లిక్కర్ స్కాంలో వైసీపీకి... నారాయణస్వామి టెన్షన్

Publish Date:Aug 24, 2025

Advertisement

 

మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఒకప్పుడు మాట్లాడితే వైసీపీ నేతలు తెగ ఎంజాయ్ చేసారు. ఇప్పుడు అదే స్వామి మాట్లాడితే ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందో అని భయపడే పరిస్థితి వచ్చింది. దాంతో అయన చుట్టు కోటరీగా లాగా చుట్టుకుని అయన నోరు తెరవడకుండా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంట.. ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఎక్కడ తమ పేర్లు బయటపెడతారో అని భయపడుతున్నారంట పార్టీ పెద్దలు.  మొత్తం మీద ప్రస్తుతం వైసీపీ పెద్దలందరికీ నారాయణస్వామి ఫీవర్ పట్టుకుందంట. 


వైసీపీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి  చిత్తూరు జిల్లాలో నారాయణస్వామి ఒక వెలుగు వెలిగారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు అవకాశం కల్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం హోదాతో పాటు,  కీలక మైన ఎక్సెజ్ శాఖతో పాటు కమర్షియల్ ట్యాక్సెస్ మంత్రిగా అవకాశం కల్పించారు. దీంతో అయన తనకు తిరుగులేదన్నట్లు చెలరేగిపోయారు. కాని పదవీ కాలంలో అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. సాక్షాత్తూ అప్పటి ముఖ్యమంత్రి జగన్ తిరుమల పర్యటనలో సైతం డిప్యూటీ సీఎంకు వేదికపై  కుర్చీ ఇవ్వలేదు. క్యాబినేట్ మంత్రులు కుర్చీల్లో కూర్చోని పవర్ ఎంజాయ్ చేస్తుంటే అయన వెనుక నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది..


మాజీ డిప్యూటీ సియం నారాయణస్వామితో అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబును, జనసేనాని పవన్ కళ్యాణ్‌ను తెగ తిట్టిస్తూ వైసీపీ పెద్దలు ఆనందించారు. అంతేకాకుండా వారినే కాకుండా వారి కులాలను సైతం అయన చేత తిట్టించి తెగ అనందపడ్డారు. అసెంబ్లీలో సైతం ఆయన చెలరేగిపోతుంటే  జగన్ హ్యాపీ అయిపోయారు. ఇక ఎన్నికల ముందు జిల్లాకు చెందిన ముఖ్యనేత అయినప్పటికీ నారాయణస్వామిని అష్ట కష్టాలు పెట్టారు. ఏకంగా అయన్ని జీడి నెల్లూరు అసెంబ్లీ బరి నుంచి తప్పించి చిత్తూరు ఎంపి అభ్యర్థిగా ప్రకటించారు.

చివరకు నారాయణస్వామి నానా తంటాలు పడి.. పార్టీలో అవమానాలు ఎదుర్కొంటూ  కూతురికి జీడి నెల్లూరు టికెట్ ఇప్పించుకోగలిగారు. అయితే ఉహించని రీతిలో రాష్ట వ్యాప్తంగా కూటమి గాలిలో కూతురు ఓటమి పాలయ్యింది. ఓటమి తర్వాత అయన  తన కూతురు రాజకీయ ఓటమికి కారణం పార్టీ లోని సీనియర్ నాయకులతో పాటు స్థానికంగా ఉన్న వారి అనుచరులే అని అగ్రహం వ్యక్తం చేసారు..కొంతకాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఆ క్రమంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం స్కాంపై సిట్ విచారణ ముమ్మరమైంది.  


చిత్తూరు జిల్లాకు చెందిన వారే అందులో కీలకం అయ్యారు.రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో పాటు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అయన కూమారుడు మోహిత్ రెడ్డి , భాస్కర్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి బాలాజీతో పాటు కిరణ్ కూమార్ రెడ్డి వంటి వారిపై కేసులు నమోదయ్యాయి. అయితే తన వరకు కేసు రాదనుకున్న నారాయణస్వామికి సైతం సిట్ ఉచ్చు బిగుసుకుంది. నెల క్రితం అయనకు సిట్ అధికారులు విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడంతో అనారోగ్య కారణాల వల్ల వాట్సాప్ లో పంపిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తాజాగా అయన ఇంటికి వచ్చింది సిట్ బృందం. సుమారు అరుగంటల పాటు విచారణ జరిపింది. 


