కూటమి ఐక్యత విచ్ఛిన్నానికి వైసీపీ కుట్రలు.. ఒక్క పదంతో విచ్ఛిన్నం చేసిన లోకేష్!
Publish Date:Aug 6, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు అధికార తెలుగుదేశం కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య బంధం ఎంత పటిష్ఠంగా ఉందో చెప్పకనే చెబుతున్నాయి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మధ్య పెనవేసుకున్న అన్నా తమ్ముళ్ల బంధం కూటమి ఐక్యతను మరింత బలోపేతం చేస్తున్నది. జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య విభేదాలు సృష్టించి, నాయకుల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోందన్న పొలిటికల్ ఎట్మాస్మఫియర్ క్రియేట్ చేయడానికి వైసీపీ చేస్తున్నప్రయత్నాలను పవన్, లోకేష్ సమర్ధంగా తిప్పికొట్టడానికి నారా లోకేష్ అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానం ఊతంగా నిలిచింది. వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా లోకేష్, పవన్ కళ్యాణ్ మధ్య పోటీ ఉందన్న ప్రచాన్ని విస్తృతంగా, నిరంతరాయంగా కొనసాగిస్తూ వస్తోంది. ముఖ్యంగా పాలనా విషయాల్లో పవన్ కళ్యాణ్‌ను తోసి రాజని.. లోకేష్ ఎక్కువగా ప్రొజెక్ట్ అవుతున్నారంటూ ఊదరగొడుతోంది. ఆ మేరకు వైసీపీ సోషల్ మీడియా వింగ్, ఆ పార్టీ అనుకూల మీడియా కథనాలను వండి వారుస్తోంది. అసందర్భంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు తర్వాతి స్థానం ఎవరిదన్న చర్చను లేవనెత్తుతో.. జనసేన శ్రేణుల్లో అనుమానాలు రేకెత్తించేందుకు శతధా ప్రయత్నిస్తున్నది. అయితే.. వైసీపీ వ్యూహాన్ని మంత్రి నారా లోకేష్ సమర్ధంగా, వ్యూహాత్మకంగా తిప్పికొడుతున్నారు. మీడియా సమావేశాల్లో, బహిరంగ సభల్లో, సోషల్ మీడియా వేదకగా షేర్ చేసే పోస్టుల్లో.. లోకేష్ పవన్ కల్యాణ్ ప్రస్తావన వచ్చిన ప్రతి సారీ పవనన్నా అంటూ ఆత్మీయ సంబోధన చేస్తున్నారు. ఇది కేవలం ఒక మాట వరసకు అన్న పదంగా కాకుండా, కూటమి ఐక్యతను దెబ్బతీయాలనుకున్న ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేస్తున్న పొలిటికల్ స్ట్రోక్ గా, స్ట్రాటజీగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. తుత్తునియలు చేసిన ఒక పక్కా పొలిటికల్ మాస్టర్‌స్ట్రోక్. ప్రతివేదికపైనా లోకేష్ పవనన్నా అంటూ పదే పదే సంబోధించడం ద్వారా.. జనసేన శ్రేణులకు, అలాగే టీడీపీ వర్గాలకు తెలుగుదేశం, జనసేన నాయకుల మధ్య విభేదాలు లేవనీ, అన్నదమ్ముళ్లలా కలిసి మెలిసి ఉంటున్నామన్న బలమైన సందేశాన్ని ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కు ఇచ్చే గౌరవంలో గానీ, హోదాలో గానీ తగ్గేదే లే అన్న విస్పష్ట సందేశం ద్వారా నారా లోకేష్ వైసీపీ కూటమి పార్టీల మధ్య విభేదాలంటూ చేస్తున్న ప్రచారాన్ని పూర్వపక్షం చేయగలుగుతున్నారు. లోకేష్ పవన్ కల్యాణ్ కు ఇస్తున్న గౌరవం, ఆయన పట్ల చూపుతున్న అభిమానం జనసేన శ్రేణుల్లో కూడా కూటమి ఐక్యతపై విశ్వాసాన్ని పెంపొందేలా చేస్తున్నది. పవన్ కళ్యాణ్, లోకేష్ కలివిడి తనం, పరస్పర అభిమానంతో కలిసి మెలిసి పని చేస్తుంటే.. రాష్ట్రాభివృద్ధి పరుగులు పెడుతుందన్న అభిప్రాయం జనబాహుల్యంలోనూ బలంగా వ్యక్తమౌతోంది. దీంతో వైసీపీ విభజించు, పాలించు సూత్రం ఇసుమంతైనా పని చేయడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నారా లోకేష్ చూపుతున్న రాజకీయ పరిణతి ఆయనలోని నాయకత్వ లక్షణాలను ప్రస్ఫుటం చేసిందంటున్నారు. ఒకవైపు ఐటీ, విద్యా శాఖల మంత్రిగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను, కీలక పరిశ్రమలనూ ఆకర్షిస్తూ ముందుకు సాగుతున్న లోకేష్ అదే సమయంలో.. ప్రత్యర్థుల రాజకీయ కుట్రలు, వ్యూహాలను సమర్ధంగా తిప్పికొడుతున్నారు. పవన్ అన్నా అ సంబోధనతో.. కూటమిలో విభేదాలు, కూటమి విచ్ఛిన్నం అంటూ వైసీపీ కంటున్న కలలను కల్లలు చేయగలుగుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. Nara Lokesh Strengthes kutami unity, Pawan Kalyan, Pawan Anna Strategy, AP Politics, TDP Janasena Alliance
