ్చే నాలుగేళ్ళలో దేశం సర్వతో ముఖాభివృద్ధి సాధించడం తధ్యమని మోడీ దేశ ప్రజలకు భరోసా ఇచ్చారు. రాజకీయ పార్టీలు, విశ్లేషకులు తన ప్రసంగాన్ని రాజకీయ దృక్కోణం నుంచి చూస్తూ విమర్శలు చేయవచ్చని కానీ తను చెపుతున్న ఈ మాటలలో వాస్తవాలను గ్రహించాలని ఆయన కోరారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.