Publish Date:Oct 16, 2025
ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా నారా లోకేష్ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా రాజకీయంగా ఎదుగుతున్న తీరు ప్రత్యర్థి పార్టీలకు వణుకు పుట్టిస్తుంటే.. పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులూ లోకేష్ నాయకత్వంపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అలాగే లోకేష్ మాట తీరు, ప్రజలలో మమేకమౌతున్న విధానంతో ప్రజానేతగా ప్రజలు కూడా సంపూర్ణ ఆమోదం పలుకుతున్నారు. ఇటు పార్టీలో, ప్రజలలో అభిమానం పెంచుకోవడమే కాదు, అటు హస్తినలో కూడా రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం చేస్తున్న పర్యటనలతో లోకేష్ జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు పొందారు.
అయితే లోకేష్ కు ఈ గుర్తింపు అంత తేలికగా ఏమీ రాలేదు. నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి. పొలిటికల్ గా నారా లోకేష్ తొలి పలుకులు కూడా బయటకు రాకూడదన్న ప్రయత్నాలు జరిగాయి. బాడీ షేమింగ్ చేశారు. హేళన చేశారు. టార్గెట్ చేసి మరీ క్యారెక్టర్ అసాసినేషన్ కు ప్రయత్నించారు. అయితే వాటన్నిటినీ తట్టుకుని, ఎదుర్కొని, తనను తాను మలచుకున్న లోకేష్ కు తాజాగా ప్రధాని నరేంద్రమోడీ నుంచి అద్భుతమైన ప్రశంస లభించింది.
ప్రధాని ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా కర్నూలు విమానాశ్రయం వద్ద ఆయనకు స్వాగతం పలకడానికి తండ్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు మంత్రి లోకేష్ కూడా వెళ్లారు. ఈ సందర్భంగా లోకేష్ తో కొద్ది సేపు ముచ్చటించారు. ఆ సందర్భంగా లోకేష్ ను మోడీ ప్రశసంలతో ముంచెత్తారు. ముఖ్యంగా ఫిట్ నెస్ విషయంలో లోకేష్ ను ఆయన పొగిడారు. ఇంతకు ముందు కంటే బరువు తగ్గారంటూ వ్యాఖ్యానించిన ప్రధాని మోడీ.. త్వరలోనే నాన్నలా తయారౌతారంటూ కితాబిచ్చారు. ఏడున్నర పదుల వయస్సులో చంద్రబాబు ఎంత చలాకీగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఇప్పటికే పొలిటికల్ గా, అడ్మినిస్ట్రేటర్ గా నారా లోకేష్ తండ్రికి తగ్గతనయుడిగా కితాబులందుకున్నారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర లోకేష్ ఫిట్ నెస్ ను కూడా తండ్రితో పోల్చి ప్రశంసించడం గమనార్హం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nara-lokesh-just-like-cbn-39-208037.html
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్రజల్లో సంతృప్తి పెంచేలా వ్యవహరించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థులు గ్రామస్తులపై వరాల జల్లు కురిపిస్తున్నారు.