http://www.teluguone.com/news/content/nara-lokesh-strengthes-kutami-unity-45-228180.html
బీహార్లో ఏదన్నా జరిగితే అక్కడ జంగిల్ రాజ్ నడుస్తోందని అంతా విమర్శించడం సహజం. కానీ ఇప్పుడు దిల్లీలో ఉన్న అస్థిర పరిస్థితులు చూసిన తరువాత బీహార్ ముఖ్యమంత్రికి సమయం వచ్చినట్లుంది. ‘బీహార్‌లో ఏ చిన్న
ఉత్తర్‌ప్రదేశ్‌లో సాగుతున్న దారుణాలకి అంతులేకుండా పోతోంది. అందుకు తాజా ఉదాహరణగా ఇద్దరు అక్కాచెల్లెల్ల మీద నడిరోడ్డు మీద కాల్పులు జరిపారు దుండగులు. స్థానికుల కథనం ప్రకారం ప్రింకీ అనే 15 ఏళ్ల అమ్మాయిని రోజూ ఇద్దరు కుర్రవాళ్లు వేధిస్తూ ఉండేవారు
తన రాజకీయ శత్రువు చంద్రబాబు నాయుడుని ఏదోవిధంగా దెబ్బతీయాలని పరితపించిపోతున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మైసూరా రెడ్డి భుజం మీద తుపాకి పెట్టి ఆయనకు గురిపెట్టవచ్చును. కానీ మున్ముందు ఉద్యమాలు ఊపందుకొన్నట్లయితే అప్పుడు వాటికి వైకాపా మద్దతు ఈయలేదు అలాగని వ్యతిరేకించలేదు కూడా. ఒకవేళ రాయలసీమ ఉద్యమాలకి మద్దతు ఇవ్వాలనుకొంటే అప్పుడు ఉత్తరాంధ్రా, కోస్తా జిల్లాల ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. అలాగని ఉద్యమాలకి మద్దతు ఈయకపోయినట్లయితే ఇంతకు ముందు తెలంగాణాలో తుడిచిపెట్టుకొని పోయినట్లే, సీమలోను వైకాపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. అదే పరిస్థితి తేదేపాకు ఎదురవవచ్చును.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అల్లుడు ఫోబియా తెగ భయపెడుతోందట. ఎన్టీఆర్ కి జరిగినట్లుగా తనకూ జరుగుతుందేమోనని అనుమానిస్తున్నారట.ఎన్టీఆర్ నుంచి పదవి లాగేసుకున్నట్లుగా... తన ఫ్యామిలీ నుంచి కూడా ఎవరైనా అలా చేస్తారనే భయంతో కేసీఆర్ వణికిపోతున్నారట.
ఏడు నెలలు గడిచిపోయినా ఇంతవరకు జి.హెచ్.యం.సి. ఎన్నికలు నిర్వహించబడలేదు. కనీసం ఈ ఏడాదిలోగా నిర్వహిస్తారో లేదో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. కారణం పెరిగిన జనాభాకి అనుగుణంగా జి.హెచ్.యం.సి. పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియా పూర్తి కాకపోవడమేనని ప్రభుత్వ వాదన. ప్రస్తుతం 150 వార్డులుండగా వాటిని 200కి పెంచాలని తెలంగాణా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కానీ జనాభా ప్రాతిపదికన విభజించడానికయితే అంత సమయం అవసరం లేదని ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ సభ్యుల వాదన.
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ఆర్థిక శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అలాగే సీఐఐ సభ్యులతో భేటీ కానున్నారు. అనంతరం ప్రధానమంత్రి సహా పలువురు కేంద్రమంత్రులను బాబు కలిసే అవకాశముంది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిచినట్లయితే ప్రధానమంత్రి కుర్చీలో కాలు మీద కాలేసుకొని దేశాన్ని పాలించేద్దామని కలలుగన్న రాహుల్ గాంధీ, ప్రస్తుతం చేసేందుకు పనేమీలేక పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నపుడు వెనుక బెంచీలలో చిన్న కునుకుతీస్తూ, సమావేశాలు జరగనప్పుడు తన అమేధీ నియోజక వర్గానికి ఓ రౌండేసి వస్తూ కాలక్షేపం చేసేస్తున్నారు.





