Publish Date:May 11, 2022
టెన్త్ ప్రశ్నా పత్రాల లీక్ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ అరెస్టు, బెయిలు ఎపిసోడ్ ఇంకా ముగిసిపోలేదు. నారాయణకు బెయిలు మంజూరు కావడం, నారాయణపై అభియోగాలను న్యాయమూర్తి తోసిపుచ్చడంతో వైసీపీ ప్లాన్ అట్టర్ ప్లాప్ అయ్యింది. ఆ అయితే వైసీపీ ప్లాపుల పరంపర ఇదే మొదలూ కాదు, ఇదే చివరిదీ కాదు అనిపిస్తున్నది. అసలు నారాయణ వేర్ అబౌట్స్ పోలీసులకు ఎలా తెలిశాయి అన్న అనుమానమే ఎవరికీ రాలేదు. కానీ తెలిసో, తెలియకో మంత్రి పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి, జగన్ ప్రభుత్వానికి మైండ్ బ్లాక్ అయిపోయే వాస్తవాన్ని బయట పెట్టేశారు. మాజీ మంత్రి నారాయణ పోన్ ను ట్యాప్ చేసి ఆయనను పట్టు కోగలిగామని విలేకరుల సమావేశంలో చెప్పారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ ద్వారానే పేపర్ల లీక్ లో బాధ్యులను పోలీసులు అరెస్టు చేశారని మీడియాకు వివరించారు. ఇందుకు సంబంధించి ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
నారాయణను ఫోన్ ట్రాకింగ్ ద్వారా పట్టుకున్నామంటూ పోలీసులు చెప్పారు. అయితే పోలీసుల చెబుతున్నది పూర్తి అవాస్తవమని మంత్రి మాటలు తేల్చేశాయి. పరీక్షా పత్రాల లీకేజికి సంబంధించి తనపై కేసు నమోదైందని తెలియగానే నారాయణ తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారనీ పోలీసులే చెప్పారు. అలాంటప్పుడు నారాయణ ఉపయోగిస్తున్న మరో ఫోన్ నంబర్ వారికి ఎలా తెలిసింది అన్న ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. ఆ ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. నారాయణ ఫోన్ లను ట్యాపింగ్ చేయడం ద్వారా అయన ఎక్కడ ఉన్నారో కనుగొని పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. అంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారానే నారాయణ అనుపానులు కనుగొని పోలీసులు అరెస్టు చేశారని విస్పష్టంగా తేలిపోతోంది. మరి ఫోన్ ట్యాపింగ్ కు అవసరమైన అనుమతులు తీసుకున్నారా? తీసుకుంటే పోలీసులు వెంటనే వాటిని బహిర్గతం చేయాలి. అలాంటి అనుమతులేవీ లేకపోతే.. ఇది అత్యంత తీవ్రమైన నేరం కనుక ట్యాపింగ్ కు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో ఫిర్యాదు అందాల్సిన అవసరం కాదు. స్వయంగా మంత్రి పెద్ది రామచంద్రారెడ్డే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పారు. కోర్టే సుమోటోగా తీసుకుని ఈ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ జరిపించాలి. బాధ్యులకు చట్ట ప్రకారం శిక్షపడేలా చేయాలి.
మొత్తం మీద మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని బయటపెట్టి మొత్తం జగన్ సర్కార్ ను బోనులో నిలబెట్టారు. ఫోన్ ట్యాపింగ్ కు బాధ్యులు ఎవరో, దీని వెనుక ఉన్న వారు ఎవరు అన్న విషయం నిష్పాక్షిక విచారణ ద్వారానే వెల్లడౌతుంది.
నష్ట నివారణకు వైసీపీ కొత్త వాదనను తెరమీదకు తెస్తున్నది. మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి ఫోన్ ట్రాకింగ్ అనబోయి పొరపాటున ఫోన్ ట్యాపింగ్ అన్నారన్నది ఆ వాదన. ప్రస్తుతం జగన్ కేబినెట్ లో ఉన్న వారిలో బొత్స తరువాత అత్యంత సీనియర్ అయిన పెద్దరెడ్డి పొరపాటున, అవగాహనా రాహిత్యంతో మాట్లాడారని చెప్పి తప్పించుకోవడం సాధ్యం కాదు. బాధ్యతాయుత పదవుల్లో, హోదాల్లో ఉన్న వ్యక్తులు అవగాహనా రాహిత్యంతో మాట్లాడారని తప్పించుకోజాలరు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై నిజాలు నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద జగన్ సర్కార్ కక్ష సాధింపు చర్య బూమ్ రాంగ్ అయ్యింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జగన్ మెడకే చుట్టుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/narayanas-phone-tpped-revealed-minister-peddireddy-39-135723.html
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.