విచారణలో మద్యం పాలసీ మార్పులో ఎక్సైజ్ శాఖా మంత్రిగా నారాయణస్వామి పాత్ర, అన్ లైన్ ద్వారా మద్యం బుకింగ్ లు మార్చి మ్యాన్ వల్ చేయడం, ప్రభుత్వ మద్యం దుకాణాల  ఏర్పాటు, డిజిటల్ చెల్లింపులకు ఎందుకు అనుమతించలేదు అన్న అంశాలపై వందకు పైగా ప్రశ్నలు అడగటమే కాకుండా టెక్నికల్ టీమ్స్ ద్వారా అయన గాడ్జెట్స్ ను పరిశోధించడం..రెవెన్యూ అధికారుల సమక్షంలో అయన వాంగ్మూలము రికార్డు చేయడం జరిగిందని తెలుస్తోంది. అయితే అయన చాలా ప్రశ్నలకు అంతా పైవారు చెప్పినట్లే చేశానని సమాధానం ఇచ్చారంట.  ఏదేమైనా మొత్తం వ్యవహారం సీరియస్ అయ్యింది.. నారాయణస్వామి ఎవరి పేర్లు చెప్పారనే ఉత్కంఠ వైసీపీ నేతల్లో కనిపిస్తోంది

విచారణ తర్వాత నారాయణస్వామి ఇంటి బయటకు వచ్చినప్పుడు  వైసిపి నేతలు హైడ్రామా క్రియెట్ చేసారు. ముఖ్యంగా నారాయణస్వామి ,అయన కూతురు మీడియాతో మాట్లాడటానికి ప్రయత్నిస్తుండగా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఉదయం సిట్ బృందం వచ్చిందని తెలిసినప్పటికి పెద్దగా ఎవ్వరూ అక్కడికి రాలేదు. అయితే విచారణ ముగిసే సమయానికి పుత్తూరు కు చెందిన వైసీపీ నేతలు వచ్చి మీడియాతో ఎక్కడ పార్టీ నేతలకు వ్యతిరేకంగా మాట్లాడతారో అని  మీడియాతో మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారు.

దాంతో ఒకానొక దశలో సీరియస్ అయిన నారాయణ స్వామి మీడియాతో మాట్లాడి ఇంట్లోకి వెళ్లిపోయారు. ఈసందర్భంగా  సిట్ అధికారులు తనకు సహాకరించారని ,వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని వివరణ ఇచ్చారు. సిట్‌కు వ్యతిరేకంగా ఒకమాట కూడా మాట్లాడలేదు..దాంతో పాటు భవిష్యత్ లో కూడా సిట్ కు సహాకరిస్తానని చెప్పడం వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదంట..

ఇప్పటికే చిత్తూరు జిల్లాలో  మద్యం స్కామ్ లో కీలక నేతలు అరెస్ట్ కావడంతో  పాటు మరికొన్ని కేసులు చుట్టుకుంటుడంతో వైసీపీ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆడుదాం ఆంద్రాతో రోజా, ఎపిక్ కార్డుల ఇష్యూ తో భూమన కరుణాకర్ రెడ్డి టీమ్‌లకు ఉచ్చు బిగుసుకుంటుంది. ఈ నేపథ్యంలో లిక్కర్ కేసుకు సంబంధించి ఎక్సెజ్ శాఖ మాత్యులుగా ఐదు సంవత్సరాలు ఉన్న నారాయణ స్వామి అన్ని విషయాలు బయటపడితే నెక్ట్ ఎవ్వరు అనే కొణంలో చర్చ నడుస్తుంది. మొదట్లో ఇదేమి పెద్ద వ్యవహారం కాదు అన్న రీతిలో పట్టించుకోని వైసీపీకి ఇప్పుడు లిక్కర్ స్కాం పెద్ద తలనొప్పిగా మారింది. మొత్తం మీద వైసీపీ నేతలకు నారాయణ స్వామి ఫీవర్ గట్టిగానే పట్టుకున్నట్లు కనిపిస్తోందిప్పుడు.

By
en-us Political News

  
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.